టీఆర్‌ఎస్ రైతు ధర్నా కోసం ప్రాణం కోల్పోయిన యువకుడు

– ఎమ్మెల్యే రావాలంటూ బంధుమిత్రుల రాస్తారోకో
– సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న చావువార్త
టీఆర్‌ఎస్ నిర్వహిస్తున్న రైతు ధర్నా ఇరవై ఏళ్ల యువకుడిని బలి తీసుకుంది. ఫ్లెక్సీలు కడుతున్న యువకుడికి కరెంట్ షాక్ తగలడంతో మృతి చెందాడు. అయితే.. ఎవరికోసం ఫ్లెక్సీలు కడుతున్నారో ఆ ఎమ్మెల్యే గానీ, స్థానిక చైర్మన్‌గానీ రాకపోవడం మృతుడి బంధు మిత్రులకు ఆగ్రహం కలిగించింది. దానితో వారంతా రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆ దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వార్తలోకి వెళితే.. సూర్యాపేట జిల్లా కోదాడ లో తెలంగాణ రైతుల వరి పంట సాగు సమస్య రైతన్నల సమ్మె సమరంలో భాగంగా.. టిఆర్ఎస్ పార్టీ మద్దతుగా తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో ఫ్లెక్సీలు


కడుతున్న సమయంలో విద్యుత్ షాక్ కు గురై కందుకూరు సునీల్ అనే వ్యక్తి (20) మృతి చెందాడు,మరో వ్యక్తి కుడుములు వెంకటేష్ కు తీవ్ర గాయాలు కావడంతో ఖమ్మం హాస్పిటల్ కి తరలించారు.
బాధిత సునీల్ కుటుంబానికి న్యాయం చేయాలని కోదాడ రంగా థియేటర్ చౌరస్తా వద్ద కాలనీవాసులు , స్నేహితులు , బంధువులు రాస్తారోకో నిర్వహించారు ఈ ఘటన జరిగి తొమ్మిది గంటలు కావస్తున్నా

టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గాని చైర్మెన్ గాని తమ దగ్గరికి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు కుటుంబానికి న్యాయం జరిగే వరకూ ఈ రాస్తారోకో విరమింప చేయబోమని కాలనీవాసులు స్పష్టం చేశారు.