అనిల్ కుమార్, ముందు నీ బాబాయ్ తో నీకున్న వ్యవహారాలు తేల్చుకో

Spread the love

• నోరుందని లోకేశ్ ని, టీడీపీనేతల్ని విమర్శిస్తే, అంతకంటే ఎక్కువే మేం మాట్లాడతాం. మేంనోరుతెరిస్తే నువ్వ, మీనాయకుడు తలఎక్కడపెట్టుకుంటారో ఆలోచించుకోండి
• అనిల్ కుమార్…నువ్వు ఒరేయ్ తురేయ్ అంటే మేం దానికిమించి మాట్లాడతాం
• మా నాయకుడు లోకేశ్ అమెరికాలోచదివాడని గర్వంగా చెప్పుకుంటాము.. మీనాయకుడు ఏంచదివాడో, ఎక్కడచదివాడో చెప్పగలవా అనిల్?
• సొంతబాబాయ్ సహా, నెల్లూరుజిల్లా వైసీపీనేతలతో, ఆఖరికి మంత్రులతో కూడా నీకుఎందుకు పడటంలేదు అనిల్?
• మీలో మీకు బెట్టింగ్, మాదకద్రవ్యాలసొమ్ములో పంపకాల్లో తేడాలొచ్చి, ఆ నిరాశానిస్పృహల్ని మానాయకుడిపై చూపిస్తే ఊరుకుంటామా?
• ఎప్పుడూ వరదలేరాని సర్వేపల్లి కాలువపై వాల్స్ కట్టించి, ప్రజలసొమ్ము కొట్టేసిన పెద్ద ముద్దపప్పు అనిల్.
– యువగళం పాదయాత్ర ప్రదేశంలో (గూడూరు) టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి

“ వైసీపీనేత, మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ లోకేశ్ గురించి, యువగళం పాదయాత్ర గురించి నోరేసుకొని తెగవాగుతున్నాడు. అనిల్ నువ్వు లోకేశ్ ను, చంద్రబాబుని, టీడీపీనేతల్ని విమర్శించడాన్ని మేంతప్పుపట్టడంలేదు. కానీ నువ్వు మాట్లాడేభాష మాత్రం ఎంతమాత్రం సరైందికాదు. లోకేశ్ ను ఉద్దేశించి, ‘ఒరేయ్ లోకేశ్’ అన్నావు. తిరిగి మేంకూడా ‘ఒరేయ్ జగన్’ ‘ఒరేయ్ అనిల్, తురేయ్ అనిల్’ అంటే నువ్వు, నీ నాయకుడు తలఎక్కడ పెట్టుకుంటారు? అనిల్ నువ్వుమాట్లాడే మాటలు, నీభాష ఏమాత్రం కరెక్ట్ కాదు. బాగా గుర్తుపెట్టు కో, నోరుఅదుపులో పెట్టుకొని మాట్లాడు. మానాయకుడు లోకేశ్ అమెరికాలో చదివాడని గొప్పగా చెప్పుకుంటాం.. మీ నాయకుడు ఎక్కడ చదివాడో; ఏంచదివాడో ఆసర్టిఫికెట్స్ బయటపెట్టగలవా అనిల్? దుష్టచతుష్టయం అనేమాట స్పష్టంగా పలకలేని వాడు నిప్పా?

లోకేశ్ ను పప్పు అన్నావు. మా యువనాయకుడు లోకేశ్ అమెరికాలోని స్టాన్ ఫోర్డ్, కెల్లాక్స్ యూనివర్శిటీల్లో చదివాడు. అనిల్ మీనాయకుడు ఎక్కడ చదివాడు? మీ హాఫ్ టిక్కెట్ జగన్ రెడ్డి పదోతరగతి తప్పాడు. స్టాన్ ఫోర్డ్ వంటి గొప్పవిశ్వవిద్యాలయంలో చదివిన మా యువనేత పప్పుఅయితే, పదోతరగతి తప్పిన మీ నాయకుడు నిప్పా? భలే ఉంది అనిల్. వినాయకుడు నిజంగా పదో తరగతి పాసై ఉంటే, దానికి సంబంధించిన సర్టిఫికెట్స్ చూపించండి.

