Suryaa.co.in

Andhra Pradesh

జగన్ దృష్టిలో కొడాలి నాని ఓ ఎంటర్టైన్మెంట్ ఎమ్మెల్యే మాత్రమే..

 -కొడాలి నాని జగన్ దృష్టిలో ఓ ఎంటర్టైన్మెంట్ ఎమ్మెల్యే మాత్రమే…నాయకుడు కాదు
-రామోజీరావు,రాధాకృష్ణ,బిఆర్ నాయుడు పేర్లు ఎత్తే అర్హత కొడాలి.నానికి లేదు
-నాయకుడిని బట్టే వైసీపీ కార్యకర్తలు ఉన్నారు
-కొడాలి నానికి గుండు కొట్టడానికి గుడివాడ ప్రజలు సిద్ధంగా ఉన్నారు
-దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు రావాలి
– టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు

మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశం వివరాలు..
వైసీపీ ప్లీనరీ చూస్తే రాజకీయాల మీదే అసహ్యం పుడుతోంది. విజయసాయిరెడ్డి కొడాలి నానిని మాట్లాడడానికి పిలిచేముందు కార్యకర్తలను ఉద్దేశించి మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తాను అని చెప్పారు. వైసీపీ ప్లీనరీ ఎంటర్టైన్మెంట్ కోసమే నిర్వహించుకున్నారు. కొడాలి నాని కార్యకర్తలకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ఎమ్మెల్యే తప్ప, నాయకుడు కాదు. తాడేపల్లి ప్యాలెస్ లో నిర్వహించిన ప్రెస్మీట్ కు, ప్లీనరీకి ఏమాత్రం తేడాలేదు. ప్రతిపార్టీ రెండేళ్లకు ఒకసారి నిర్వహించుకునే ప్లీనరీలు, సమావేశాల్లో ముఖ్యంగా పార్టీ విధివిధానాలు, కార్యకర్తల నుండి సూచనలు, సలహాలు తీసుకుంటారు. కానీ వైసీపీ ప్లీనరీ మాత్రం ఎంటర్టైన్మెంట్ కోసమే నిర్వహించుకున్నట్లు ఉంది. కొడాలి నాని కంటే 420, వెధవ, సన్యాసి ఎవరూ రాష్ట్రంలో లేరు. కొడాలి నాని గతంలో రావి శోభనాద్రి గారి వద్ద పనిచేసి, వాళ్లను అణగదొక్కి సీటు ఎలా తెచ్చుకున్నాడో గుడివాడ ప్రజలకు తెలుసు. కొడాలి నాని రాష్ట్ర నాయకుడు కాదు..గుడివాడకు రౌడీ మాత్రమే.

టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, పార్టీ నాయకులపై కొడాలి నాని చేసే వ్యాఖ్యలను రాష్ట్ర ప్రజలు అసహ్యించుకుంటున్నారు.  కొడాలి నాని బూతులు తిడుతుంటే..వైసీపీ అధినాయకుడు ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నాడు. అదే స్థానంలో టీడీపీ అధినాయకుడు ఉంటే ఖచ్చితంగా ఆపేవారు..జగన్ రెడ్డి బూతుల్ని ఆస్వాదించడం అత్యంత హాస్యాస్పదం.  నీకు దమ్ముంటే ప్రజాక్షేత్రంలో చూసుకోవాలి కానీ..తిట్టించడం సరికాదు జగన్ రెడ్డి. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటినుండి అన్ని వ్యవస్థల మీద దాడి జరుగుతోంది. తాజాగా మీడియా మీద దాడి చేస్తున్నారు. రామోజీరావు పేరు తలిచే అర్హత కొడాలికి లేదు.

