Suryaa.co.in

Andhra Pradesh

విజయవాడలో విద్యార్థుల కోవిడ్ టీకా కుంభకోణంపై విచారణ జరిపించాలి

ఆంధ్రప్రదేశ్ బ్యాక్వార్డ్ క్లాస్ ఫెడరేషన్ ఛైర్మన్ తమ్మిశెట్టి చక్రవర్తి డిమాండ్

విజయవాడ మారుతీనగర్ ఆంధ్రప్రదేశ్ బ్యాక్వార్డ్ క్లాస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఛైర్మన్ తమ్మిశెట్టి చక్రవర్తి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యార్థులకు రెండోవ దోసు టీకాలు ఇవ్వకుండా ఇచ్చినట్లు మోసం చేసి సెల్ఫోన్కి మేసేజ్లు పంపారని ముఖ్యంగా తన కుమారుడికి ఈనెల 19న 2వ డోస్ వేసినట్లు మెసేజ్ పంపారని దీనిపై రవీంద్రభారతి స్కూల్ యాజమాన్యంని సంప్రదించినా వారు అవి హెల్త్ సెక్రెటరీని సంప్రదించాలని అవి అలానే వస్తాయని హెల్త్ సెక్రెటరీ చెప్పారని తమ స్కూల్లో వ్యాక్సిన్ వేయలేదని అందరికి మెసేజులు వచ్చాయని టీకా అందుబాటులో లేదని వచ్చినప్పుడు వేస్తామని చెప్పారని తెలిపారు. దీనిపై ఇతర స్కూల్ విద్యార్థులని అడిగినా వారికి టీకా వేసినట్లు మెసేజీలు వచ్చాయని తెలిపారు. అయితే కోవిడ్ టీకా వేయకుండా వేసినట్లు బ్యాచ్ నెంబర్తో సహా ఫుల్లీ కోవిడ్ టీకా సర్టిఫికెట్ పంపడం విడ్డురంగా ఉందని తెలిపారు. విషయం తెలిసిన వెంటనే దీనిపై వెంటనే జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు గారి దృష్టికి తీసుకెళ్లామని, స్పందించిన కలెక్టర్ విచారణ జరిపి సరిచేస్తామని తెలిపారని చెప్పారు. నిర్లక్ష్యంగా వ్యహరించిన సంబంధించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE