పరిపాలనలో రాజ్యాంగ స్ఫూర్తి లేదు

– భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి
రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ
– ప్రజలను గాలికొదిలేశారు
– భాజపా జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్
– విజయవాడ భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
ముఖ్యఅతిధిగా పాల్గొన్న భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, భాజపా జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్
-జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన పురందేశ్వరి
– ఏలూరుకు చెందిన జెండా సుభానికి సముచిత సత్కారం

భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి:
రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనలో రాజ్యాంగ స్ఫూర్తి లేదు. సమసమాజ స్థాపన భావన కనిపించడంలేదు. ప్రభుత్వం ప్రజల హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోంది. వాక్ స్వాతంత్ర్యం అనేది రాష్ట్రంలో ఎవరికీ లేకుండా పోయింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పితే జైలుకు పంపుతున్నారు. అవినీతిని ప్రశ్నిస్తే భయపెట్టి నిర్భందాలు, వేధింపులకు గురిచేస్తున్నారు.

ప్రజా సేవ భావన వైకాపా పాలనలో కనిపించడంలేదు. ప్రజల సంక్షేమానికి, అభివ్రుద్ధికి తిలోదకాలిచ్చారు. అస్మదీయుల అభివ్రుద్ధి, వారికి న్యాయమే ప్రాధాన్యంగా ఉంటోంది. పద్మ అవార్డు గ్రహీతలకు పురందేశ్వరి అభినందనలు. వెంకయ్యనాయుడు, చిరంజీవి, ఉమామహేశ్వరిలకు శుభాకాంక్షలు. దేశసేవకు ప్రజలంతా పునరంకితం కావాల్సిన తరుణమిది. స్వాతంత్ర్యం కోసం బలిదానం చేసిన వారిని స్మరించుకోవాలి. రాజ్యాంగ స్ఫూర్తిని ద్రుష్టిలో ఉంచుకోవాలి. ఆది నుంచి భాజపా రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవిస్తోంది.

అంత్యోదయ మూల సిద్ధాంతంగా ముందుకు వెళ్తోంది. సబ్ కా సాత్, సబ్ కా విశ్వాస్ అనేది నినాదమే కాదు భాజపా విశ్వాసం. ప్రధాని నరేంద్రమోదీ అంత్యోదయ స్ఫూర్తిగా అడుగులు వేస్తున్నారు. భాజపా చేపడుతోన్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను ప్రజలు గమనిస్తున్నారు. సమాజంలో అందరికీ న్యాయం చేయాలనే భావన భాజపాది.

భాజపా జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్
రాజ్యాంగంలోని సమన్యాయం, స్వేచ్ఛ, సమానత్వం రాష్ట్రంలో కొరవడ్డాయి. సమాఖ్య వ్యవస్థలో కొన్ని రాష్ట్రా ల వ్యవహారాలు దేశాభివృద్ధికి విఘాతం. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోంది. ప్రజలను గాలికొదిలేశారు. వికసిత భారత్, ప్రజాస్వామ్యానికి దేశం గత పదేళ్లలో ఆర్ధికంగా, రక్షణపరంగా బలపడింది. మన దేశం వసుదైక కుటుంబం అనే భావనను ప్రధాని ప్రపంచానికి చాటారు భారత్ మాత్రుక నినాదం ముందుకు తీసుకెళ్లాలి.

ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీ రాం, మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, బిజెపి రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ మీడియా ఇంఛార్జి పాతూరి నాగభూషణం,సుబ్బయ్య, బబ్బూరి శ్రీ రాం, భోగవల్లి శ్రీ ధర్, బొమ్మ దేవర రత్న కుమారి

Leave a Reply