Suryaa.co.in

Andhra Pradesh

పోస్టల్ బ్యాలెట్ కేసులో వైసీపీకి మరో చెంప దెబ్బ

-వైసిపి ఎస్.ఎల్.పిని డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు

పోస్టల్ బ్యాలెట్‌కు సంబంధించి ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఉత్తర్వులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైకాపా) దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ రోజు జరిగిన విచారణలో జస్టిస్ అరవింద్ కుమార్ మరియు జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.

వైకాపా తరపున ప్రముఖ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించగా, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తరపున సీనియర్ న్యాయవాది ఆదినారాయణ, సిద్ధార్థ లూత్ర, రవితేజ పదిరి, జవ్వాజి శరత్ లు వాదనలు వినిపించారు.

విచారణ ముగిసిన అనంతరం, ధర్మాసనం హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. దీంతో ఎన్నికల కమిషన్ జారీ చేసిన పోస్టల్ బ్యాలెట్ ఉత్తర్వులు యథావిధిగా కొనసాగుతాయి.

LEAVE A RESPONSE