Suryaa.co.in

Andhra Pradesh

ఇంతచేసినా.. వైసీపీకి ఇంకా ఓటేశారంటారా?

ప్రమాదకరమైన విధానాలు ఇవ్వన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూసిన తర్వాత కూడా ఎవ్వరైనా వైసీపీకి ఓట్లు వేసి ఉంటారా వేసి ఉండరు

ఇసుక పాలసీ –

బాబు అనుకూల వర్గాలు ఇసుక దందా నడిచింది అని విమర్శలు చేశారు అది అరికట్టాలి అని అనుకోవడం తప్పుకాదు అయితే మళ్లీ అదే పని చేయటం ఎంతవరకు సమంజసం? నెలల పాటు ఇసుక రద్దు చేసి భవన నిర్మాణ కార్మికుల పని లేకుండా చేసి వారి కడుపు కొట్టడం ఎంతవరకు సమంజసం? ఆ తర్వాత అయినా జనానికి అందుబాటులో ఇసుక దొరికిందా అంటే గతం కన్నా ట్రిపుల్ ధర. ఇసుక దందా కూడా ఆగలేదు. జగన్ మళ్లీ వచ్చి ఇదే విధానం కొనసాగితే పేద మధ్యతరగతి వర్గాలు సొంత ఇల్లు నిర్మించుకోవాలి అంటే సాధ్యం అవుతుందా?

మద్యం పాలసీ –

బాబు అనుకూల వర్గాలు టెండర్లు దక్కించుకుంటున్నారు అని మొత్తం మనకే కావాలి అని ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేసింది. నాసిరకం మద్యం ఎక్కువ ధరకు అమ్మడం పెద్ద తప్పు. ధనిక మధ్యతరగతి మంచి బ్రాండ్లు తాగుతారు కాయకష్టం చేసుకుని జీవించే దినసరి కూలీ కార్మికులు పేదలు ఉన్నవాటిలో తక్కువ ధర ఉన్న నాసిరకం మద్యం ఇంకో ఐదేళ్ళు తాగితే వారి ఆరోగ్యం సంగతి ఏంటి?

రివర్స్ టెండరింగ్ –

బాబు అనుకూల వర్గాల చేతుల్లో ఉన్న నిర్మాణ రంగం పనులు తమ చేతుల్లోకి తీసుకోవడమే ఈ విధానం. వారు తిన్నారు మేం తినాలి అని తీసుకున్నారు సరే..! కొనసాగించింది ఏది? పట్టుమని పది ప్రాజెక్టులు కట్టలేదే? ఇదేనా రైతులకు దక్కే భరోసా? మళ్ళీ వస్తే పెండింగ్ జల ప్రాజెక్టులు పూర్తి అవుతాయి అని నమ్మకం ఉందా?

మితిమీరిన సంక్షేమం –

పథకాలు ఎప్పటికీ జీవితాలు మార్చవు సత్ఫలితాలు ఇవ్వవు అనడానికి అమ్మ ఒడి రైతు భరోసా ఉదాహరణలు. అమ్మ ఒడి వలన బడుల ఆధునీకరణ వలన ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు పెరగలేదు రైతు భరోసా వలన సాగు విస్తీర్ణం పెరగలేదు. సంపద పెంచే విధానాలు అమలు చేయకుండా కేవలం డబ్బులు పంచడం వలన ఆర్థిక స్థితి మెరుగుపరిదా అంటే అదీ లేదు. మిగిలింది అప్పులు మళ్లీ వస్తే పెరిగేది అప్పులే కానీ జనం ఆదాయం కాదు.

ఫీజు రీయింబర్స్మెంట్-

ఫీజు రీయింబర్స్మెంట్ ఇప్పుడు కొత్త కాదు కొంతమంది విద్యార్థులకు జగన్ పూర్తి ఫీజు రెయిన్బోర్స్మెంట్ ఇవ్వడం అభినందనీయమే అయితే ఆ నిధులు తల్లుల అకౌంట్లో వేయడమే పెద్ద ప్రమాదం తిరిగి రాబట్టుకోవడం విద్యాసంస్థలకు పెద్ద సవాల్ అయింది చాలా విద్యాసంస్థలు మనుగడ కోల్పోయాయి. జగన్ మళ్ళీ వస్తే చాలా వరకు విద్యాసంస్థలు మూతపడతాయి. ఇక యూనివర్సిటీలలో రాజకీయ ప్రమేయం ప్రమాదకరం యూనివర్సిటీలు అస్తిత్వం కోల్పోయాయి.

