– ఆర్య – ద్రావిడ సిద్ధాంతానికి మళ్ళీ ప్రాణ ప్రతిష్ట
ఏ సమస్యని ఎక్కడ పుట్టించాలి ? దానిని ఎలా విస్తరించాలి ? మిరియాలు రాజస్థాన్ లో సాగు చేయలేరు. సముద్ర తీరంలో చింతపండుని పండించలేరు! అడవిలో ఉప్పు ని తయారు చేయలేరు!
1.2020 జూలై 29 న ముగ్గురు వ్యక్తులు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. వీళ్ళలో ఇద్దరు అడ్వొకేట్లు కాగా మరొక వ్యక్తి సోషల్ వర్కర్. అడ్వకేట్లు : బలరాం సింగ్, కరునేశ్ కుమార్ శుక్లా. సోషల్ వర్కర్ ; ప్రవీణ్ కుమార్.
2. 1976 లో అప్పటి ప్రధాని ఇందిర ఎమెర్జెన్సీ సమయంలో రాజ్యంగ 42వ సవరణ ద్వారా ‘సెక్యులర్’ మరియు ‘సోష లిస్ట్’ అనే పదాలని బలవంతంగా జోడిoచింది అని అది చెల్లదని రూలింగ్ ఇవ్వమని కోరారు తమ పిటిషన్లలో.
3. ఈ సంవత్సరమే కామన్ సివిల్ కోడ్ బిల్లు ని పార్లమెంటులో ప్రవేశబెట్ట బోతున్నది ప్రభుత్వం. దానికి సంబంధించి విధి విధానాలు రూపొందించడంలో బిజీగా ఉన్నట్లు తెలుస్తున్నది.
4. దక్షిణ కన్నడ జిల్లాలలో bjp బలం పెంచుకుంటున్నది గతంలో కంటే. ముఖ్యంగా అరేబియా సముద్రం ని ఆనుకొని ఉన్న కోస్తా జిల్లాలలో bjp బలపడుతున్నది.
గతంలో కేరళ,కర్నాటక సముద్ర తీర ప్రాంతాలలో స్మగ్లింగ్ జోరుగా సాగేది. వీటిలో గల్ఫ్ దేశాల నుండి బంగారం తో పాటు, పాకిస్తాన్ నుండి డ్రగ్స్ కూడా వచ్చేవి. వీటిని ఆర్గనైజ్ చేసేది ముస్లిమ్స్. అధికార యంత్రాంగం చూసి చూడనట్లు ఉండేది. కానీ 2014 లో bjp అధికారంలోకి వచ్చిన తరువాత క్రమంగా ఒక్కో నట్ బోల్టూ బిగిస్తూ వచ్చింది. దాంతో ఈ ప్రాంతంలో డబ్బు ప్రవాహం క్రమేణా ఆగుతూ వచ్చింది. ప్రధానంగా PFI,SDPF మరియు CFI లకి ఇది ఇబ్బందిగా మారింది. పులి మీద పుట్రలా సౌదీ ప్రభుత్వం, ఈ ప్రాంతాలలో ఉన్న మదర్సా, మసీదులకి ఇచ్చే విరాళాలు ఆగిపోయాయి. ప్రధాని నరేంద్ర మోడీ అభ్యర్ధనతో సౌదీ రాజు 2018 లో ఒక ప్రకటన చేస్తూ .. ఇక మీదట ఏ దేశానికి కూడా మదర్సా లేదా మసీదులకి విరాళాలు ఇవ్వబోమని ప్రకటన కూడా చేసాడు.
గత ఎన్నికల్లో bjp కర్నాటక లోని కోస్తా మరియు మల్నాడ్ ప్రాంతాలలో ఉన్న 33 అసెంబ్లీ సీట్లలో 28 గెలిచింది. అదే 2013 ఎన్నికల్లో 7 సీట్లు గెలిస్తే ,2008 లో 21 సీట్లు గెలిచింది. స్థానిక MLA ల ప్రభావం కాస్తో కూస్తో పోలీసుల మీద ఉండి తీరుతుంది.ముఖ్యంగా తీర ప్రాంతాలలో జరిగే స్మగ్లింగ్ కేసుల విషయంలో. స్థానిక MLA కి వాటాలతో పాటు కేసుల గొడవ ఉండేది కాదు గతంలో. కానీ అటు విరాళాలు తగ్గిపోవడం తో పాటు, స్థానిక MLA లు bjp కి చెందిన వారు కావడంతో స్మగ్లింగ్ కి చెక్ పడింది.
గత 7 ఏళ్లుగా కర్నాటక కోస్తా జిల్లాలతో పాటు పొరుగునే ఉన్న కేరళ కి చెందిన కాసరగోడ్ జిల్లాలో NIA దాడులు చేస్తున్నది. తీవ్రవాద కార్యకలాపాలలో సంబంధం ఉన్న యువకులని వరుసగా అరెస్ట్ చేస్తూ వస్తున్నది. మరీ ముఖ్యంగా భట్కల్ లో తీవ్రవాదుల సంఖ్య మరీ ఎక్కువ. ఎన్న్ది దాడులు చేసినా కేసులు పెట్టినా ఎవరూ లెక్క చెయ్యట్లేదు. వీళ్ళకి పొరుగునే ఉన్న కోస్తా జిల్లాల స్మగ్లింగ్ ముఠాలతో పాటు, కేరళ నుండి నిధులు వస్తుంటాయి. కానీ రోజు రోజుకి పోలీసుల కాపలా పెరిగిపోవడంతో పాటు, లంచాలు తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు పోలీసులు దాంతో చేతులు కట్టేసినట్లయింది స్మగ్లింగ్ ముఠాలకి.
