పొత్తు ధర్మం ప్రకారం టీడీపీ సీట్లు అనౌన్స్ చేయకూడదు… చేశారు

-రాష్ట్ర ప్రయోజనలు దృష్టికి పెట్టుకొని నేను మౌనంగా ఉంటున్నా
-అనుకోకుండా కొన్ని జరుగుతాయి. వాటిని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు
-పార్టీ నేతలు అర్దం చేసుకోవాలని కోరుతున్నా
-జగన్ ప్రభుత్వం 2024 లో మళ్ళీ అధికారంలోకి రాకూడదు
-జగన్ పై నాకు వ్యక్తిగత కక్ష లేదు
– టీడీపీ ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించడంపై స్పందించిన పవన్ కల్యాణ్

అమరావతి; పొత్తు ధర్మం ప్రకారం టీడీపీ సీట్లు అనౌన్స్ చేయకూడదు చేశారు. అందుకు పార్టీ నేతలకు నేను క్షమాపణలు చెబుతున్నా. టీడీపీ సీట్లు అనౌన్స్ చేయడం పార్టీలోని కొందరు నేతలను ఆందోళనకు గురి చేసింది. లోకేష్ సీఎం పదవి గురించి మాట్లాడిన నేను పట్టించుకోలేదు.రాష్ట్ర ప్రయోజనలు దృష్టికి పెట్టుకొని నేను మౌనంగా ఉంటున్నా.

సీనియర్ నేతగా ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి , అలా జరుగుతూ ఉంటాయి. అనుకోకుండా కొన్ని జరుగుతాయి. వాటిని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. పార్టీ నేతలు అర్దం చేసుకోవాలని కోరుతున్నా. పొత్తును ఇబ్బందులకు గురి చేసేలా కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం 2024 లో మళ్ళీ అధికారంలోకి రాకూడదు. జగన్ పై నాకు వ్యక్తిగత కక్ష లేదు

Leave a Reply