• గతంలో కూడా ఈ ప్రభుత్వం సీఎఫ్ఎంఎస్ తో పనిలేకుండా రూ.41వేలకోట్లను వాడుకుంది
• ఆసొమ్ము ఏంచేశారని కాగ్ ప్రశ్నిస్తే సమాధానం లేదు. ఇప్పుడుజరిగిన రూ.97వేలకోట్ల దుర్వినియోగంపై కూడా ప్రభుత్వం కాగ్ కు స్పష్టత ఇవ్వలేదు
• రాజ్యాంగంలోని ఆర్టికల్ 266 ప్రకారం ప్రభుత్వం ప్రజలసొమ్ము ఖర్చుచేసేటప్పుడు సమాధానంచెప్పాల్సిందే
• అప్పులకోసం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల అభిప్రాయాలు తీసుకునే ముఖ్యమంత్రికి, ఆర్టికల్ 266 నిబంధనలు తెలియవా?
• రూ.97వేలకోట్ల వ్యవహారంపై ముఖ్యమంత్రి నోరు తెరవకపోతే, తాము న్యాయపరంగా పోరాటంచేస్తాం
• జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని రాష్ట్రం ఐపీస్థాయికిచేరింది. ఇప్పటికే ఏపీ పవర్ కార్పొరేషన్ ను ఐపీసంస్థ గా ప్రకటించారు
– టీడీపీ కేంద్రకార్యాలయ కార్యదర్శి, ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు
వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో కొత్తగా ఆర్థికఅరాచకం పురుడు పోసుకుందని, ముఖ్యమంత్రి చెప్పిందే తమకు వేదమన్నట్లుగా ప్రవర్తించిన అధికారయంత్రాంగం తీరు, ఏపీని కోలుకోలేనివిధంగా దెబ్బతీసిందని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు స్పష్టం చేశారు. గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యా లయంలో విలేకరులతో మాట్లాడారు.
ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
దేశంలోని అన్నిరాష్ట్రాల ఆర్థికస్థితిగతులపై ఏటా కేంద్రప్రభుత్వపరి ధిలోని కాగ్ ఇచ్చే నివేదికల్లోని అంశాలే ఏపీ ఆర్థికపరిస్థితి దిగజా రిందని చెబుతున్నాయి. జూన్ 2019 నుంచి డిసెంబర్ 2021 వర కు, రూ.97వేలకోట్లసొమ్ముని ఏపీప్రభుత్వం బడ్జెట్ కంట్రోల్ లేకుం డా విచ్చలవిడిగా దుబారాచేసినట్లు నివేదికలో పేర్కొన్నారు. ఉదాహరణకి రాష్ట్ర బడ్జెట్ రూ.5లక్షలకోట్లుగా ఉంటే, దానిలో దాదా పు రూ.లక్షకోట్లసొమ్ముని బడ్జెట్ లెక్కలతో సంబంధంలేకుండా ఖర్చుపెట్టారని కాగ్ కేంద్రానికి తెలియచేసింది. దానిపై ఏపీప్రభు త్వాన్ని ప్రశ్నిస్తే, ఈపాలకులనుంచి స్పందనలేదు.
ప్రభుత్వాలు ఇష్టానుసారం నిధులు దుర్వినియోగంచేయకూడద న్న సదుద్దేశంతోనే రాజ్యాంగంప్రకారం పార్లమెంట్, అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టి, నిధులకేటాయింపుల వివరాలను, రాబడి వ్య యాలను ప్రజలకు వివరిస్తారు. ఈ సంప్రదాయాన్ని కేంద్రప్రభుత్వ మే కాకుండా అన్నిరాష్ట్రాలు అమలుచేస్తున్నాయి.కానీ అందుకు విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, 150 అంశా లకు సంబంధించి రూ.97వేలకోట్లను బడ్జెట్ అనుమతులు లేకుం డా ఖర్చుపెట్టింది. ప్రభుత్వచర్యను కాగ్ తీవ్రంగా తప్పుపట్టింది.
దానిగురించి ఏపీపాలకుల్ని ప్రశ్నిస్తూ లేఖలురాసినా వారినుంచి సమాధానంలేదు. ఏపీప్రభుత్వం అన్నిరాష్ట్రాలకంటే ఎక్కువగా వడ్డీలుచెల్లిస్తూ బాండ్లుకొంటోంది. అప్పులు తెస్తూ, వాటిని తీర్చ డానికి మరలా కొత్త అప్పులు తెస్తోంది. చివరకు కేంద్రప్రభుత్వం , ఏపీకి అప్పులిస్తే కేంద్రానికి ఎలాంటిసంబంధంలేదని బ్యాంకులకు చెప్పడంజరిగింది. ఇలాంటి దుస్థితి ఆంధ్రప్రదేశ్ కుతప్ప మరేరాష్ట్రా నికి రాలేదు. రాష్ట్రం ఆర్థికంగా దివాళాతీస్తోందన్న అంశం కేవలం ప్రభుత్వానికి, పాలకులకు, ఆర్థికనిపుణులకు మాత్రమే సంబంధిం చిన అంశంకాదు.
కష్టపడిన సొమ్ము నుంచి ప్రభుత్వానికి పన్నులు కడుతున్న ప్రజలందరూ ఏపీ ఆర్థిక దుస్థితిపై ఆలోచించాలి. రాష్ట్రాన్ని కోలుకోలేని విధంగా అప్పులరొంపిలోకి దింపిన వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీయాలి. లేకపోతే రాష్ట్రపాలకుల ఆర్థిక నేరాలు ప్రజలకుశాపంగా మారతాయి అనడంలో ఎలాంటిసందేహం లేదు. రూ.లక్షకోట్లసొమ్ముని ఏంచేశారో, దేనికి వినియోగించారో లెక్కలు చెప్పకుండా ప్రభుత్వం ప్రతిపక్షాలపై, ప్రశ్నించేవారిపై ఎదురుదాడి చేస్తోంది.
ఉద్యోగ సంఘాల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించినట్లు ప్రభు త్వం కలరింగ్ ఇస్తోంది. వాస్తవానికి ఉద్యోగుల సమస్యలు ఏవీ పరిష్కారంకాలేదు. ఉద్యోగుల ధర్నాలు, ఆందోళనని ప్రభుత్వం తొక్కిపెట్టింది. 19-01-2022న ప్రభుత్వప్రధాన కార్యదర్శి ఉద్యోగు లకు ఇచ్చిన 20పేజీల నోట్ లో రాష్ట్రఆర్థికపరిస్థితి గురించి వివరిం చారు. దానిలో చెప్పినదానిప్రకారం రాష్ట్రానికి కేంద్రం నుంచి రావా ల్సిన నిధులు తగ్గాయని, ఏపీకి ఆదాయం తగ్గిందని, కోవిడ్ వల్ల రాష్ట్రానికి రూ.30వేలకోట్లు అదనంగాఖర్చు అయ్యాయన్నారు. ప్రభుత్వంవద్ద డబ్బులేదుకాబట్టి, ఉద్యోగుల డిమాండ్లు తాము పరిష్కరించలేమని పరోక్షంగా ప్రభుత్వమే సదరునోట్ లో చెప్పడం జరిగింది.
కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 03-01-2022న ప్రధానమంత్రిని కలిసినప్పుడు ఒక రిప్రంజటేషన్ ఇచ్చారు. దాని కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన డివల్యూషన్ ఫండ్స్ తగ్గాయని , పునర్విభజన చట్టంప్రకారం రాష్ట్రానికి రావాల్సిన వాటిని అందిం చాలని చెప్పుకొచ్చారు. అలానే కోవిడ్ వల్ల ఏపీప్రభుత్వం ప్రజల కు రూ.8వేలకోట్లుఖర్చుపెట్టిందని కూడా ముఖ్యమంత్రి తన రిప్రంజటేషన్ లో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ప్రధానికి రాసిన లేఖ లో కోవిడ్ వల్ల రూ.8వేలకోట్లు ఖర్చుఅయ్యాయనిచెబితే, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఉద్యోగసంఘాలకు రాసిన లేఖలో రూ.30వేల కోట్లు ఖర్చుపెట్టామనిచెప్పారు.