మీ నాయకు డు పదోతరగతి ఒక్కసారే పాస్ అయ్యాడా..లేక ఎస్.ఎమ్.ఎస్ విధానంలో పాస్ అయ్యాడా? సెప్టెంబర్ మార్చి, సెప్టెంబర్లో పరీక్షలురాసుకుంటూ, విడతలవారీగా పాస్ అయ్యాడా? మీనాయకుడు తెలుగుసరిగా చదవలేడు..దుష్టచతుష్టయం అనేమాటస్పష్టంగా పలకలేడు. అలాంటివాడు నిప్పా? అనిల్ సద్విమర్శలు చేయండి. అంతేగానీ వ్యక్తిగతదూషణలకు దిగకండి.

మీరు ఒకటంటే మేం రెండు అంటాం. నాకు అనడం చేతగాకకాదు. బాగాగుర్తుంచుకో అనిల్. జగన్మోహన్ రెడ్డి నిజంగా పదోతరగతి పాసైతే, ఇంటర్, ఆపైచదువులు పూర్తిచేస్తే, అతని విద్యాభ్యా సానికి సంబంధించిన సర్టిఫికెట్స్ మీడియావారికి విడుదల చేయ్ అనిల్. మా ముఖ్యమంత్రి ఎంతచదివాడు..ఎక్కడచదివాడు..ఏం చదివాడో తెలుసుకోవాలని ప్రజలుకూడా చాలా ఉత్సుకతతో ఉన్నారు. మీనాయకుడి చదువుఇదని ఫలానా చోట చదివాడని మేంకూడా గొప్పగాచెబుతాం.

బుజ్జికొండా అనిల్… మీ జగన్ కు దమ్ము, ధైర్యముంటే, తడబడకుండా, కాగితాలు చూడకుండా గంటపాటు మీడియా వారితో మాట్లాడమను. అప్పుడు ఒప్పుకుంటాం.. మీనాయకుడి చదువు, తెలివితేటలు గొప్పవని
మీనాయకుడికి నిజంగా దమ్ము, ధైర్యముంటే, ఏఅంశంపై అయినా సరే ఒక గంట పాటు మీడియాతో నేరుగా మాట్లాడమని చెప్పు అనిల్. ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ.5 అని లేకుండా అన్నిపత్రికలు, ఎలక్ట్రానిక్ ఛానళ్లవారిని ఫేస్ చేస్తూవారితో నేరుగా మాట్లాడమను అనిల్. మీడియా ప్రతినిధులు అడిగే ప్రశ్నలకు తడబడకుం డా, కాగితాలు చూడకుండా మాట్లాడమని చెప్పు. అప్పుడు ఒప్పుకుంటాం మీ నాయకుడి చదువు, తెలివితేటల గురించి. ఊ అంటే ఉత్తుత్తి ప్రమాణాలు చేయడం కాదు.. మీ పాపిష్టిపనులకు దేవుళ్లను డిస్టర్బ్ చేయడం ఎందుకు? నేరుగా జనంలోకి రండి అక్కడే తేల్చుకుందాము.

జగన్ భజనచేసే అనిల్ కుమార్ కు, సొంత పార్టీ నేతలతో ఎందుకు పడటంలేదు?
పొద్దునలేస్తే జగన్ భజనచేసే అనిల్ కుమార్ కు నెల్లూరుజిల్లాలోని వైసీపీనేతల తో ఎందుకు పడటంలేదు? ఆఖరికి మంత్రులుగాఉన్నవారిపై కూడా ఎందుకు కారాలు, మిరియాలు నూరుతున్నాడు? కాకాణి గోవర్థన్ రెడ్డి, మేకపాటికుటుం బం, కావలి రామ్ ప్రతాప్ రెడ్డితో అందరితో ఎందుకుతగువులు పెట్టుకుంటున్నాడు?

ఆనం కుటుంబాన్ని అంతంచేసేంత వాడివారా వచ్చానువ్వు? అరేయ్ బచ్చా మా కుటుంబాన్ని అంతంచేసేవాడు ఇంకా పుట్టలేదు? నువ్వు, మీనాయకుడు జిప్పులుతీసినా, కర్రలుతీసినా మమ్మల్ని ఏమీచేయలేరు. మేంనిత్యంప్రజల్లోనే ఉంటాం. మీకులాగా అధికారంఉన్నప్పుడు ఒకలా..లేనప్పుడు ఒకలా ప్రవర్తించం.

