“రిచ్ డాడ్ పూర్ డాడ్” అనే పుస్తకం ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన వ్యక్తిగత ఆర్థిక పుస్తకాలలో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా 32 మిలియన్లకు పైగా కాపీలు అమ్ముడయ్యాయి. 51కి పైగా భాషల్లో అనువాదమై, 109 దేశాల్లో ప్రాచుర్యం పొందిన ఈ పుస్తకం, న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్స్ జాబితాలో ఆరు సంవత్సరాలకు పైగా నిలిచింది.
అందులో దాని రచయిత రాబర్ట్ కియోసాకి మంచి అప్పు’ మరియు ‘చెడు అప్పు’ మధ్య తేడాను వివరించారు. ఆదాయం తెచ్చిపెట్టే ఆస్తులను సంపాదించడానికి వ్యూహాత్మకంగా ఉపయోగిస్తే, అప్పు సంపద సృష్టించడానికి శక్తివంతమైన సాధనమవుతుందని పేర్కొన్నాడు.
ప్రపంచంలో మొట్ట మొదటిసారిగా ఒక రాజధాని.. ప్రజల పన్నులతో కాకుండా అక్కడ అన్నదాతలు, ప్రభుత్వం ఆలోచనలతో నిర్మాణం మొదలెట్టింది. అప్పు ఎవ్వడూ ఊరక ఇవ్వడు. ఎన్నో సార్లు వచ్చి పరిశీలించి, అభిప్రాయాలు తీసుకొని ధీర్ఘకాలిక రుణం ఇస్తున్నాయి ప్రపంచ బ్యాంకు నుండి హడ్కో వరకు.
50% మౌలిక వసతులు, పచ్చదనం వుండేలా నిర్మిస్తున్న రాజధాని. ప్రభుత్వానికి, అన్నదాతలకు చెరో పాతిక శాతం మిగులుతుంది.
నిత్యం రోడ్లు త్రవ్వుతూ.. కరెంటు తీగలు పడుతూ.. దుమ్ము కొట్టుకొని పోతూ.. నీటి కోసం వాటర్ ట్యాంకుల మీద ఆధారపడుతూ.. చాలీ చాలని రోడ్లతో ట్రాఫిక్ జాములలో ఇరుక్కొంటూ.. చినుకు పడితే ముంపుకు గురయ్యే బడా రాజధానులలో కొన్ని ప్రాంతాలలో గజం మూడు లక్షలకు పైగా వుంది.
నలభై వేల ఎకరాలలో చెరి పది వేల ఎకరాలకు గజం లక్ష వేసుకొన్నా.. చెరి 4,84,000 కోట్లు అంటే సుమారు పది లక్షల కోట్ల సంపద అవుతుంది. అందులో 50 వేల కోట్ల అప్పుచేసినా అదెంత దాని ముందు. ఇదీ సంపద సృష్టి అంటే. ఇదేదో అన్నదాతలు, ప్రభుత్వంకు మాత్రమే జరిగే యవ్వారం కాదు కదా.
ప్రభుత్వానికి వచ్చే సంపద ప్రజలది కాదా?
అటువంటి నిర్మాణంలో ఎంత ఉపాధి, ఎన్ని వ్యాపార అవకాశాలు, ఎన్ని ఉద్యోగాలు వస్తాయో ఆలోచించాలి కదా?
ఎవడో పనికిమాలిన పొరుగు పురుగులు, రిటైర్ అయ్యి కొంపల్లో కూడా పట్టించుకోని వారు సచ్చే ముందు కూడా ఏడుస్తూ వ్రాసే వ్రాతలతో ఆంధ్రా తలరాత మారదు.
ఒక దార్శనికుడు చంద్రబాబు కట్టిన సైబరాబాద్ ఎకో సిస్టంతో తెలంగాణా బిందాస్‌గా బతికేస్తోంది. పల్లెల నుండి లక్షలా మంది వెళ్లి ఉపాధి, ఉద్యోగాలు పొందుతున్నారు. మహారాష్ట్ర నుండి దేశ వ్యాప్తంగా అమీర్పేట్ లో వచ్చి ఐటీ ట్రైనింగ్ సెంటర్లలో చదువుకొంటున్నారు.
ఎవడమ్మ మొగుడి సొమ్ములూ తెచ్చి పెట్టడం లేదు రాజధాని అమరావతికి. దాని ప్రస్తుత ప్రణాళిక మరియు రైతులు ఇచ్చిన భూమి తోనే అది రాజధానిగా మారుతుంది. ఆ సంపద మాత్రం ప్రజలందరికీ చెందుతుంది. ఇలా చెప్పి ఉండాల్సింది చెప్పుతో కొట్టినట్లు. మంత్రి నారాయణ ఉన్నత చదువులు చదువుకొన్న వారు కాబట్టి చాలా సౌమ్యంగా.. అర్థం అయ్యేట్లు చెప్పారు. పనిలేని గాడిదలకు అర్థం అయినా అవి ఓండ్ర పెడతాయి. పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే ఎన్నికలు మూడు ముక్కలు, అమరావతే ఏకైక రాజధాని అని జరిగింది కాబట్టి, జనం ఆకాంక్షల మేరకు 10 లక్షల కోట్ల సంపద సృష్టితో పాటు, అంతర్జాతీయ స్థాయి నగరంగా గర్వంగా తలెత్తుకొనేలా నిర్మించాలి. రాజధాని లేని రాష్ట్రం అని ఎగతాళి చేసిన వారు ఈర్ష్యపడేలా మరికొన్ని శతాబ్దాలకు సరిపడేలా దాని నిర్మాణం మొదలవ్వాలి..
– చాకిరేవు