స్టడీ హాల్ ఏర్పాటు చేస్తా

– అధ్యాపకుల తీసుకొచ్చి వారికి శిక్షణ ఇప్పిస్తా
– జగన్మోహన్ రెడ్డి ఒక్క జాబ్ కేలండర్ కూడా విడుదల చేయలేదు
– టీడీపీ అభ్యర్థి లైబ్రరీ స్టూడెంట్స్ కి సుమారు లక్ష రూపాయల విలువ గల కాంపిటీటివ్ బుక్స్ ను పంపిణీ చేసిన కొలికపూడి
-టీడీపీ అభ్యర్థి లైబ్రరీ స్టూడెంట్స్ కి ఉద్యోగ అవకాశాల కోసం వారికి కావలసిన పుస్తకాలను పంపిణీ చేసిన తిరువూరు టీడీపీ అభ్యర్ధి కొలికపూడి శ్రీనివాసరావు

తిరువూరు అంతా మెట్ట ప్రాంతం. ఈ ప్రాంతం అంతా నీళ్లు లేని ప్రాంతం. వ్యవసాయ అభివృద్ధి,పారిశ్రామిక అభివృద్ధి లేని ప్రాంతంలో పుట్టిన ప్రజలు వ్యవసాయ పనిచేసి బ్రతకాలి. లేదా చదువుకున్న వాళ్ళైతే ఉద్యోగరీత్యా బయటకు వెళ్లి బ్రతుకు దేరుకోసం బయటకు వెళ్లాలి. చదువుకొని కొన్ని వేల మంది విద్యార్థులు ఉద్యోగం కోసం ఐఏఎస్, ఐపీఎస్,ఎస్సై, కానిస్టేబుల్, గ్రూప్ వన్, గ్రూప్ టూ, పోటీ పరీక్షలు కోసం, హైదరాబాద్ , ఏ ఢిల్లీకి వెళ్లాల్సి వస్తుంది. ఎక్కడైతే వ్యవసాయ అభివృద్ధి లేదో, ఎక్కడైతే పారిశ్రామిక అభివృద్ధి లేదు అక్కడ నిరుద్యోగ భృతి ఉంటుంది.

చంద్రబాబు ప్రభుత్వం లో ఎన్నో నోటిఫికేషన్ వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి వచ్చాక, సంవత్సరానికి ,2,30,000 నోటిఫికేషన్ ఇస్తానని హామీ ఇచ్చాడు. కానీ సీఎం అయిన నుంచి ఒక్క జాబ్ కేలండర్ కూడా విడుదల చేయలేదు. ఎంత దారుణం ? ఎంతో మంది నిరుద్యోగులు ఉద్యోగం లేక, డిగ్రీలు పూర్తి చేసి ఖాళీగా ఉన్నారు.

నేను తిరువూరులో ఈ యువతి, యువకులు చూసి ఏ విధంగా అయినా వారికి ఉద్యోగాలు వచ్చేలాగా వారికి శిక్షణ ఇప్పించాలని, వీరి కోసం కనీసం ఒక 500 మంది విద్యార్థులు కలిసి చదువుకునేలాగా వారికి కావలిసిన పుస్తకాలన్నీ ఏర్పాటు చేసి, ఒక స్టడీ హాల్ ను త్వరలో ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.

తిరువూరులో ఏం చేస్తే నిరుద్యోగులు ఉద్యోగులకు స్థిరపడతారని అని ఆలోచించి నిర్ణయం తీసుకున్నాం. జగ్గయ్యపేట, నూజివీడు, నందిగామ, తిరువూరు చుట్టుపట్ల ఉన్న పరిసర ప్రాంతాల్లో ఎవరైతే స్టూడెంట్స్ ఉద్యోగం కోసం సిద్ధపడుతున్నారో, నేను వాళ్లకి మంచి ట్రైనింగ్ ఇచ్చి ,మంచి అధ్యాపకుల తీసుకొచ్చి వారికి శిక్షణ ఇప్పిస్తాను. వారు ఉద్యోగులగా స్థిరపడటమే నా ఆశ అని కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు.

Leave a Reply