సజ్జల పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన అచ్చెన్నాయుడు

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి తెదెపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్న లేఖ…

ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డిపై ఎన్నికల సంఘానికి అచ్చెన్నాయుడు ఫిర్యాదు చేసారు. సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రభుత్వ పదవిలో ఉంటూ రాజకీయ నాయకుడిలా మాట్లాడుతున్నారు.  గత ఐదేళ్ళుగా ప్రభుత్వ సలహాదారుడిలా కాకుండా వైసీపీ కార్యకర్తలా ప్రతిపక్షాలపై విషం చిమ్ముతున్నారు.  ప్రభుత్వ సంచిత నిధి నుంచి జీతం తీసుకుంటూ ప్రభుత్వ ఖజానా ఖర్చుతో అధికార పార్టీ పనులు చేస్తున్నారు.  ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ మార్చి 18, 22న ప్రెస్ మీట్‌లు పెట్టి ప్రతిపక్షాలపై బహిరంగ ఆరోపణలు చేశారు.

ఎన్నికల నియమావళి ప్రకారం రాజకీయ నాయకులు, అధికారుల మధ్య వ్యక్తిగతంగా లేదా సమిష్టిగా విడియో కాన్ఫరెన్సులు నిషేధం. అందుకు విరుద్ధంగా వైకాపా నాయకులు, అభ్యర్ధులతో సజ్జల భేటీలు, వీడియో కాన్ఫరెన్సులు నిర్వహిస్తున్నారు.  ఐపీసీ 171 మరియు 123, 129, 134 మరియు 134A సెక్షన్‌ల ఉల్లంఘన మరియు RP 1951 యాక్ట్‌కు విరుద్ధంగా సజ్జల వ్యవహరించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించనందుకు గాను అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించడం కోసం సలహాదారు పదవి నుంచి సజ్జలను తొలగించాలని ఈసీని కోరిన అచ్చెన్న.

Leave a Reply