తడిచిన కళ్ళు తుడుచుకుంటూ
చూస్తున్న తుళ్లూరు …
మసకబారిన బతుకులతో
మిగిలిన
మందడం…
కలలు కరిగి పోయి
కష్టాలే మిగిలిన
కృష్టాయ పాలెం…
అభివృద్ధి అడుగంటి…
ఎండిన మొక్కలా మిగిలిన వెలగపూడి…
పోరాటానికి
పిడికిలెత్తిన పెద్దపరిమి…
ఉద్యమమే బతుకైన ఉద్దండరాయునిపాలెం….
కొండంత ఆవేదనని గుండెల్లో దాచుకొని…
దీక్ష చేస్తున్న అనంతవరం…
నేలతల్లే దిక్కని
నియంత పై నిలబడి
పోరాడిన
నెక్కల్లు….
అరాచక పాలన పై
దండు కట్టి నిలబడ్డ
దొండపాడు…
రాజధాని ఆనవాళ్లను…
పోరాడి నిలబెట్టిన
ఐనవోలు….
హైకోర్టుకు భూములిచ్చి
రాష్ట్రానికి రక్షణనిచ్చిన
నేలపాడు…
రాయలవారికే
నీడ నిచ్చి..
రాజధాని కై భూములిచ్చి
అమరావతి కోసం
పవిత్ర యుద్ధం చేసిన
రాయపూడి….
వెలుగులు
విరజిమ్మిన చోటే
చీకట్లు ముసిరినా…
స్థిరంగా నిలబడ్డ
వెంకటపాలెం…
ఒక్కొక్క ఊరుది ఒక్కొక్క కథ…
పువ్వాడ సుధాకర్
షేక్ సాహెబ్ జాన్
గడ్డం మార్టిన్
ఒక కులం కాదు…
ఒక మతం కాదు…
అయినా…
ఒకటే నినాదం..
సేవ్ అమరావతి.
సేవ్ ఆంధ్ర ప్రదేశ్..