అనిల్ కుమార్.. మీకు మీకు తేడాలొస్తే నాలుగ్గోడల మధ్యన కూర్చొని సెటిల్ చేసుకోండి. అంతేగానీ కార్యకర్తల సమావేశంలో ఉడత ఊపులు, హూంకరింపులు ఎందుకు?
లోకేశ్ నెల్లూరురావాలని శపథాలుచేయడం కాదు అనిల్.. ముందు బాబాయ్, అబ్బాయికి ఎందుకి ఎక్కడ గొడవమొదలైందో చెప్పు? బాబాయ్ రూప్ కుమార్, అబ్బాయి అనిల్ కుమార్ కి ఎక్కడ తేడావచ్చిందో అనిలే సమాధానం చెప్పాలి. క్రికెట్ బెట్టింగ్ లోనా.. లేక గంజాయి, మాదకద్రవ్యాల స్మగ్లింగ్ లోనా, లేక సింగిల్ డిజిట్ లాటరీవ్యవహారంలోనా..ఎక్కడ తేడావచ్చింది అనిల్?

మీకుమీకు తేడాలు ఉంటే, ఇళ్లల్లో నాలుగ్గోడలమధ్యన కూర్చొని తేల్చుకోండి. అంతేగానీ కార్యకర్తల మీటింగ్ లో హూంకరింపులు, ఉత్తుత్తి వీరంగాలుఎందుకు? కార్యకర్తల సమావే శంలో సెల్ ఫోన్ చూపిస్తూ, బటన్ నొక్కుతా.. నీ బాగోతం బయటపెడతాఅని నీ బాబాయ్ ని బెదిరించావు. ఆ బటన్ ఏదో నొక్కితే మేంకూడా చూస్తాం. అంతేగానీ ఉడతఊపులు ఎందుకు అనిల్?

అనిల్ నీగురించి, మీ పార్టీ నేతలే ఏమంటున్నారో ముందు తెలుసుకో. తరువాత మా నాయకుడి గురించి మాట్లాడుదువుగానీ!
అనిల్ కుమార్, అతని బాబాయ్ రూప్ కుమార్ ఎప్పుడు వారి బాగోతాన్ని బయటపెట్టుకుంటారా అని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మాజీమంత్రి తన బాబాయ్ కి వచ్చిన ఇంటర్నేషనల్ నోటీస్ వ్యవహారాన్ని దాచిపెట్టానని చెబితే, ముఖ్యమంత్రి, సజ్జలరామకృష్ణారెడ్డి, డీజీపీ ఏంచేస్తున్నారు? అనిల్ కుమార్ వ్యాఖ్యల్ని సుమోటోగా తీసుకొని అతనిపై కేసునమోదుచేసి చర్యలు తీసుకోరా?

అనిల్ కుమార్, నిన్నుఉద్దేశించి మీపార్టీకి చెందిన డిప్యూటీమేయర్, మీ బాబాయ్ ‘చెప్పుతినెడి కుక్క, చెరకుతీపి ఎరుగునా, అల్పబుద్ధివానికి అధికార మిచ్చినన్ దొడ్డవారినెల్ల తొలగగొట్టున్’ అన్నాడు. మాపార్టీలో, మాప్రభుత్వంలో మాపరిస్థితి చాలాదారుణంగా ఉందని మీడియాసాక్షిగా వాపోయాడు అనిల్. అతని బాధ, ఆవేదన నీకుకనిపించలేదా? డిప్యూటీమేయర్ రూప్ నీ బతుకు బయటపెడతాను అంటున్నాడు. నువ్వు ఎప్పుడు వారి బతుకు బయటపెడుతున్నావు అనిల్?

బెట్టింగ్ బంగార్రాజు అని కామెంట్ చేస్తున్నారు.. ఆపాపం ఎవరిది అని నువ్వు అంటున్నావు? ఎవరి పాపాన్నో చచ్చేదాకా నేను మోస్తున్నాను అంటున్నావు. ఏమిటా పాపం.. ఎవరి పాపాన్నో నువ్వు ఎందుకు మోస్తున్నావ్ అనిల్ కుమార్? ఏమయ్యా అనిల్ ఇద్దరూకలిసి వ్యాపారంచేసినంతకాలం బాగానే ఉన్నారు.. డబ్బుపంపకాల విషయం వచ్చేసరికి నాకేంసంబంధంలేదు అని అంటే ఎలా అనిల్?

మాజీ ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్, తనబాబాయ్ రూప్ కుమార్ క్రికెట్ బెట్టింగ్స్ చేస్తున్నాడని చెప్పాడు. మాజీమంత్రి వ్యాఖ్యలపై ముఖ్యమంత్రిగానీ, సజ్జలరామకృష్ణారెడ్డి, డీజీపీఎవరైనా కేసు నమోదు చేశారా? సుమో టోగా కేసు నమోదు చేసి రూప్ కుమార్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదు? వైసీపీ డిప్యూటీ మేయర్ పై మాజీమంత్రి మాట్లాడితే చర్యలుతీసుకోకుండా, తాడేపల్లి ప్యాలెస్ కు పిలిపించి లెక్కలు అడుగుతారా? అనిల్ కుమార్.. బుజ్జికొండా.. ఇంటర్నేషనల్ నోటీస్ అన్నావు.

మీ బాబాయ్ పై ఇంటర్నేషనల్ నోటీస్ వచ్చిందని తెలిసి దాన్నిబయటపెట్టకుండా, ఆయన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నావా అనిల్? నీ వాటాకోసం సొంతబాబాయ్ ని వేధిస్తావా? నువ్వు రూప్ కుమార్ యాదవ్ వ్యవ హారం గురించి బటన్ నొక్కుతాను అంటున్నావు… నీ వ్యవహారం గురించి రూప్ కుమార్, నుడా ఛైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ తదితరులు మేం బటన్ నొక్కు తాం అంటున్నారు. మీరంతా ఒకరిబటన్లు ఒకరు ఎప్పుడునొక్కుకుంటారా అని నెల్లూరుప్రజలతోపాటు, రాష్ట్రమంతా ఆసక్తిగాఎదురుచూస్తోంది.

సొంతపార్టీనేతలు వాటాల్లో తేడాలొచ్చి బటన్లు నొక్కుకుంటున్నాం అంటుంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరివాటాలు వారికిపంచి, మిగిలిందాన్ని తాడేపల్లి ప్యాలెస్ కు తరలించకుండా చూస్తూఊరుకుంటే ఎలా? అనిల్ కుమార్, రూప్ కుమార్, ఇతర నెల్లూరువైసీపీనేతలు ముందు వారివాటాల వ్యవహారం తేల్చుకు న్నాక, మా నాయకుడిగురించి, తెలుగుదేశంనేతలగురించి మాట్లాడుకుంటే మంచిది.

వరదలే రాని సర్వేపల్లి కాలవపై వాల్స్ కట్టించిన నువ్వు పెద్దముద్దపుప్పువి అనిల్. అనిల్ కుమార్ లాంటివాళ్లు మననాయకుడిని విమర్శిస్తే, మనం నేరుగా జగన్ ని ఏకిపారేద్దాం
మానాయకుడిని పప్పు అంటున్న నువ్వు ఎంతపెద్ద ముద్దపప్పువో కూడా తేలుస్తాం అనిల్ కుమార్. నెల్లూరు టౌన్ నుంచి రూరల్ నియోజకవర్గంలోకి వెళ్లే సర్వేపల్లికాలువ నుంచి సాగునీరు వెళ్తుంది. ఆ కాలువపై వరదనియంత్రణ కోసం వాల్స్ కట్టారు. అలాకట్టేటప్పుడు ఎవరైనాసరే సగంసగంకట్టేసి వదిలేస్తారా? ఆ కాలువపై టౌన్ లిమిట్స్ లో పెద్దపెద్దవాల్స్ కట్టి, రూరల్ నియోజకవర్గంలోకి రాగా నే వాల్స్ కట్టకుండా వదిలేశారు. అకాలవర్షాలకు భారీగావరదవస్తే, రూరల్ ని యోజకవర్గం పరిస్థితి ఏమిటి అనిల్ కుమార్?

