Home » అహంకారికి అసలైన గుణపాఠం

అహంకారికి అసలైన గుణపాఠం

ప్రజాస్వామ్యంలో నెగ్గిన తర్వాత, కళ్ళు నెత్తి మీదకు తెచ్చుకుని…,ఇక మేమే శాశ్వతం.. ఇక మేమే ఎప్పటికీ పాల”కులం”..అనే దరిద్రులకు, కనువిప్పు ఈ ఎలక్షన్స్.
జనాల దేముంది.. బటన్ నొక్కితే.. నాలుగు డబ్బులు పారేస్తే.. అలా పడి ఉంటారు..

అభివృద్ధి లేకపోయినా..అప్పుల ఊబిలో
రాష్ట్రాన్ని ముంచేసినా..ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టేసినా..
ఉక్కు కర్మాగారం విషయంలో నోరెత్తకపోయినా..
చివరికి లాండ్ టైట్లింగ్యాక్ట్ తో వారి ఆస్తులే దోచేసినా..

ఓట్లు వేసేస్తారు..
ఇంకో అయిదేళ్లు మనమే..
మళ్లీ ఇదే రీతి..
ఇలాగే దోపిడీ..

ఇలా విర్రవీగిపోయిన పార్టీ
ఇప్పుడు చీటీ చిరిగిపోయి
అలో లక్ష్మణా అంటూ
గుండెలు బాదుకుంటోంది..

అయిదేళ్ల క్రితం కనీవినీ
ఎరుగని ఆధిక్యతతో
అందలం ఎక్కిన వైసిపి
ఇంతలోనే అంతకంటే ఘోరమైన పరాజయాన్ని చవిచూసింది.

ఈ మార్పుకి కారణం ఏంటి?

పేర్ని..కొడాలి నానీల నోటి దురుసు..
వారు అంత విచ్చలవిడిగా
మాట్లాడుతుంటే ఆపకుండా
చిరునవ్వులు చిందించిన
అధినేత వైఖరి..

జనం డబ్బు జనానికే పంచుతూ దానకర్ణుడిలా ఫోజులు కొట్టిన వైనం..
ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ భూములు ఆక్రమించుకున్న విధానం..
ముఖ్యమంత్రి ఏకపక్ష నిర్ణయాలు..
ఎవరినీ లెక్క చేయని ఆభిజాత్యం..
తల్లిని..చెల్లెళ్లను కూడా
పక్కన పెట్టేసిన కఠినత్వం..
బాబాయి హత్య ఉదంతంలో
వ్యవహరించిన తీరు..
ఎన్నని చెప్పాలి..
ఏవని ఎత్తి చూపాలి..

రాజధాని వ్యవహారం..
విశాఖలో ఆక్రమణలు..
విజయసాయిరెడ్డి పెత్తనం..
విపక్ష నాయకులపై
కక్ష సాధింపులు..

ప్రాజెక్టులు లేవు..
పరిశ్రమలు రావు..
ఉద్యోగాల ఉసే లేదు..
ప్రభుత్వ ఉద్యోగులకు జరిగిన అవమానాలు..
జీతాలు అందని
దుర్భర క్షోభ!

సలహాదారుల గోల..
కేవలం తన భజనకు..
తన తప్పులను ఒప్పులుగా చూపేందుకు మాత్రమే వారిపై కోట్ల రూపాయల వ్యయం..
సాక్షి టివి..పేపర్ తప్పుడు కథనాలు..

అంతిమంగా..
పవన్ కళ్యాణ్ దీక్ష..
ఆయన పట్టుదల..
ఆయన పంతం..
జగన్ వ్యతిరేక ఓట్లు చీలకూడదన్న నిబద్దత..
ఆయన్ను విశాఖ విమానాశ్రయంలో అడ్డుకున్న
నిరంకుశ ధోరణి..
ప్యాకేజీ స్టార్ అంటూ కుత్సిత బుద్ధితో సాగించిన ప్రచారాలు..

చంద్రబాబు అరెస్టు..

ఫలించని రాయి దెబ్బ వ్యూహం..
పోలీసుల జులుం..

ఇంకా ఎన్ని చెప్పాలి…
చరిత్రలో ఎందరు
నియంతలు కూలిపోలేదు?

పురాణాల నుంచి చరిత్రల వరకు విన్నాం..
ఇప్పుడు కళ్ళారా చూసాం.

మన తరంలో ఒక నియoతకు
గుణపాఠం నేర్పిన అఖండ
జనసమూహంలో మనమూ ఉన్నాం..

ఆయన బటన్ నొక్కుడు అహంకారానికి
మన బటన్ నొక్కుడు
ప్రజాస్వామ్యంతో బదులు చెప్పాం..

పథకాలు ఇచ్చేస్తే..
డబ్బులు పడేస్తే..
ప్రజలు నోరు ముస్తారని
అనుకునే దుర్మార్గపు నాయకుల ఆటలు ఇక సాగవని,
పాలన సాగిపోదని..

ఆంధ్రప్రదేశ్ ప్రజలు
దేశం మొత్తానికి
వేలెత్తి చూపారు.
ఎలుగెత్తి చాటారు..

చేయెత్తి జైకొట్టు తెలుగోడికి..
ప్రతి ఆంధ్రుడికి..

– ఏ.బాబు

Leave a Reply