రామోజీరావుకు ప్రపంచవ్యాప్తంగా గౌరవం ఉంది.ఇటువంటి వ్యక్తి గురించి క్యాసినో ఆడించే వెధవకు లేదు. అన్ని రంగాల్లో కష్టపడి పైకి వచ్చిన రామోజీరావును పచ్చళ్లు అమ్ముకునేవాడు అని తిట్టడం కొడాలి నాని అవివేకం. రాధాకృష్ణ, బిఆర్ నాయుడు పేర్లను ఉచ్ఛరించే అర్హత కొడాలి నానికి ఏమాత్రం లేదు.ఆ స్థాయి లేదు. నువ్వు ఏపనిచేసి పైకి వచ్చి వచ్చావో బహిరంగంగా ప్రజలకు చెప్పాలి కొడాలి నాని. సీటు ఇప్పించిన కుటుంబంపై కొడాలి నాని విషం చిమ్ముతున్నాడు.అసలు అతనికి ఒక అమ్మా, బాబు ఉన్నాడా..? టీడీపీ నాయకులు ఏమైనా తప్పు మాట్లాడితే మా పార్టీ అధ్యక్షులు కంట్రోల్ చేస్తారు. మీ నాన్న ముఖ్యమంత్రి కాకుముందు నీ ఆస్తులెంత, ప్రస్తుతం నీ ఆస్తులెంత? ఎన్ని ప్యాలెస్ లు కట్టావో జగన్ రెడ్డి సమాధానం చెప్పగలడా? అక్రమ ఆస్తులు కూడబెట్టుకున్నందుకే కోర్టులు చుట్టూ తిరుగుతున్నారు.

కొడాలి నానికి గుండు కొట్టడానికి గుడివాడ ప్రజలు సిద్ధంగా ఉన్నారు

గుడివాడ ప్రజలు కొడాలికి గుండు కొట్టడానికి బ్లేళ్లు పట్టుకుని సిద్ధంగా ఉన్నారు.గడ్డం కాదు ఏకంగా గుండే. బొచ్చు అనే పదం మరోసారి మాట్లాడడానికి అవకాశం లేకుండా గుండు కొట్టడమే గుడివాడ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ప్రజలను అష్టకష్టాలకు గురిచేసి, ప్లీనరీలో జగన్ రెడ్డి రాక్షసానందం పొందారు. ప్రభుత్వాలతో సంబంధం లేకుండా పనిచేస్తుంది గనుకే ఈనాడు సంస్థలు 50ఏళ్లుగా కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి ఇప్పటికైనా వాళ్ల నాయకులను కంట్రోల్ చేయాలి..లేదంటే తగిన గుణపాఠం తప్పదు. ఈ రాష్ట్రంలో 420 ఎవరో థర్డ్ పార్టీతో సర్వే చేయించుకుంటే తేలిపోతుంది. కొడాలి నాని బొచ్చు ఊడడానికి పనామా లేదా జిల్లెట్ బ్లేడ్ ఒక్కటి చాలు..చంద్రబాబు, లోకేష్ అవసరం లేదు..

దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు రావాలి

కొడాలి నానికి దమ్ముంటే..రాజీనామా చేసి ఎన్నికలకు రావాలి..అప్పుడు తేలిపోతుంది ఎవరి బొచ్చు ఊడుతుందో. కొడాలి నాని గుడివాడ ఓటర్ల గురించి భ్రమలో బ్రతుకుతున్నాడు. రాజకీయ నాయకుల విశ్వరూపం ప్రజాక్షేత్రంలో రుజువుకావాలి కాని..మాటల్లో కాదు. మీడియా సంస్థలు ఏం పాపం చేశాయి.వాటిని చూసి జగన్ రెడ్డికి ఎందుకు భయం పట్టుకుంది..ఎందుకు వాటిపై విషం కక్కుతున్నారు..?  జగన్ రెడ్డికి వ్యతిరేకంగా వస్తున్న కోర్టు తీర్పులపైనా వైసీపీ నాయకులు విషయం కక్కుతున్నారు.ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ఏపీలో వైసీపీ పాలనలో జ్యుడిషరీ వ్యవస్థపై దాడి జరుగుతోంది..రాష్ట్ర ప్రజలు దీన్ని గమనించాలి.

LEAVE A RESPONSE