Home » కాడికి-మేడికి, రైతుకి – రైతుకూలీకి తేడా తెలియని జగన్ రెడ్డి

కాడికి-మేడికి, రైతుకి – రైతుకూలీకి తేడా తెలియని జగన్ రెడ్డి

– రైతుల్ని, వ్యవసాయాన్ని ఉద్ధరించానని చెబుతుంటే రైతులు నవ్వుతున్నారు
• సున్నావడ్డీకి రుణాలిస్తానని రైతులకు జగన్ రెడ్డి గుండుసున్నా చుట్టాడు
• రైతు భరోసా కేంద్రాల్ని రంగులు…రాజకీయ కేంద్రాలుగా మార్చాడు
• నాలుగున్నరేళ్లలో 3వేల రైతుల ఆత్మహత్యలు..ఒక్కోరైతుపై రూ.2.45లక్షల అప్పు తప్ప జగన్ రెడ్డి రైతాంగానికి, వ్యవసాయానికి చేసింది శూన్యం
– మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్

రైతుని రాజుని చేస్తాను..వ్యవసాయాన్ని పండగగా మారుస్తానని బీరాలు పలికిన జగన్ రెడ్డి, నాలుగున్నరేళ్లలో రాష్ట్ర వ్యవసాయరంగాన్ని దారుణంగా దెబ్బతీసి, రైతుల నడ్డి విరిచాడని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జగన్ రెడ్డి నాలుగున్నరేళ్లలో వ్యవసాయరంగాన్ని ఏవిధంగా నిర్వీర్యం చేశాడో, రైతాంగాన్ని ఎంత దగాచేశాడో వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

“ అధికారంలోకి రాకముందు రైతులకు అరచేతిలో వైకుంఠంచూపిన జగన్ రెడ్డి, అధికారంలోకి వచ్చాక రైతులు 9 పంటలకాలాలు పూర్తిచేసినా ఒక్కసారి కూడా రైతులకు సకాలంలో ఎరువులు.. విత్తనాలు అందించలేకపోయాడు. ఆఖరికి గిట్టుబా టు ధర, పంటలబీమా సాయం కూడా సక్రమంగా అందించలేదు. ప్రతిపక్షనేతగా రైతు లకు ఇచ్చిన భరోసాను విస్మరించి.. అధికారంలోకి వచ్చాక ఏర్పాటుచేసిన రైతు భరోసా కేంద్రాల్ని రంగుల కేంద్రాలుగా రాజకీయ కేంద్రాలుగా మార్చాడు.

రైతుల్ని కులమతాలు.. ప్రాంతాలవారీగా విడగొట్టిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ రెడ్డే
వ్యవసాయాన్ని, రైతుల్ని చంద్రబాబునాయుడు కులమతాలు.. ప్రాంతాలకు అతీతంగా ఆదుకుంటే, జగన్ రెడ్డి నాలుగున్నరేళ్లలో అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించాడు. రైతుల్లోకూడా కులమతాలు.. వర్గప్రాంతాలు చూసిన ఏకైక ముఖ్యమంత్రిగా నిలిచాడు. రైతుల్ని ఆదుకోవాలన్న ధృఢ సంకల్పంతో చంద్రబాబునాయుడు వారికి సబ్సిడీపై వివిధ రకాల యాంత్రీకరణ పరికరాలు… ట్రాక్టర్లు.. డ్రిప్ పరికరాలు అందించారు. రాయలసీమ జిల్లాలోని రైతాంగానికి ఉచితంగా విత్తనాలు, డ్రిప్ పరికరాలు అందించా రు.

