పర్చూరు టిడిపి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుపై రెవెన్యూ అధికారుల కక్షపూరిత చర్యలపై కేంద్ర ఎన్నికల సంఘానికి పిర్యాదు చేసిన పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు.
• పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు అధికారపార్టీ ఓట్ల అక్రమాలపై న్యాయపోరాటం చేస్తున్నారు.
• మొత్తం ఓట్లలో దాదాపు 20 శాతం ప్రతిపక్షాల ఓట్లు తొలగించాలని అధికారపార్టీ పెద్దఎత్తున ఫామ్-7, ఫామ్-6 ల నమోదు చేయడంపై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు సాంబశివరావు పిర్యాదులు చేశారు.
• దీనితో అధికారపార్టీ నాయకుల ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (APDRI) అధికారులు పర్చూరు ఎమ్మెల్యేపై కక్షసాధింపులకు దిగారు.
• సాంబశివరావు వ్యాపారాలపై, ఆస్తులపై దాడులు మొదలు పెట్టి తప్పుడు కేసులు, తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
• సాంబశివరావు కంపెనీలో పనిచేసిన ఉద్యోగి నోట్‌బుక్‌లో 2019 ఎన్నికల్లో సాంబశివరాలు నగదు పంపిణీ చేసినట్లుగా ఆధారాలు దొరికాయని డీఆర్‌ఐ అధికారులు చెబుతున్నారు.
• దీనిపై హిందూ పత్రిక కథనం ప్రచురించిమైంది.
• సాంబశివరావు కంపెనీ సేల్స్ టాక్స్ చెల్లించలేదనే నెపంతో ఆయన కంపెనీపై అన్యాయంగా దాడులు చేశారు. ఈ దాడులు ఎమ్మెల్యే సాంబశివరావు ప్రతిష్టను దిగజార్చడమే.
• గతంలో ఇదే రెవెన్యూ అధికారులు సాంబశివరావు కంపెనీలో పనిచేసిన ఉద్యోగులపై ఒత్తిడి చేసి ఎమ్మెల్యే అక్రమ మార్గంలో నగదు సంపాదించినట్లు చెప్పాలన్నారు. దీనిపై కోర్టులో కేసు కూడా ఉంది.
• రెండు, మూడు నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే సంధర్బంలో ఎమ్మెల్యే రెవెన్యూ అధికారుల దాడులు అధికార దుర్వినియోగమే.
• ప్రతిపక్షనాయకులపై దాడులు చేసేందుకు అధికారాన్ని ఉపయోగించడం దుర్మార్గం.
• ఈ నేపద్యంలో రెవెన్యూ అధికారులు చేస్తున్న అధికార దుర్వినియోగంపై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోగలరు