రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిలా రెడ్డి కాకుండా ఎలా పోతుంది?

-మనవడు రాజారెడ్డి కి ఆపేరు పెట్టింది వైఎస్సార్
-భారతమ్మ చేయాలని అనుకున్న పాదయాత్ర నేను చేశానట
-దేవుడు మీద ప్రమాణం చేయగలరా ?
-నా భర్త అనిల్ ఒక్క రోజు కూడా జగన్ రెడ్డి ని కలవలేదు
-కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి
-నిజమో కాదో అమ్మ విజయమ్మ తో చెప్పించండి

ఎవరో నాకు కితాబు ఇస్తే నా విలువ ఎక్కువ కాదు. కితాబు ఇవ్వక పోతే నా విలువ తక్కువ కాదు. నేను వైఎస్సార్ రక్తం. రాజశేఖర్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అయినప్పుడు ఆయన బిడ్డ వైఎస్ షర్మిలా రెడ్డి కాకుండా ఎలా పోతుంది? మనవడు రాజారెడ్డి కి ఆపేరు పెట్టింది వైఎస్సార్. నిజం ఎప్పుడు నిలకడగా నిలుస్తుంది. వైఎస్సార్ ఆశయాల కోసమే నేను కాంగ్రెస్ లో చేరాను. నా దగ్గరి మనుషులు కూడా ఎన్నెన్నో మాట్లాడుతున్నారు. చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు.

నా పాదయాత్ర గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. భారతమ్మ చేయాలని అనుకున్న పాదయాత్ర నేను చేశానట. నా స్వార్థం కోసం పాదయాత్ర చేశానట. జైల్లో అధికారి చెప్పాడట. దమ్ముంటే అప్పటి జైలు అధికారి తో ఈ విషయం చెప్పించ గలరా ? దేవుడు మీద ప్రమాణం చేయగలరా ? ఆ రోజు ఏం జరిగిందో నేను ప్రమాణం చేసి చెప్పగలను నాకు నేనుగా ఎప్పుడు పాదయాత్ర చేయలేదు.

నన్ను అడిగితే తప్ప నేను పాదయాత్ర చేయలేదు. మేము అక్రమ సంపాదన కి స్కెచ్ వేశామని చెప్తున్నారు. జగన్ రెడ్డి అధికారంలో వచ్చిన తర్వాత కేవలం ఒక్క సారి మాత్రమే విజయమ్మ తో మాత్రమే వెళ్ళాను. నా భర్త అనిల్ ఒక్క రోజు కూడా జగన్ రెడ్డి ని కలవలేదు. తప్పుడు నిందలు వేయాలని చూస్తే పైన దేవుడు ఉన్నాడు. జగన్ ముఖ్యమంత్రి కావాలని నిస్వార్థంగా కోరుకున్న. దమ్ముంటే ఇది నిజమో కాదో అమ్మ విజయమ్మ తో చెప్పించండి.

Leave a Reply