పోలీసులు ఏం చేస్తున్నారు?

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

ఐదేళ్లుగా జ‌గ‌న్ సాగించిన ఆట‌విక పాల‌న‌, ఎన్నిక‌ల కోడ్ వ‌చ్చాక కూడా కొన‌సాగ‌డం తీవ్ర ఆందోళ‌న క‌లిగిస్తోంది. వైకాపా అధినేత జ‌గ‌న్ గొడ్డ‌లితో తెగ‌బ‌డితే, వైకాపా కార్య‌క‌ర్త‌లు వేట‌కొడ‌వ‌ళ్ల‌తో జ‌నాల్ని వేటాడుతున్నారు. ప్ర‌జ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల్సిన పోలీసులు ఏం చేస్తున్నారు? శ్రీసత్యసాయి జిల్లా నల్లమాడ మండలం కుటాలపల్లిలో టీడీపీ కార్యకర్త అమర్నాథరెడ్డి హ‌త్య‌ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది ముమ్మాటికీ వైకాపా సైకోల ప‌నే. ఓట‌మి భ‌యంతో టిడిపిలో క్రియాశీల‌క కార్య‌క‌ర్త‌ల్ని అంత‌మొందిస్తున్నారు. అధికారం అండ‌తో చెల‌రేగుతున్న వైకాపా కాల‌కేయుల‌కు ఇదే నా హెచ్చ‌రిక‌. మీకు రోజులు ద‌గ్గ‌ర‌ప‌డ్డాయి. జ‌గ‌న్ రెడ్డి ముఠాని న‌మ్ముకుని హ‌త్య‌లకు పాల్ప‌డితే..మిమ్మ‌ల్ని ఎవ్వ‌డూ కాపాడ‌లేడు.

Leave a Reply