36 వ జాతీయ క్రీడలు ప్రారంభమైన సందర్భంగా క్రీడాకారులకు శుభాకాంక్షలు

టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా 36వ జాతీయ క్రీడలు ప్రారంభమైన సందర్భంగా క్రీడాకారులకు శుభాకాంక్షలు. 2002లో టిడిపి ప్రభుత్వ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జాతీయ క్రీడలను ఎంతో ఘనంగా నిర్వహించాం. హైదరాబాద్ తో పాటు విశాఖను కూడా నాడు క్రీడా వేదికగా చేశాం.ఒంగోలు గిత్తను ‘వీర’ పేరుతో మస్కట్ గా పెట్టి నిర్వహించిన జాతీయ క్రీడల ద్వారా దేశం దృష్టిని ఆకర్షించాం. ఆ సందర్భంగా దేశానికే తలమానికంగా ఉండేలా హైదరాబాద్ లో పలు స్టేడియాలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్ ల నిర్మాణం చేపట్టాం. నాటి జాతీయ క్రీడల నిర్వహణతో ప్రజల్లో క్రీడాభిలాషను కలిగించి, అనేక మంది క్రీడలను తమ జీవిత లక్ష్యంగా ఎంచుకునే వాతావరణం కల్పించాం అని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తాను.

Leave a Reply