టీడీపీ కార్యకర్త అమర్నాథ్ రెడ్డిని హత్య చేయడం దుర్మార్గం

-టీడీపీ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారనే అక్కసుతో దారుణం
-టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు

జగన్ కు ఓటమి భయం పట్టుకుంది అందుకే ప్రతిపక్షాలపై వరుస దాడులు చేయిస్తున్నారు. నిజాయితీగా గెలవడం చేతకాక రౌడీయిజం చేయిస్తున్నారు. ఆఖరి రోజుల్లోనూ వైసీపీ కార్యకర్తల అధికార మదం తగ్గడం లేదు. హిందూపురం, పుట్టపర్తి నియోజకవర్గం, కూటాలపల్లి గ్రామంలో టీడీపీ కార్యకర్త అమర్నాథ్ రెడ్డిని వేట కొడవళ్లతో నరికి చంపటం దుర్మార్గం. టీడీపీ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నందుకు ప్రాణాలు తీశారంటే జగన్ పాలన రాతియుగం కాక మరేంటి? అమర్నాథ్ రెడ్డి నిన్నటి రోజున మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నందుకు హతమార్చారు. సొంత బాబాయినే గొడ్డలితో నరికి చంపించిన జగన్ రెడ్డికి సామాన్య ప్రజలు ఒక లెక్క? జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. ప్రతిపక్ష నాయకులపై అరాచకాలు పెరిగిపోయాయి. అమర్నాథ్ రెడ్డిని చంపిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలి.

Leave a Reply