ఆర్టీసీ బస్సు కిటికీలో ఇరుక్కున్న ఓ వ్యక్తి తల

టెక్కలి ఇందిరా గాంధీ జంక్షన్ వద్ద బుధవారం ఓ వ్యక్తి తల బస్సు కిటికీలో ఇరుక్కుంది. సంతబొమ్మాలికి చెందిన సుందర్ రావు అనే వ్యక్తి ఉమ్ము ఉసెందుకు ఆర్టీసీ బస్సులో ఉన్న ఎమర్జెన్సీ కిటికీ డోర్ నుంచి తల బయటకు పెట్టాడు.

ఇంకేముంది ఒక్కసారిగా కిటికీ సందులో తల ఇరుక్కుపోయి సుమారు 15 నిమిషాలు అవస్థలు పడ్డారు. తోటి ప్రయాణికులు గుర్తించి డ్రైవర్కు విషయం తెలపడంతో బస్సును టెక్కలిలో ఆపి స్థానికుల సహాయంతో తలను బయటకు తీశారు.

Leave a Reply