హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై కక్షతో మార్ఫింగ్ చేసి న్యూడ్ వీడియోని సృష్టించారని సీఐడీ కి గోరంట్ల మాధవ్ ఫిర్యాదు చేశారు. తన లెటర్ హెడ్‌పై దర్యాప్తు జరపాల్సిందిగా సీఐడీ అడిషనల్ డీజీకి మాధవ్ లేఖ రాశారు. మార్ఫింగ్ వీడియోను ఐటీడీపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందని లేఖలో పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో ఐటీడీపీ పని చేస్తుందని.. దీనికి చింతకాయల విజయ్ నారా లోకేష్ లు కూడా ఉన్నారని తెలిపారు. దీంతో సీఐడీ అధికారులు రంగంలోకి దిగారు. మాధవ్ ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నెంబరు 12/2022తో కేసు నమోదు చేసింది.