Suryaa.co.in

Andhra Pradesh

ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదలచేయాలి

జీతాలు, పెన్షన్లు ఇవ్వలేక అప్పులు పుట్టని దీనస్థితిలో ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తక్షణం ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని ప్రభుతాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు డిమాండ్ చేశారు .రెండేళ్లుగా వచ్చే ఆదాయాన్నంతా నవరత్నాల అమలుకోసం పప్పుబెల్లాల్లా పంచుకుంటూ పోతూ ఒక్క ఇటుకను పేర్చకుండా చేసిన ఘనత ఈ ప్రభుత్వానిదే అన్నారు. పక్క అభివృద్ధి అనే మాటే వినబడకుండా ఉంటే చేసిన అప్పులు ఏమౌతున్నాయో అనేది అంతుబట్టని రహస్యంగా మారిపోయిందన్నారు. ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇవ్వలేకుంటే, మరోపక్క రిజర్వుబ్యాంకు అప్పులు ఇవ్వని పరిస్థితి ఏర్పడటం ఆర్థిక సంక్షోభాన్ని తలపిస్తోందన్నారు. లాక్ డౌన్ కాలంలో సైతం కేంద్రం రాష్ట్రానికి పెద్దఎత్తున వైద్యసహాయం, ఆర్ధిక సహాయం చేసిందని చెప్పారు పంచాయతీలకు పెద్దఎత్తున నిధులు విడుదలచేసి గ్రామీణాభివృద్ధికి కేంద్రం కృషి చేస్తోందన్నారు. అలాగే లక్షల కోట్ల నిధులతో ఇళ్ల నిర్మాణం, రహదారులు, పోర్టుల అనుసంధానం, స్మార్ట్ సిటీలు, పారిశ్రామిక కారిడార్లు విద్యుత్, మంచినీరు, పారిశుధ్యం, విద్యాసంస్థలు, ప్రభుత్వాసుపత్రుల నిర్మాణానికి చేస్తున్న పనులన్నీ కేంద్రం ఇచ్చే నిధులతో జరుగుతుండగా మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. ఆదాయంతో పాటు తెచ్చిన అప్పల్లో రూపాయి కూడా అభివృద్ధికి ఖర్చుచేయకుండా సంక్షేమానికే కేటాయించడం వల్ల ఆర్ధిక క్రమశిక్షణ గాడి తప్పిందని గుర్తుచేశారు. ఇలాంటి ఆర్ధిక సంక్షోభం చరిత్రలో చూడలేదని తక్షణం పరిస్థితిని చక్కదిద్దాలన్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి పై శ్వేతపత్రం విడుదలచేయాలని డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE