• రిజర్వాయర్లు, చెరువులను నింపేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలి
• ప్రతి నీటి బొట్టును మనం వినియోగించుకోవాలి
• తక్కువ నీటి వినియోగం, ఎక్కువ దిగుబడిని ఇచ్చే పంటలను ప్రోత్సహించాలి
• అన్ని త్రాగునీటి ట్యాంకులను సకాలంలో నింపాలి
• ప్రతి ఎకరాకు నీరు అందాలి. అదే మన లక్ష్యం
• నదుల అనుసంధానం జరగాలి
• జిల్లా కలెక్టర్ల సమావేశంలో జలవనరుల శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 ముఖ్య నదులైన కృష్ణా, గోదావరి, పెన్నా, నాగావళి, వంశధారలున్నాయి. 35 చిన్న నదులున్నాయి. అదే విధంగా 38,422 మైనర్ ఇరిగేషన్ వనరులున్నాయి.మొత్తంగా రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 4 కోట్ల ఎకరాల ఆయకట్టు ఉంది. రిజర్వాయర్లు, చెరువులను నింపేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలి.
ప్రస్తుత వర్షాకాల/ వరద సీజన్ లో ముందుగా వరద నీటిని వృథా కాకుండా మనం రిజర్వాయర్లను, చెరువులను నింపేందుకు సీఈలు, ఎస్ఈలతో సమీక్షించాలి. వరద నీటిని ఒడిసిపట్టి తక్షణమే ఎగువన ఉన్న రిజర్వాయర్లను నింపాల్సిన అవసరం ఉంది. ఒక్క చుక్క నీటిని కూడా వృధా చేయకూడదు. నీరు సముద్రం పాలు కానీయకూడదు. ప్రతి నీటి బొట్టును మనం వినియోగించుకోవాలి.
తక్కువ వ్యయంతో పూర్తయ్యే ఎత్తిపోతల పథకాలను పునరద్ధరించేందుకు వాటిపై సమీక్ష చేయాలి. తక్కువ నీటి వినియోగం, ఎక్కువ దిగుబడిని ఇచ్చే పంటలను ప్రోత్సహించేలా వ్యవసాయ శాఖతో కలిసి పనిచేసేలా చర్యలు తీసుకోవాలి. టెయిల్ ఎండ్ తో పాటు నీటి పారుదల ప్రాజెక్టుల క్రింద స్థిరీకరించబడిన ప్రతి ఎకరాకు నీరు అందాలి.
కాలువలకు నీటి విడుదల ప్రక్రియను కలెక్టర్లు సునిశితంగా పరిశీలించాలి. తదనుగుణంగా సకాలంలో నిర్ణయాలు తీసుకోవాలి. ఈ ప్రక్రియలో నీటి పారుదల శాఖ, రెవెన్యూ, పోలిస్, ఆర్ డబ్ల్యూఎస్ తదితర శాఖలు పాలుపంచుకోవాలి.
అన్ని త్రాగునీటి ట్యాంకులను సకాలంలో నింపాలి.ప్రతి ఎకరాకు నీరు అందాలి. అదే మన లక్ష్యం.గేట్లు పెట్టడానికి నిధులు ఇవ్వలేకపోయింది గత ప్రభుత్వం. ఎక్కడైనా గేట్ కొట్టుకుపోతే తక్షణమే ఏఈ, డీఈని డీమ్డ్ సస్పెన్షన్ చేస్తాం. డ్రోన్ లను పెట్టి కెనాల్స్, ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలి. నదుల అనుసంధానం జరగాలి. ఏ ఒక్క వ్యక్తి తప్పు చేసినా, విఫలం అయినా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది.