ముఖేశ్ అంబానీ దుబాయిలో కొన్న విల్లా ఖరీదు… రూ.640 కోట్లు

దుబాయిలోని కృత్రిమంగా ఏర్పాటు చేసిన పామ్ జుమేరా దీవిలో ముఖేశ్ అంబానీ ఓ ఖరీదైన విల్లాను కొనుగోలు చేశాడు.తన చిన్నకుమారుడు అనంత్ కోసం తీసుకున్న ఈ విల్లా ఖరీదు రూ.640 కోట్లు.ఇందులో పది బెడ్రూంలు, ఒక ఇండోర్ స్విమ్మింగ్ పూల్, మరో అవుట్ డోర్ స్విమ్మింగ్ పూల్, పర్సనల్ స్పా ఉన్నాయి. ప్రపంచ కుబేరులు ఇక్కడ ఓ విల్లా కలిగి ఉండడాన్ని ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారు. షారుఖ్ ఖాన్ కు కూడా ఈ ఐలాండ్ లో విల్లా ఉంది.

Leave a Reply