జగన్ పరిపాలనలో అర్చకుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది

టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్

జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అర్చకుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అధికారంలోకి వస్తే బ్రాహ్మణులకు అదిచేస్తాం, ఇది చేస్తామని ఆచరణకు నోచుకోని హామీలిచ్చి, ఓట్లు దండుకుని జగన్మోహన్ రెడ్డి బ్రాహ్మణులను నమ్మించి మోసం చేశారు. బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ ను నామమాత్రపు కార్పొరేషన్ గా వైసీపీ ప్రభుత్వం మార్చింది. రూ.100కోట్లు కార్పొరేషన్ కు కేటాయించి ఒక్క పైసా కూడా ఖర్చుచేయలేదు. అధికారంలోకి వస్తే రాష్ట్రవ్యాప్తంగా 8600 దేవాలయాలకు దూపదీప నైవేద్యం క్రింద నిధులు ఇస్తామని జగన్ హామీ ఇచ్చి మాటతప్పారు. ప్రతిఏటా బడ్జెట్ లో బ్రాహ్మణుల సంక్షేమానికి నిధులు కేటాయించినా, వాటిని వినియోగించకుండా ఆ నిధులను కూడా దారిమళ్లించి బ్రాహ్మణులకు ద్రోహం చేస్తున్నారు.

రూ.10వేలు వేతనాలున్న అర్చకులకు రూ.15,625కు రూ.5వేలు వేతనం వచ్చే అర్చకులకు రూ.10వేలు ఇస్తామని ఇచ్చిన హామీ, దీనికి సంబంధించిన జీవో కు నేటికీ మోక్షం కలగలేదు. అర్చకులకు రిటైర్మెంట్ లేదని ఇచ్చిన హామీనీ జగన్ ప్రభుత్వం గాలికొదిలేసింది. టీడీపీ అధికారంలో ఉండగా 45వేల మంది పేద బ్రాహ్మణులకు పెన్షన్లు ఇస్తే, ఈ ప్రభుత్వం వచ్చిని తర్వాత ఆ సంఖ్యను భారీగా తగ్గించిందని బ్రాహ్మణ చైతన్య వేదిక ఆరోపిస్తోంది. వైఎస్ఆర్ పెన్షన్ 10వేల మంది బ్రాహ్మణులకు కూడా అందని పరిస్థితి ఉంది.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1,54,182మంది బ్రాహ్మణులకు వివిధ సంక్షేమ పథకాలు అందాయి. గాయత్రి పథకం ద్వారా ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూళ్లు, కాలేజీల్లో మెరిట్ సాధించిన 761మంది బ్రాహ్మణ విద్యార్థులకు రూ.76లక్షలు ఖర్చుచేశారు. విదేశీ విద్యకోసం 88,682మందికి రూ.119.22కోట్లు, వేదవ్యాస్ పథకం కింద వేదవిద్య కోసం 155 మందికి రూ.21.60లక్షలు, వశిష్ట పథకం కింద పోటీ పరీక్షల్లో శిక్షణ కోసం 377మందికి రూ.1.22కోట్లు అందించారు. కేంద్రం ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల వారి కోసం ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లు ప్రతిపాదించింది. టీడీపీ అధికారంలో ఉండగా కాపు, ఇతర అగ్రవర్ణాల వారికి మొత్తం 10శాతం రిజర్వేషన్ల కల్పించింది.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటిని రద్దు చేసింది. గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగుల నియామకాల్లో వేలాదిమంది బ్రాహ్మణ యువత అవకాశాలు కోల్పోయారు. అగ్రవర్ణాల పేదలకు మొత్తం 38వేలకు పైగా పోస్టులు దక్కలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఎన్నికలకు ముందు బ్రాహ్మణులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. బ్రాహ్మణ కార్పొరేషన్ కు బడ్జెట్ లో కేటాయించిన నిధులను అమలు చేయాలి. ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతున్నాం.

Leave a Reply