ఈ విధంగా అబద్ధాలు చెప్పడం, అంకెలగారడీ చేయడం, ప్రజలను, వ్యవస్థలను మోసగించడం అనేది ఈప్రభుత్వానికి కొత్తకాదు. గతంలోకూడా సీఎఫ్ఎంఎస్ కు వెళ్లకుండా ఏపీప్రభుత్వం రూ.40వేలకోట్లు ఖర్చుపెడితే, దానిపై కూడా కాగ్ నిలదీసింది. అదేఅంశంపై పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ కూడా సమాధానంచెప్పాలని డిమాండ్ చేశారు.
గతంలో వైసీపీప్రతిపక్షంలోఉన్నప్పుడు అప్పుడు పీఏసీ ఛైర్మన్, ఇప్పటి ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, నాటిప్రభుత్వ ఖర్చు లపై అనేకమార్లు ప్రశ్నించారు. గతప్రభుత్వం అంతా సవ్యంగా పద్ధ తిప్రకారమే చేసినా తప్పుపట్టారు. మరిప్పుడు అదే బుగ్గన రాజేం ద్రనాథ్ రెడ్డి తాము అడిగేప్రశ్నలకు, మరీముఖ్యంగా కాగ్ అభ్యం తరాలకు ఎందుకు సమాధానంచెప్పడంలేదు? అసలు వైసీపీప్రభు త్వం వచ్చాక పీఏసీ సమావేశాలే నిర్వహించడంలేదు.
ఎందుకు పెట్టడంలేదని ప్రతిపక్షం ప్రశ్నిస్తుంటే ఆర్థికశాఖాధికారులు, ఆర్థిక శాఖమంత్రి ఏదేదోచెప్పి తప్పించుకుంటున్నారు. 2సంవత్సరాల 8 నెలల్లో ఒక్కటంటే ఒక్క పీఏసీ సమావేశంకూడా నిర్వహించలేదంటే ప్రభుత్వం ఎంతగా తప్పించుకుంటోందో అర్థమవుతోంది.ఆర్థికశాఖ అప్పులకోసం ఢిల్లీచుట్టూ తిరుగతోందితప్ప, రాష్ట్రంలో జరిగేవాటిపై స్పందించడంలేదు. అమరావతికి రైతులిచ్చినభూముల్ని కూడా అప్పులకోసం దుర్మార్గంగా ప్రభుత్వం తాకట్టుపెట్టేస్థితికి వచ్చింది. విశాఖపట్నం లోని 1600ఎకరాలను అలానే తాకట్టుపెట్టారు. అలానే మద్యంపై ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని ఒకేసారి 25ఏళ్లకు తాకట్టుపెట్టి మరీ ప్రభుత్వం రూ.23.500కోట్లఅప్పులుతెచ్చింది. దాన్నికేంద్రం తప్పుపట్టినా కూడా ముఖ్యమంత్రి సమర్థించుకున్నారు.
అప్పులకోసం సుప్రీంకోర్టు మాజీన్యాయమూర్తి అభిప్రాయం తీసు కున్నామనిచెబుతున్న ముఖ్యమంత్రి, ప్రభుత్వం రాజ్యాంగంలోని ఆర్టికల్ 266ను ఎందుకు ఫాలో కాదని ప్రశ్నిస్తున్నాం. ప్రభుత్వమే ప్రభుత్వఆస్తులు, భూములు తనఖాపెట్టి అప్పులు తేవడం తప్పని కేంద్రంచెబుతుంటే, ముఖ్యమంత్రి నిస్సిగ్గుగా తన చర్యలను సమర్థించుకోవడం సిగ్గుచేటు. బడ్జెట్ ను మించి ప్రభుత్వాలు ఖర్చుచేయడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 266కు విరు ద్ధమనే అంశాన్ని ముఖ్యమంత్రి మర్చిపోతేఎలా?
