ప్రజాభిప్రాయం ప్రకారం మేనిఫెస్టో

– తిరుపతి లో వృత్తి కళాకారులు సమావేశం లో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి

ప్రజాహితం కోసం పరిపాలన ఉండాలి. బిజెపి లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. పేదల కోసం సంక్షేమం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కట్టుబడి ఉన్న సంగతి గత పది సంవత్సరాలుగా చూస్తున్నాం. నీరవ్ మోడీ లాంటి వారికి లోన్లు ఇప్పించింది ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలే.

18వేల గ్రామాల్లో విద్యుత్ సౌకర్యం లేక పోతే నరేంద్ర మోడీ ప్రధాని అయిన తరువాత ఆ గ్రామాల్లో విద్యుత్ వెలుగులు చూసాం. మహిళలు కోసం అనేక పథకాలు అమలు చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. పేదవాడి కోసం జీవన్ జ్యోతి, జీవన్ సురక్ష యోజన అమలు, 370 ఆర్టికల్ రద్దు కు కట్టుబడి తొలగించారు 500 సంవత్సరాల నాటి కాల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నెరవేర్చారు

చాకచక్యంగా, సమర్థవంతంగా పరిపాలన అందిస్తున్న ఏకైక ప్రభుత్వం బిజెపి మాత్రమే యావత్ భారత దేశం లో రధాలు తిప్పుతున్నాం ఈసందర్భంగా మీ ఆలోచనలు తీసుకుని ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పన చేస్తాం. ప్రజాభిప్రాయం ప్రకారం మేని ఫెస్టో ఉంటుంది

 

Leave a Reply