Suryaa.co.in

Andhra Pradesh

జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు విజయవంతం కావాలి

-రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామ కృష్ణారెడ్డి
-మల్లెతీగ ఆధ్వర్యంలో నవంబర్ 19, 20 తేదీలలో జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు
-జాతీయ సాంస్కృతిక ఉత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామ కృష్ణారెడ్డ

జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు విజయవంతం కావాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామ కృష్ణారెడ్డి ఆకాంక్షించారు. మల్లెతీగ ఆధ్వర్యంలో నవంబర్ 19, 20 తేదీలలో విజయవాడలో నిర్వహించనున్న జాతీయ సాంస్కృతిక ఉత్సవాల పోస్టర్ ను గురువారం తన కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామ కృష్ణా రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ఆంజనేయులు, మల్లెతీగ పత్రిక సంపాదకులు కలిమి శ్రీ, నేటి దినపత్రిక సూర్య అమరావతి బ్యూరో చీఫ్ ఇస్కా రాజేష్ బాబు, అంతిమతీర్పు దినపత్రిక సంపాదకులు వల్లూరు ప్రసాద్ కుమార్, ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహన రావు , నవ్యాంధ్ర రచయితల సంఘం చొప్పా రాఘవేంద్ర శేఖర్, ఏపీ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ కన్వీనర్ కే. మునిరాజు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా కలిమి శ్రీ మాట్లాడుతూ సాహిత్య, సాంస్కృతిక, కళా రంగాలకు సంబంధించిన ఏవో చిన్న చిన్న పుస్తకావిష్కరణలు తప్ప కవులు, రచయితలు, కళాకారులు మనస్ఫూర్తిగా పాల్గొనే, హృదయపూర్వకంగా ఆస్వాదించే కార్యక్రమాలేవీ జరగడం లేదని. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా సాంస్కృతిక రాజధాని విజయవాడలో. ఈ విషయంలో వారంతా ఎంతో అసంతృప్తిగా ఉన్నారని సజ్జల రామకృష్ణా రెడ్డి కి వివరించారు. కళల్ని, సాహిత్యాన్ని ఏమాత్రం స్పృశించని, ప్రోత్సహించని సంవత్సరాలుగా ఈ రెండున్నర సంవత్సరాల్ని వారు వెలివేస్తున్నారని, ఇలాంటి గడ్డకట్టిన సందర్భాల్ని, మోడువారిన సాంస్కృతిక వాతావరణాన్ని, అగాధంలా ఏర్పడిన ఒక పెద్ద శూన్యతని ‘మల్లెతీగ’ సాహిత్య
సేవాసంస్థ గుర్తించిందని పేర్కొన్నారు. అందుకే విజయవాడలో రెండు రోజుల పాటు కవులు, రచయితలు, కళాకారుల కోసం ఓ మెగా కార్యక్రమాన్ని రూపొందించినట్లు చెప్పారు. ‘జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు’ పేరుతో నవంబరు 19, 20 తేదీలు శని, ఆదివారాల్లో ఒక గొప్ప కార్యక్రమాన్ని తలపెట్టామని, గతంలో ఇలాంటి కార్యక్రమాల నెన్నింటితో ‘మల్లెతీగ’ విజయవాడ, అవనిగడ్డలలో నిర్వహించి, విజయవంతమైంది.

రెండు రాష్ట్రాలకు చెందిన తెలుగు కవులు, రచయితలు, కళాకారుల మనసుల్ని సంతోషపర్చింది. అందరి ప్రశంసలు అందుకుందన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వున్న కవులు, రచయితలు, కళాకారులు, అలాగే తెలంగాణలో నివసిస్తూ అక్కడ వెలివేయబడుతున్న ఏపీకి చెందిన కవులు, రచయితల్నీ, ఇతర రాష్ట్రాల్లో నివసించే తెలుగు కళాకారుల్ని, రచయితల్నీ ఈ వేదికపైకి తెచ్చేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకుంది మల్లెతీగ.

2022 నవంబరు 19 శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు 20వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ముగుస్తాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో ‘సాహిత్యంలో వస్తున్న మార్పులపై చర్చలు, కొత్తతరం రచయితల కోసం లబ్దప్రతిష్టులైన రచయితలతో సాహిత్య శిక్షణా తరగతులు, ఆయా రంగాల్లో సేవచేసిన కళాకారులకు, రచయితలకు సత్కారాలు, సన్మానాలు, కవి సమ్మేళనాలు,కొత్త పుస్తకావిష్కరణలు, కళారూపాల ప్రదర్శనలు ఉంటాయని కలిమి శ్రీ తెలిపారు.

LEAVE A RESPONSE