మళ్లీ ఢిల్లీలో టీడీపీ ప్రధాన పాత్ర

– ఎన్నికల తర్వాత కేంద్రంలో టీడీపీ కీలకపాత్ర
– మాజీ ఎంపి కనకమేడల జోస్యం

ఢిల్లీ: పార్లమెంటు ఎన్నికల తర్వాత టీడీపీ మళ్లీ కేంద్రంలో కీలకపాత్ర పోషించబోతోందని ప్రముఖ న్యాయవాది, మాజీ ఎంపి కనకమేడల రవీంద్రకుమార్ జోస్యం చెప్పారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్రపటానికి, ఆఫీసు సిబ్బంది పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ, ప్రపంచంలో తెలుగువారి ఉనికి చాటిన ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీతోనే, బడుగు బలహీనవర్గాలు రాజ్యాధికారంలో భాగస్వాములయ్యారని గుర్తు చేశారు. తెలంగాణలో బీసీలకు రాజకీయ గుర్తింపునిచ్చింది టీడీపీయేనన్నారు. చంద్రబాబు సారథ్యంలో సామాజికన్యాయం లభించిందని, దళితులు-బీసీలకు స్పీకర్‌పదవులు లభించాయని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఇప్పుడు ఎన్డీఏలో పొత్తు పెట్టుకున్న టీడీపీ.. ఎన్నికల తర్వాత కేంద్రంలో కీలకపాత్ర పోషిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జగనాసుర పాలన అంతం కోసం, రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారని కనకమేడల వ్యాఖ్యానించారు.

Leave a Reply