బ్యాండేజ్ తీశాక బయల్పడిన జగన్నాటకం

-చెల్లెలు పసుపుచీర కట్టుకున్నా నేరమేనా?
-మంగళగిరి రచ్చబండ సభలో యువనేత లోకేష్

మంగళగిరి: జగన్ రెడ్డి తనకు తగిలిన గులకరాయి గాయంపై బ్యాండేజ్ తీసేస్తే ఎలాంటి మచ్చాలేదు, దీంతో ఆయన నటన ప్రజలకు అర్థమైందని నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి పట్టణం ఇందిరానగర్ లో నిర్వహించిన రచ్చబండ సభలో లోకేష్ మాట్లాడుతూ.. జగన్ పై పడిన స్పెషల్ గులకరాయి… జగన్ కు తగిలి అటు నుంచి తొలుత వెల్లంపల్లి కుడికన్ను, ఆపై ఎడమ కన్నుకు తగిలింది.

2019లో కోడికత్తి శ్రీనుకు వైసీపీ నాయకులే డబ్బులిచ్చి పొడవమన్నారు. అతను ఐదేళ్ల పాటు జైలులో ఉన్నాడు. అప్పుడు బాబాయి శవం లేచింది. ఇప్పుడు గులకరాయితో దాడి చేయించుకున్నారు. ఎవరి శవం లేస్తుందో? జగన్ కు శవ రాజకీయాలంటే ఇష్టం. 2014లో తండ్రి శవంతో రాజకీయం చేశాడు. 2019లో సొంత బాబాయిని చంపి, ఆ నెపం చంద్రబాబునాయుడు గారిపై నెట్టి ఎన్నికల్లో లబ్ధిపొందారు. ఇప్పుడు 1వ తేదీనే పెన్షన్ ఇవ్వకుండా 32 మంది వృద్ధులను చంపి శవ రాజకీయం చేస్తున్నారు. సొంత చెల్లెలు షర్మిల పసుపు చీర ధరిస్తే టీడీపీ అంటున్నారు. తల్లి, భార్య కూడా పసుపు చీర కట్టుకున్నారు కదా, వారిని ఏమంటాడో? సొంత తల్లి, చెల్లికే న్యాయం చేయనివారు ప్రజలకేం న్యాయం చేస్తారని లోకేష్ ప్రశ్నించారు.

యువనేత దృష్టికి ఇందిరానగర్ సమస్యలు
ఇందిరానగర్ వాసులు తమ సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. ఇళ్లులేని వారికి నిర్మించి ఇవ్వాలి. రోడ్లు నిర్మించాలి. నియోజకవర్గంలో ఉన్న స్టేడియం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి. తాగునీరు అందించాలి, వీధి లైట్లు ఏర్పాటుచేయాలి. మంగళగిరిలో ఐటీ పరిశ్రమలు తీసుకురావాలి. చదువుకున్న యువతకు ఉద్యోగాలు కల్పించాలని కోరారు.

యువనేత లోకేష్ స్పందిస్తూ.. ఇళ్లులేని నిరుపేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తాం. స్టేడియం పనులు పూర్తిచేసి మౌలిక వసతులు కల్పిస్తాం. భూగర్భ డ్రైనేజీ నిర్మాణంతో పాటు ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు అందిస్తాం. వీధి లైట్లు ఏర్పాటు చేయిస్తాం. పరిశ్రమలు తీసుకువచ్చి స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మంగళగిరి ప్రజలను నా సొంతం చేసుకుని 29 అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టా. ప్రజలకు సేవ చేయాలని అహర్నిశలు కష్టపడ్డా. భారీ మెజార్టీతో గెలిపిస్తే సంక్షేమం, అభివృద్ధికి చిరునామాగా మంగళగిరిని మారుస్తానని లోకేష్ పేర్కొన్నారు.

Leave a Reply