ఇలాంటి పనులు ఎవడైనా చేస్తాడా? అసలు నీకు ఇరిగేషన్ మంత్రి ఇచ్చిందిఎవడు అనిల్? రూరల్ నియోజక వర్గాన్ని ముంచేయాలని సగంసగంపనులు చేశావు. కానీ సర్వేపల్లి కాలువకు వచ్చేవరదనీరు ముందుగా ముంచెత్తేది టౌన్ నియోజకవర్గాన్నే. అసలు ఆ కాలువనుంచి ఎప్పుడూ వరదవచ్చిందిలేదు. కేవలం టెండర్లుపిలిచి, సొమ్ముచే సుకోవడానికే అవసరంలేకపోయినా ఉత్తుత్తిగా, ప్రభుత్వ సొమ్ముని దిగమింగడాని కి కాలువపై వాల్స్ కట్టించావు. ఇదంతా ఎవరికితెలియదన్నట్లు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావా అనిల్?

ఊ అంటే మీసాలు తిప్పడం కాదు అనిల్.. దమ్ముం టే నువ్వు అనాలనుకుంటే నేరుగా అను. అంతేగానీ పేర్లుమార్చి మహిళలనే గౌర వం లేకుండా మాట్లాడకు. నువ్వు, నీ బాబాయ్ సౌత్ ఆఫ్రికా, మెక్సికో, సౌత్ అమెరికాకు వెళ్లారు. అక్కడమీరిద్దరూ సాగించిన డ్రగ్స్ వ్యాపారంలో తేడాలొచ్చే మీ బాబాయ్ కి ఇంటర్ పోల్ నోటీసులువచ్చాయి. వాటిని అడ్డంపెట్టి, నువ్వు మీ బాబాయ్ ని బెదిరిస్తున్నావు.

అలానే ఐపీఎల్ బెట్టింగ్స్ లో నీకు, నీ బాబాయ్ కు కూడా పొసగలేదు. కానీ ఆ వ్యవహారంలో మీఇద్దరివాటాలతోపాటు, కొంతవాటా తాడేపల్లి ప్యాలెస్ కు చేరిందనేది నిజం. నీకన్నా ఎక్కువగా నీ బాబాయ్ జగన్ జపంచేస్తాడు అనిల్. జగన్మోహన్ రెడ్డి గతఎన్నికల్లో మేకపాటి గౌతమ్ రెడ్డికి 4 సీట్లు ఇచ్చాడు. వాటిని అతనుపార్టీపట్ల, జగన్ పట్ల విధేయులైనవారికి ఇస్తే, నువ్వు నీ మనుషుల్ని పెట్టి నీపార్టీ మనిషినే ఓడించావా లేదా అనిల్?

జగన్ సీటు ఇచ్చినవాడినే ఓడించిన నువ్వు జగన్ కు ఎలా వీరవిధేయుడివి? తాడే పల్లి ప్యాలెస్ కేంద్రంగా నెల్లూరుసహా రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న డ్రగ్స్ మూలాల పై కేంద్రప్రభుత్వం వెంటనే దర్యాప్తుజరిపించాలి. తెరవెనకున్న పెద్దతలకాయల్ని తక్షణమే అరెస్ట్ చేయించి జైలుకుపంపాలి. అప్పుడే ప్రజలు, రాష్ట్రంప్రశాంతంగా ఉంటాయి.

అనిల్ కుమార్ మనల్ని విమర్శిస్తే, మనం జగన్మోహన్ రెడ్డిని ఏకిపారే ద్దాం. వైసీపీలోని అడ్డమైనవారిపై దృష్టిపెట్టేబదులు అసలునాయకుడినే టార్గెట్ చేస్తే మంచిది. గూడూరు ప్రజలారా లోకేశ్ బాబుకు భారీగా మద్థతుతెలపండి. మీ జయజయధ్వానాలు, హార్షాతిరేకాలతో తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కంపించాలి.”

Leave a Reply