ఆంగ్ల మాధ్యమం:

ఆంగ్ల మాధ్యమం బాబు హయాంలో కూడా అమలు చేశారు దశలవారీగా అమలు చేయాల్సిన విధానాన్ని ఒకే దశలో ప్రవేశ పెట్టడం సిబిఎస్ఈ ఐబీ అంటూ మార్చి మార్చి అమలు అది కూడా ఆంగ్లమాధ్యంలో చదవని ఉపాధ్యాయులతో విద్యాబోధన పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు అటు ఇటు కాకుండా పోతారు.

బడుల విలీనం:

కేంద్రం నూతన జాతీయ విద్యా విధానంలో చెప్పింది సబ్జెక్టుకు ఒక టీచర్ ఉండాలి అని కానీ రాష్ట్రం ఆచరించింది బడుల విలీనం పల్లెలో ప్రాథమిక స్థాయిలో ఉన్న బడులను పక్క ఊర్లో విలీనం చేయడం వలన డ్రాపౌట్లు పెరుగుతారు పెరిగారు.

భూముల పంపిణీ:

పేదలకు భూములు పంపిణీ చేయడం మంచి నిర్ణయం. అయితే పాలన ఆరంభంలోనే రీ సర్వే చేసి ఆక్రమిత భూములను ప్రభుత్వ పరం చేసుకొని పేదలకు పంచి ఉంటే రీ సర్వే సత్ఫలితాలు ఇచ్చేవి. చాలాచోట్ల కొండ ప్రాంతాలు మునక ప్రాంతాలలో స్థలాలు ఇవ్వడం ఆక్షేపణీయం.

అసైన్డ్ చట్టం సవరణ-

పేదలకు ఇచ్చే భూములు/ స్థలాలు అనుభవించాలి కానీ అమ్ముకునే వెసులుబాటు ఉండకూడదు అని అసైన్డ్ చట్టం చేశారు. జగన్ వచ్చాక దాన్ని సవరించారు దీనివలన ప్రధాన ప్రతికూలత తాత్కాలిక అవసరాలు పేదలకు వచ్చినప్పుడు వాటిని అమ్ముకుంటే జీవనోపాధి / నివాసం కోల్పోతారు. జగన్ మళ్ళీ వస్తే వారికి ఇచ్చిన భూములు పదో పరకో ఇచ్చి వాటిని స్థానిక నాయకులు హస్తగతం చేసుకుంటారు.

పంచాయతీలు నిర్వీర్యం:

పార్లమెంట్ ద్వారా చట్టబద్ధమైన వ్యవస్థ పంచాయితీలు వాటిని నిర్వీర్యం చేస్తూ వాటికి వచ్చిన నిధులను మళ్లిస్తూ గ్రామాలు అభివృద్ధి లేకుండా చేయడానికి మూల కారణం సచివాలయ వ్యవస్థ. గ్రామాలు అభివృద్ధి చెందాలి అంటే ముందుగా సచివాలయ వ్యవస్థ రద్దు చేయాలి.

మూడు రాజధానులు:

పరిపాలన కేంద్రీకరణ జరగాలి అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలి అలా కాకుండా మూడు రాజధానులు అంటూ ప్రాంతాల మధ్య చిచ్చు రాజేయడం క్షమించరాని నేరం. ఆనాడు తండ్రి రాజకీయ స్వార్థం తో రెండు రాష్ట్రాల విభజనకు దారి తీశారు నేడు తనయుడికి మద్దతు ఇస్తే మూడు రాష్ట్రాలకు బీజం వేశారు మళ్ళీ అవకాశం ఇస్తే మూడు ప్రాంతాల ప్రజలు ప్రాంతీయ చిచ్చు తో కొట్టుకోవాలి

కక్షసాధింపు:

ఆడం స్మిత్ చెప్పినట్లు జాతి (కమ్మ) సంపదను జాతీయ (రాష్ట్ర) సంపదగా మార్చుకోవాలి కానీ ధ్వంసం చేయకూడదు. దురదృష్టవశాత్తు ప్రజా వేదిక కూల్చివేతతో పాలన మొదలైంది‌. ఆరంభం నుంచి బాబు పై కక్ష సాధించే లక్ష్యంగా బాబు అనుకూల వర్గాల ఆర్థిక మూలాల దెబ్బతీసే లక్ష్యంగా విధానాలు అవలంబించారు ఈ ప్రక్రియలో నష్టపోయింది రాష్ట్రం. బాబు కన్నా మిన్నగా పరిపాలన చేస్తావని నమ్మారు కానీ బాబుపై కక్ష సాధింపు తీర్చుకోడానికి మాత్రం కాదు

దీర్ఘకాలంలో జనానికి విపరీత నష్టం కలిగించే ఈ విధ్వంసకర ప్రమాదకరమైన విధానాలు మారాలి అంటే బాబు మళ్ళీ రావాలి జనమే తమను తాము రక్షించుకోవాలి.

– హర్షవర్దన్‌రెడ్డి

 

LEAVE A RESPONSE