Home » రాజధాని రైతుల ధీరత్వానికి ఉధ్యమాభివందనాలు

రాజధాని రైతుల ధీరత్వానికి ఉధ్యమాభివందనాలు

– మహిళా మణులకు పాదాభివందనాలు
– రాజధాని కోసం పోరాడుతున్న రైతున్నలకు కేడీల పాలనలో బేడీలు
– దేశంలోనే 1500 రోజుల పాటు ఉద్యమించిన చరిత్ర అమరావతి రైతులకే దక్కుతుంది
-టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు

ప్రజా రాజధాని అమరావతి విధ్వంసానికి శ్రీకారం చుట్టి జనవరి 25 నాటికి 1500 రోజులు పూర్తవుతుంది. రాష్ట్ర భవిష్యత్ కోసం నిర్మించ తలపెట్టిన అమరావతిని పూర్తి చేయలేని పాలకులు మూడు రాజధానులంటూ రాష్ట్రం పరువు తీశారు. ఏపీకి రాజధాని ఏది? అనే ప్రశ్నకు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలను దిగజార్చారు.

నాలుగున్నరేళ్లలో ఉద్యమాన్ని అణగదొక్కేందుకు, రైతుల గొంతు నొక్కేందుకు జగన్ రెడ్డి ప్రభుత్వం చేయని అరాచకాలు లేవు.రాజధాని కోసం రైతులు పాదయాత్ర చేపడితే జగన్ రెడ్డి దానిని విధ్వంసం చేసి ప్రజల మనోభావాల్ని దెబ్బతీస్తున్నారు. అమరావతి ఉద్యమాన్ని అణచివేసేందుకు వైసీపీ ప్రభుత్వం మొదటి నుండి ప్రయత్నం చేస్తూనే ఉంది. దానిలో భాగంగానే 144 సెక్షన్, పోలీసు చట్టంలో సెక్షన్ 30 వంటివి ప్రయోగించి గ్రామాల్నీ తన గుప్పిట్లో పెట్టుకుని అరాచకాలకు తెగబడ్డారు.

ప్రజా రాజధాని అమరావతి కోసం 1500 రోజులుగా ఉధ్యమాలు చేస్తున్న రైతులు, మహిళలు పెయిడ్ ఆర్టిస్టులంటూ అవమానాలకు గురి చేశారు. రాజధాని మహిళల కట్టుబొట్టులపై కూడా విమర్మలకు పాల్పడ్డారు. ఆఖరికి కేడీల పాలనలో రైతన్నలకు బేడీలు వేసిన నీచ చరిత్ర జగన్ రెడ్డిది.

పోలీసుల లాఠీ దెబ్బల్ని ,హింసాకాండను తట్టుకుని ,మహిళలు ,రైతులు ముందు వరుసలో ఉండి అమరావతి ఉద్యమాన్ని నడిపించడం వారి ధీరత్వానికి నిదర్శనం.

న్యాయ దేవతని నమ్ముకున్న రైతులు హైకోర్టు, సుప్రీంకోర్టులకు వెళ్ళి వరుస విజయాలు సాధించడం జగన్ రెడ్డికి చెంప పెట్టు. అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం 33 వేల ఎకరాల భూములిచ్చిన రైతున్నల మనోభావలను దెబ్బతీసేలా జగన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు.

అమరావతి పోరాటంలో 275 మంది రైతుల మరణానికి జగన్ రెడ్డి కారకులయ్యారు. నూరు గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు చస్తుందన్నట్లుగా 151 సీట్లు వచ్చాయని విర్రవీగుతున్న జగన్ రెడ్డికి ఒక్క అమరావతి అంశంతోనే మట్టికరవడం తధ్యం

Leave a Reply