రైతుల పంటఉత్పత్తుల్ని గిట్టుబాటు ధర కంటే అధికధరకు కొనేలా టీడీపీ ప్రభుత్వం పనిచేసింది. వ్యవసాయానికి ప్రధానమైన సాగునీటిప్రాజెక్టుల్ని పరుగులు పెట్టించి… పట్టిసీమ వంటి ఎత్తిపోతల పథకాలతో లక్షలఎకరాల కొత్త ఆయకట్టుని స్థిరీ కరించింది. టీడీపీప్రభుత్వం రైతులకు చేసిన సాయం..మేలులో అరశాతం కూడా జగన్ రెడ్డి నాలుగున్నరేళ్లలో చేయలేదు.

3 వేల మంది రైతు ఆత్మహత్యలకు కారణం జగన్ రెడ్డి రైతువ్యతిరేక పాలనే. హామీ ప్రకారం ఒక్క రైతుకైనా జగన్ నాలుగున్నరేళ్లలో రూ.50వేల రైతుభరోసా అందించాడా?
రైతులకు అందించే రైతు భరోసా సాయం కొందరికే ఇచ్చి..రైతుల్ని అవమానించాడు. కౌలు రైతుల కష్టాన్ని గుర్తించకుండా వారికి ఎలాంటి సాయం అందించకుండా వారు అసలు రైతులే కాదన్నట్టు నిర్దాక్షణ్యంగా వ్యవహరించాడు. జగన్ రెడ్డి రైతు వ్యతిరేక విధానాలతో, రాష్ట్రంలో దాదాపు 3వేలకు పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే.. ఏనాడూ ఒక్క రైతుకుటుంబాన్ని కూడా ముఖ్యమంత్రి హోదాలో పరామర్శించలేదు. తండ్రి మరణాన్ని తట్టుకోలేక వేలాది మంది చనిపోయారని ఓదార్పుయాత్రలు చేసిన జగన్ రెడ్డికి రైతుయాత్రలు చేయాలనిపించలేదా?

మేనిఫెస్టో తనకు బైబిల్ , ఖురాన్ తో సమానమని చెప్పే జగన్ రెడ్డి, హామీ ఇచ్చినట్టుగా నాలుగున్నరేళ్లలో ఒక్కరైతుకి కూడా ఏటా రూ.50వేల ఆర్థికసాయం ఎందుకు చేయలేదు? తెలుగుదేశం ప్రభుత్వంలో రైతులుగా గుర్తింపుపొంది అన్నిరకాల ప్రయోజనాలు పొందిన వారు, జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఎందుకు రైతులు కాకుండా పోయారు? రైతుభరోసా పేరుతో జగన్ రెడ్డి రాష్ట్రంలోని కొద్దిమంది రైతులకు ఇస్తున్న రూ.7,500లసొమ్ము రైతుకి ఏమూలకు సరిపోవడంలేదు. టీడీపీప్రభుత్వం రైతులకు 23వేల ట్రాక్టర్లు రైతుబంధు పథకం కింద అందిస్తే.. జగన్ రెడ్డి నాలుగున్నరేళ్లలో కేవలం 6 వేల ట్రాక్టర్లు.. అవికూడా తన పార్టీ వారికే ఇచ్చాడు.

అకాలవర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు హెక్టారుకు రూ.23లు.. రూ.30లు…రూ.90లు అందించిన కసాయి ఈ ముఖ్యమంత్రి. సున్నా వడ్డీకే రైతులకు రుణాలు ఇస్తున్నానని నమ్మబలికి రైతుల రుణాలకే గుండుసున్నా చుట్టాడు ఈ ముఖ్యమంత్రి. రంగుమారిన తడిచిన ధాన్యం ప్రతిగింజను కొంటానని చెప్పి.. వైసీపీకార్యకర్తలు..నేతల్ని దళారులుగా మార్చి రైతులకష్టాన్ని దోపిడీ చేశాడు. నాలుగున్నరేళ్లలో ఏ పంట ఉత్పత్తుల్ని అయినా జగన్ రెడ్డి పూర్తిగా గిట్టుబాటు ధర చెల్లించి కొన్నానని నిరూపించగలడా? రైతులకు సకాలంలో నీరు అందించలేని.. ప్రాజెక్టుల నిర్వహణను పట్టించుకోని ఈ ప్రభుత్వం.. ఈ ముఖ్యమంత్రి రైతుల్ని ఉద్ధరిం చామని చెప్పుకోవడం సిగ్గుచేటు. ఆఖరికి రైతుల పంటకాల్వల బాగుకోసం కేటాయిం చిన నిధుల్ని కూడా వైసీపీనేతలు మింగేయడంతో, చివరి ఆయకట్టు రైతులు నీరంద క అల్లాడిపోతున్నారు.

వ్యవసాయ మంత్రికి..ముఖ్యమంత్రికి కాడికి మేడికి తేడా తెలుసా? ఒక్కో రైతుతలపై రూ.2.45లక్షల అప్పులకుప్ప వేయడమే జగన్ రెడ్డి నాలుగున్నరేళ్లలో సాధించిన రైతుసంక్షేమం
ఎన్నికలకు ముందు ఆక్వారైతులకు యూనిట్ విద్యుత్ రూ.1.50పైసలకు ఇస్తానన్న జగన్ రెడ్డి..ముఖ్యమంత్రి అయ్యాక రూ.5.85లు వసూలు చేస్తున్నాడు. చంద్ర బాబు హయాంలో దేశానికే ఆదర్శంగా నిలిచిన రాష్ట్ర ఆక్వారంగం నేడు జగన్ పాలనలో అట్టడుగుస్థానానికి పడిపోయింది. ఒక్కో రైతు తలపై రూ.2.45లక్షల అప్పుపెట్టిన ఈ అప్పుల ముఖ్యమంత్రి, రాష్ట్రాన్ని..రైతుల్ని అప్పులఊబిలోకి నెట్టాడు. పాడిరైతుల్ని ఆదుకుంటానని నమ్మబలికి పాలడెయిరీలు.. సహకారసంఘాల పరిధి లోని రూ.6వేల కోట్ల ఆస్తుల్ని గుజరాత్ కు చెందిన అమూల్ సంస్థకు ధారాధత్తం చేసిన ఘనుడు ఈ ముఖ్యమంత్రి.

అమూల్ సంస్థకు పాలుపోసే రైతులకు బోనస్ లు ఇస్తూ..ఇతర డెయిరీలకు పాలుపోసే పాడిరైతులపై జగన్ రెడ్డి కక్షసాధింపులకు పాల్ప డుతున్నాడు. నాలుగున్నరేళ్లలో రైతులకు జగన్ చేసిన మోసంతో వ్యవసాయరంగమే మూతపడింది. కరువు మండలాలను ఏ దామాషా ప్రకారం ప్రకటించాడో ముఖ్యమంత్రి చెప్పాలి. నీరు అందుబాటులో ఉండికూడా రైతులు పంటలు ఎందుకు కాపాడుకోలేక పోతున్నారో చెప్పాలి. వ్యవసాయ శాఖ మంత్రి కాకాణికి, ముఖ్యమంత్రికి రైతుల గురించి వ్యవసాయం గురించి ఓనమాలు తెలుసా?

కాడికి, మేడికి తేడా తెలుసా.. దాపట ఎద్దుకి.. లోపట ఎద్దుకి వ్యత్యాసం తెలుసా? ఏ నేలలో ఏ పంట పండుతుందో ఎన్ని ఎకరాలకు ఎంతనీళ్లు అవసరమో తెలుసా? పెరిగిన ఎరువుల..విత్తనాలు ధరల్ని అదుపుచేయకుండా కృత్రిమకొరత సృష్టించి, రైతుల్ని దోపిడీ చేసిన దుర్మార్గపు ప్రభుత్వం జగన్ రెడ్డి ప్రభుత్వం.” అని ఆలపాటి రాజేంద్రప్రసాద్ స్పష్టంచేశారు.

Leave a Reply