ఒక సమస్య – మల్టిపుల్ టార్గెట్లు.!
డిసెంబర్ 31,2021 న హఠాత్తుగా ఉడిపిలోని ప్రభుత్వ కళాశాల కి హిజబ్ ధరించిన విద్యార్ధినులు కాలేజీ లోకి రావడానికి ప్రయత్నించగా, ప్రిన్సిపాల్ అనుమతి నిరాకరించారు. కాలేజీ డ్రెస్ తోనే రావాలి కానీ
ఇతర దుస్తులు వేసుకొని రావడానికి వీల్లేదు అంటూ ఆంక్షలు విధించింది ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్. దాంతో స్థానిక BJP MLA అయిన రఘుపతి భట్ జోక్యం చేసుకొని సర్ది చెప్పి పంపించారు. కానీ మరుసటి రోజు అంటే జనవరి 1,2022 న ఉడిపి పక్కనే ఉన్న కుందాపుర తో పాటు, చుట్టు పక్కల ప్రాంతాల కలాశాలలోకి విద్యార్ధినులు హిజబ్ ధరించి రావడం మొదలుపెట్టారు. దాంతో ఇది వివాదాస్పదం అయ్యింది.
హిజాబ్ దరించి వచ్చింది కొద్ది మంది వాహాబీ ముస్లిమ్స్ అమ్మాయిలు మాత్రమే ! వీళ్ళ కుటుంబాలు స్మగ్లింగ్ మరియు తీవ్రవాద సంస్థలు అయిన PFI మద్దతుదారులు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఉడిపి లో కానీ కుందాపురా లో కానీ అందరూ హిజాబ్ ధరించి రాలేదు. కేవలం 9 మంది మాత్రమే హిజాబ్ ధరించి వచ్చారు.
ఇప్పటినుండి మొదలుపెడితే కానీ వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఖాన్గ్రేస్ అభ్యర్ధులని గెలిపించుకోలేము ! ఖాన్గ్రేస్ MLA లు ఉంటే స్థానికంగా తీవ్రవాద కార్యకలాపాలు కానీ స్మగ్లింగ్ కానీ యధేచ్చగా చేసుకోవచ్చు. ఎటూ కమ్మీ మీడియా కవరేజ్ ఇస్తుంది. అదే తమిళనాడులో లావణ్య అనే అమ్మాయి మత మార్పిడి కోసం తెచ్చిన వత్తిడిని భరించలేక ఆత్మహత్య చేసుకుంటే మాత్రం, అది సాధారణ సంఘటనగా చిత్రీకించింది మీడియా! ఇది మొదటి టార్గెట్ !
ఖచ్చితంగా ఉత్తరప్రదేశ్ మొదటి దశ ఎన్నికలకి ఒక రోజు ముందు, విద్యార్దినిలు కర్నాటక హై కోర్టు లో రిట్ పిటిషన్ వేశారు. దేశ మీడియా దృష్టిని బెంగళూరు వైపు మళ్ళించగలిగారు. ఇది రెండో టార్గెట్ !
ఇక కామన్ సివిల్ కోడ్ లో ఎలాంటి అంశాలు ఉండబోతున్నాయో ఎవరికీ తెలీదు. ఒక వేళ హై కోర్టు తీర్పు కనుక వస్తే, అది కామన్ సివిల్ కోడ్ లో పొందుపర్చబోయే అంశాలని ప్రభావితం చేస్తుంది. ఇది మూడో టార్గెట్ !
2018 లో కేరళలో హిజాబ్ ధరించి రావడాన్ని నిషేధించింది కేరళ ప్రభుత్వం. దానిమీద తిరువంతపురం హై కోర్టులో కేసులు నడిచాయి. కానీ హై కోర్ట్ మాత్రం మత పరమయిన దుస్తులు వేసుకొని రావడానికి అనుమతి ఇవ్వలేము అంటూ తీర్పు చెప్పింది. కానీ అవి ప్రైవేట్ విద్యాసంస్థలు. కానీ ఇదే విషయాన్ని హై లైట్ చేయడానికి కర్నాటక ప్రభుత్వం ప్రయత్నించలేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25A ఇస్తున్న మతపరమయిన స్వేచ్చ కి పరిమితులు ఉన్నాయని గతంలోనే సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది.
ప్రస్తుతం జరిగింది మొదటి దశ మాత్రమే !రెండవ దశ ఉత్తర భారత Vs దక్షిణ భారత్ అనే అంశం ఉండబోతుంది.ఆర్య – ద్రావిడ సిద్ధాంతానికి మళ్ళీ ప్రాణ ప్రతిష్ట చేయబోతున్నారు.
(ఈ వ్యాసంలోని అంశాలన్నీ రచయిత వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే)
– పెంజర్ల మహేందర్ రెడ్డి
ఓసి సంఘం జాతీయ అధ్యక్షుడు