కొండంత ధైర్యం ఇచ్చిన మంత్రి సురేఖ

– కాకతీయ రుద్రమదేవి తెగువ, ధైర్యాన్ని కొండా సురేఖలో చూస్తున్నామని ప్రజల ప్రశంసలు
– వరంగల్ పోచమ్మ మైదాన్ అగ్ని ప్రమాద సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించిన మంత్రి కొండా సురేఖ

వరంగల్ పోచమ్మ మైదాన్ లోని జకోటియా షాపింగ్ కాంప్లెక్స్ లో నిన్న రాత్రి జరిగిన భారీ అగ్ని ప్రమాద సహాయక చర్యలను అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దగ్గరుండి పర్యవేక్షించారు. అగ్ని ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని అగ్నిమాపక సిబ్బందికి సూచనలు చేస్తూ, తానూ అక్కడే ఉన్నారు. అగ్ని ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను అధికారులతో చర్చించారు. అక్కడి నుంచే సంబంధిత శాఖల అధికారులకు ఫోన్లు చేస్తూ, వారిని సమన్వయం చేస్తూ పరిస్థితిని సమీక్షించారు.

ప్రజల్లో ధైర్యం నింపిన కొండా సురేఖ
అగ్ని ప్రమాదం జరిగిన షాపింగ్ కాంప్లెక్స్ కు చుట్టుపక్కల ఉన్న నివాసిత ప్రాంతాల్లో మంత్రి సురేఖ కలియ తిరిగారు. భయపడాల్సిన అవసరం లేదని, మంటలు వ్యాపించకుండా పూర్తి రక్షణ చర్యలు చేపట్టామని వారిలో ధైర్యాన్ని నింపారు. పరిస్థితి అదుపులోకి వచ్చేవరకు అటుగా ఎవరూ రావద్దని మంత్రి వారికి సూచించారు.

కాకతీయ రుద్రమ దేవి ప్రతిరూపంగా కొండా సురేఖను ప్రశంసించిన ప్రజలు
స్వయంగా మంత్రి సురేఖ దగ్గరుండి పరిస్థితిని పర్యవేక్షిస్తుండటం పట్ల ప్రజలు ఊరట పొందారు. భీకరమైన అగ్ని ప్రమాద స్థలికి స్వయంగా వెళ్ళి పరిస్థితులను స్వయంగా సమీక్షించిన కొండా సురేఖ తెగువ, ధైర్యం గొప్పదనీ, కాకతీయ వీరనారి రుద్రమదేవి ప్రతిరూపమే కొండా సురేఖ అని ప్రజలు ప్రశంసించారు.

వీడియో కాల్ లో పరిస్థితిని సమీక్షించిన కొండా సుస్మిత పటేల్ (చిట్టక్క)
లండన్ పర్యటనలో ఉన్న కొండా సుస్మిత పటేల్ (చిట్టక్క) వరంగల్ పోచమ్మ మైదాన్ అగ్ని ప్రమాద ఘటనను తెలుసుకొని తన తల్లిగారు అయిన మంత్రి సురేఖకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వీడియో కాల్ ద్వారా అగ్ని ప్రమాద స్థలిని పరిశీలించారు. అగ్ని ప్రమాద ఘటనకు దారి తీసిన పరిస్థితులను, మంటలను అదుపులోకి తెచ్చేందుకు చేపడుతున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు.

కొండా సురేఖ ఆదేశాలతో రంగంలోకి కాంగ్రెస్ కార్యకర్తలు
మంత్రి కొండా సురేఖ ఆదేశాలతో అగ్నిప్రమాద సంఘటన స్థలానికి కొండా అభిమానులు, కార్యకర్తలు తరలి వచ్చి అగ్నిమాపక సిబ్బంది, మున్సిపల్, పోలీస్ సిబ్బందికి తమవంతు సహాయ సహకారాలు అందించారు. సహాయక చర్యల్లో పాల్గొంటూనే, పనిలో నిమగ్నమైన ప్రభుత్వ సిబ్బందికి వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్, మజ్జిగ ప్యాకెట్లు అందిస్తూ వారు మరింత ఉత్సాహంతో సహాయక చర్యల్లో పాల్గొనేలా సహకరించారు. సంఘటన స్థలంలో ఎవ్వరికీ ప్రమాదాలు జరగకుండా అన్ని శాఖలను సమన్వయం చేస్తూ సహాయక కార్యక్రమాలు చేపట్టారు.

Leave a Reply