– మత్స్యకారులకు జరుగుతున్న అన్యాయాన్ని ముక్తకంఠంతో ప్రశ్నిద్దాం
– మత్స్యకారుల భవిష్యత్తు కోసం ఐక్యంగా పోరాడుదాం
– యలగాల నూకానమ్మ
జాతీయ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ఇంచార్జ్ మరియు మహిళా అధ్యక్షురాలు యలగాల నూకానమ్మ మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజ మెత్తారు.
రాష్ట్ర వ్యాప్తంగా 2800 సొసైటీలకు పొట్ట కొట్టే విధంగా లక్షలాది మంది మత్స్యకారులు రోడ్డున పడే విధంగా జగన్ రెడ్డి ప్రభుత్వం జీవో నెంబర్ 217 రూపొందించిందని అన్నారు. గతంలో ప్రభుత్వమే చేప పిల్లలను అందించేదని, వాటి పైన వచ్చిన సంపదను మత్స్యకారులు తీసుకునే వారని అన్నారు.
వైకాపా ప్రభుత్వం ఏర్పడ్డాక, మత్స్యకారులను పట్టించుకోక పోగా,మత్స్యకారుల సంపదను దళారులకు దొచిపెట్టే జీవోలను ప్రవేశపెట్టారని అన్నారు.
217 జీవోను వెంటనే రద్దు చేయాలని 13 జిల్లాల నుంచి జాతీయ బిసి సంక్షేమ సంఘ 13 జిల్లాల అధ్యక్షులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నియోజకవర్గ అధ్యక్షులు అందరూ కూడా మత్స్యకారులకు జరుగుతున్న అన్యాయం మీద పోరు బాట పట్టాలని మత్స్యకార సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర మాజీ మంత్రి వర్యులు కొల్లు రవీంద్ర చేపట్టిన నిరసన కార్యక్రమానికి జాతీయ బిసి సంక్షేమ సంఘం పూర్తి మద్దతు ఇస్తుందని ప్రతి జిల్లాల లో కూడా మత్స్యకారుల సమస్యలమీద పోరాటం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.