ఎరువులు, డీఏపీ కృత్రిమ కొరతపై సమగ్ర విచారణ

– మోదీ, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తోమర్ కు లేఖలు రాసిన నారా లోకేష్

రాష్ట్రంలో ఎరువులు, డీఏపీ కృత్రిమ కొరతపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తోమర్ లకు విడివిడిగా లేఖలు రాసిన నారా లోకేష్
బ్లాక్ మార్కెటింగ్ ను నివారించి రైతుల్ని ఆదుకునేందుకు యుద్ధప్రాతిపదికన డీఏపీ సరఫరా పెంచాలని విజ్ఞప్తి. సహకార సంఘాలకు డీఏపీ సరఫరాలో కోత విధించి, ఆర్బీకేలకు మళ్లించామని చెప్తూ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ప్రధానికి లోకేష్ ఫిర్యాదు.

ఆంధ్రప్రదేశ్‌లో డీఏపీ, ఎరువులకు తీవ్ర కొరత ఏర్పడటంతో ఖరీఫ్ పంటలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది.కేంద్ర ప్రభుత్వం 2.25లక్షల టన్నుల డీఏపీని కేటాయించినా రాష్ట్ర ప్రభుత్వం బ్లాక్ మార్కెటింగ్ , అసమర్థ విధానాలతో కృత్రిమ కొరత ఏర్పడింది. కొంతమంది రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు డీఏపీ ఎరువుల్ని ఆదాయవనరుగా మార్చుకునేందుకు పంపిణీ విధానాన్ని మార్చేశారు. సహకార సంఘాల ద్వారా పంపిణీ చేయాల్సిన ఎరువుల్ని వైకాపా ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలకు మళ్లించింది.

అయితే ఆర్బీకేల్లో డీఏపీ అందుబాటులో ఉండట్లేదు. దీంతో రైతులు బహిరంగ మార్కెట్ లో 50కేజీల డీఏపీ బస్తాను రూ.300వరకూ అదనంగా చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించి డీఏపీ సరఫరా పెంచి కృత్రిమ కొరత, బ్లాక్ మార్కెటింగ్ నుండి రైతుల్ని కాపాడాలని కోరిన నారా లోకేష్

Leave a Reply