Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం 95 శాతం రాష్ట్రాన్ని లూటీ చేసింది

టిడిపి రాష్ట్ర కమిటీ సమావేశంలో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముగింపు ప్రసంగం:-

రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం 95 శాతం హామీలు నెరవేర్చడం కాదు…95 శాతం రాష్ట్రాన్ని లూటీ చేసింది
• టిడిపి వచ్చి ఉంటే నేడు పెన్షన్ మూడువేలు ఇచ్చే వాళ్లం….పెన్షన్ పై వైసిపి హామీ ఏమయ్యింది.
• అన్న క్యాంటీన్ లు మూసివేశారు….ఇప్పుడు అన్నం పెడుతుంటే దాడులు చేస్తున్నారు.
• విదేశీ విద్య పథకం ఏమయ్యింది…అన్ని పథకాలకు కోతలు పెడుతున్నారు.
• స్కూళ్లు విలీనం పేరుతో పాఠశాలలు మూసివేస్తున్నారు.
• రంజాన్ తోఫా, పెళ్లి కానుక, విదేశీ విద్య పథకాలు ఏమయ్యాయి.
• రైతు భరోసా అంటూ కేంద్రం ఇచ్చిన డబ్బులు కూడా మీ ఖాతాలో వేసుకుంటున్నారు.
• రాష్ట్రంలో మైక్రో ఇరిగేషన్ పోయింది…..రైతుకు దక్కాల్సిన అన్ని సబ్సిడీలు పోయాయి.
• బిడ్డ పుట్టిన నాటినుంచి మనిషి చనిపోయే వరకు పథకాలు అందించాం.
• సంపద సృష్టించి సంక్షేమం చేసిన పార్టీ టిడిపి
• ఆర్థిక అసమానతలు తగ్గించడం టిడిపి సిద్దాంతం….సంక్షేమం అనేది మొదలు పెట్టిందే టిడిపి
• వైసిపి పాలనలో రాష్ట్రం ఎలా దివాళా తీసిందో ప్రజలకు వివరించాలి.
• పార్టీలో మాటలు ఎంత ముఖ్యమో చేతలు అంతే ముఖ్యం
• ఇక్కడ మాటలు చెప్పి బయటకు వెళ్లి పని చెయ్యకుండా ఉంటే కుదరదు
• నేను జిల్లా పర్యటనలు చేస్తున్నా….ఇంచార్జ్ లకు సమయం ఇస్తున్నా…..కార్యకర్తలకు సమయం ఇస్తున్నా.
• నేతలు కూడా పక్కా కార్యాచరణ తో పని చెయ్యాలి…ఎన్నికలకు ఎక్కువ సమయం లేదు. పోరాటినికి సిద్దం అవ్వాలి.

LEAVE A RESPONSE