బడ్జెట్ అనేపదానికి ఈ ముఖ్యమంత్రి కొత్త అర్థంచెప్పారు..చెబుతు న్నారు. స్కీములు,స్కాములు చేయడమే బడ్జెట్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో అన్నివస్తువుల ధరలు పెంచేశారు. డీజిల్ పెట్రోల్ సహా, నిత్యావసరాలు, విద్యుత్ ఛార్జీలు, ఇతరత్రా పన్నులు దారుణంగాపెంచి ప్రజలనుదోచుకుంటున్నారు. ఆ విధం గా వస్తున్న సొమ్మంతా ఎటుపోతోందో తెలియదు.ఇలాంటి వాటిపై ప్రశ్నిస్తే ప్రతిపక్షనేతలను అరెస్ట్ లుచేయడం చేస్తారు. ఒకవ్యక్తిని భౌతికంగా ఇబ్బందిపెట్టడమేకాకుండా, రాష్ట్ర ఆర్థికవ్యవస్థనుకూడా పూర్తిగా దిగజార్చారు. రాష్ట్రంలో ఫలానా వ్యవస్థబాగుందని చెప్పడానికి లేకుండాపోయింది. ముఖ్యమంత్రి అమలుచేస్తున్నసంక్షేమపథకాలుకూడా అరకొరగానే అమలవు తున్నాయి. అమ్మఒడి పథకం అందరికీ అమలుకావడంలేదు.. రైతుభరోసా, పెట్టుబడిరాయితీ, డ్వాక్రామహిళలకు నిధులు, 45 ఏళ్లు నిండినవారికి ఇస్తామన్నఆర్థికసాయం ఇలాఅనేకవిషయా ల్లో ప్రభుత్వం లబ్ధిదారులకు కొర్రీలుపెడుతూనే ఉంది.
బడ్జెట్తో సంబంధం లేకుండా రూ.లక్షకోట్లు దుర్వినియోగంచేశారం టే అంతకంటే దారుణం మరోటి ఉందా? మాకు 150 సీట్లున్నాయి .. ఏమైనా చేస్తాం అంటేకుదరదు. ఆర్టికల్ 266ప్రకారం బడ్జెట్లో జరిగే అవకతవకలు, నిధులదుర్వినియోగంపై ప్రభుత్వాన్ని ప్ర శ్నించే హక్కుమాకుంది. రూ.97వేలకోట్లు దుర్వినియోగంపై ము ఖ్యమంత్రి సమాధానంచెప్పాల్సిందే.
తక్షణమే ఆ సొమ్ము తాలూకా వివరాలపై ముఖ్యమంత్రి పూర్తివాస్తవాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అధికారంఉందికదా అని ఇష్టమొచ్చినట్టుచేస్తాము..రాష్ట్రాన్ని దోచుకొని సర్వనాశనంచేస్తా మంటేచూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నాం. రూ.97వేల కోట్ల నిధులదుర్వినియోగంపై ముఖ్యమంత్రి స్పందించకుంటే తాము న్యాయపరమైన పోరాటానికి దిగడానికికూడా వెనుకాడేది లేదని తేల్చిచెబుతున్నాం.
నేనేదో ఫోర్జరీ చేశానంటూ నాపై తప్పుడుకేసులుపెట్టారు. మరి రాష్ట్రఆర్థికపరిస్థితిపై తప్పుడులెక్కలుచెప్పినందుకు ముఖ్యమంత్రి పై కేసుపెట్టాలా..లేక ప్రభుత్వప్రధాన కార్యదర్శిపై పెట్టాలా? ఆర్థిక మంత్రేమో పిట్టకథలు, హరికథలుచెబుతూకాలక్షేపం చేస్తుంటాడు.
అశుతోష్ మిశ్రా కమిటీనివేదికను ఉద్యోగసంఘాలుఎలాగైతే ప్ర భుత్వంనుంచి తీసుకున్నాయో, అలానే టీడీపీకూడా ప్రభుత్వం సాగిస్తున్న ఆర్థికఅరాచకాలకు చెక్ పెట్టేందుకు పోరాడుతుంది. ప్రభుత్వం ఇప్పటికే రూ.7లక్షలకోట్ల అప్పులుచేసింది. రాష్ట్రాభివృ ద్ధికి, ప్రజాక్షేమానికి వినియోగించాల్సిన ప్రజలసొమ్ముని కేవలం ఒకవ్యక్తి స్వార్థంకోసం దుర్వినియోగంచేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా?
ప్రజలు రోడ్లులేకపోయినా రోడ్లపన్నుకడుతున్నారు…. ఆదా యం లేకపోయినా, ఆదాయపుపన్నుకడుతున్నారు. మరి వారి నుంచి ఇష్టమొచ్చినట్లు దోచుకుంటున్నదంతా ఈప్రభుత్వం ఏం చేస్తోందని తాముప్రశ్నించకూడదా? అది రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కు, ఆవిషయం పాలకులు గుర్తిస్తే మంచిది.