వై.యస్.వివేకానందరెడ్డి హత్య, ఎవరు చేశారో!ప్రజలకు – దేవుడికి తెలుసని, హత్య చేసిన వ్యక్తి స్వేచ్ఛగా బయట తిరుగుతున్నాడని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. మరి, ప్రభుత్వం ఏం చేస్తున్నట్లో! సిబిఐ విచారణ ఎందుకు ముగింపుకు రావడం లేదో! హంతకులకు ఎందుకు శిక్షపడలేదో! తన వ్యాఖ్యల ద్వారా సిబిఐ మరియు న్యాయ వ్యవస్థల విశ్వసనీయత పట్ల ముఖ్యమంత్రి సందేహాన్ని వ్యక్తం చేసినట్లులేదా!
కృత్రిమ మేధస్సుతో ఆఫీసుల్లో, ఇళ్ళల్లో పనిచేసే రోబోలను తయారు చేసింది ఆధునిక మానవుడే. అలాగే, దోపిడీని – నేరాలను కప్పిపుచ్చుకోవడానికి ఆది మానవుడు దేవుడ్ని సృష్టించాడు. ఆ దేవుడి మీదకి అన్నింటినీ నెట్టేసి నేటి మానవుడు బతికేస్తున్నాడు. దేవుడే అన్ని చూస్తున్నాడు, చూసుకుంటాడంటారు! కర్మ సిద్ధాంతాన్ని ప్రబోధిస్తారు! ప్రజల మీదికి నెట్టేస్తుంటారు! నేరాలు – బాధ్యతల నుండి తప్పించుకుంటుంటారు.
ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలెందుకు? రాజ్యాంగం – చట్టాలెందుకు? పోలీసులు – నేర పరిశోధన – న్యాయ వ్యవస్థలేందుకు?