బేగంపేట్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బాధితులు
బేగంపేట్ హక్కి గ్రౌండ్లో నౌకర్ దాండియా నవరాత్రి ఉత్సవ్ ఆర్గనైజర్ కవిత జైన్ ఆధ్వర్యంలో గత కొద్ది రోజులుగా దాండియా వేడుకలు జరుగుతున్నాయి. సోమవారం రాత్రి ఈ వేడుకలకు ఓ ముస్లిం అబ్బాయి ఆశిష్ పేరుతో వచ్చి హిందు అమ్మాయిలతో దాండియా ఆడుతున్నాడు. అనుమానం వచ్చిన కొందరికి విచారించగా ఫరీద్ షాగా అలియాస్ సైఫ్ గా గుర్తించారు.
పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దాండియా వేడుకలు సమయ నిబంధనలు పాటించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కానీ ఆర్గనైజర్ కవిత జైన్ మాత్రం ఇక్కడ హిందు, ముస్లిం అంటూ తేడా లేదని అందరూ అడవచ్చని తెలిపారు. ఆమె ప్రకటనతో తెలంగాణ భజరంగ్ దళ్ కన్వీనర్ శివ రాములు స్పందిస్తూ లవ్ జిహాద్ ను ప్రేరేపించే విధంగా ఆమె ప్రకటన ఉందన్నీ తీవ్ర అభ్యతరం వ్యక్తం చేశారు. అలాంటి ప్రకటనలు చేస్తే దాండియా వేడుకలను అడ్డుకుంటామని హెచ్చరించారు