Home » యువత భవిష్యత్‌ మారుస్తాం

యువత భవిష్యత్‌ మారుస్తాం

-నెలరోజులు ఓపిక పట్టండి
-ఏలూరు యువగళంలో యువత ప్రశ్నలకు నారా లోకేష్‌ సమాధానాలు

నేడు రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు లేవు, పరిశ్రమలు లేవు. లక్షలు ఖర్చుపెట్టి పిల్లలను చదివిస్తు న్నారు. పాదయాత్రలో వారి ఆవేదన నాకు అర్థమైంది. అందుకే చంద్రబాబు గారు ఒక్కో జిల్లాకు ఒక్కో ప్రాధాన్యం ఇచ్చి అభివృద్ధి వికేంద్రీకరణ చేశారు. పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారు. టీడీపీ హయాంలో 6 లక్షల ఉద్యోగాలు కల్పించారు. నెలరోజులు ఓపిక పట్టండి వచ్చే ప్రభుత్వంలో పెద్దఎత్తున పరిశ్రమలు తీసుకువచ్చి ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పిస్తాం. యువత భవిష్యత్‌ మారుస్తాం.

జర్నలిస్ట్‌ గోపి: ఎన్నికలు ఇక వారం మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు కూడా మీరు కేసులు పెట్టించుకోవాలా?
నారా లోకేష్‌: ఈ ప్రభుత్వంలో ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. నాపై 23 కేసులు పెట్టారు. ఇప్పుడు అఫిడవిట్‌ రివైజ్‌ చేయాలి. నాపై 24వ కేసు వచ్చింది. ఎస్సీ, ఎస్టీ, హత్యాయత్నం కేసులు పెట్టారు. 2019కి ముందు నేను ఏనాడూ స్టేషన్‌కు వెళ్లలేదు. ఇప్పుడు 6,7 సార్లు స్టేషన్‌కు వెళ్లా. స్టేషన్‌ మా అత్తగారిల్లులా మారింది. భయపడటం లేదు. మేం ఏనాడూ తప్పుచేయలేదు. నిప్పులా బతికాం. అందుకే జగన్‌ రెడ్డిలా మేం పరదాలు కట్టుకుని తిరగడం లేదు. ఏలూరులో ఆ చెట్లే పాపం చేశాయి. చెట్లను నరికారు. మేం తప్పు చేయలేదు కనుకనే ధైర్యంగా ముందుకు వెళుతున్నాం.

జర్నలిస్ట్‌ గోపి: అలాంటి పరిస్థితులను మనం టీడీపీలో చూడవచ్చా?
నారా లోకేష్‌- టీడీపీ యూనివర్సిటీ లాంటిది. బాలయోగి, ప్రతిభాభారతి, ఎర్రన్నాయుడు వంటి వారిని రాజకీయంగా ప్రోత్సహించింది. అన్న ఎన్టీఆర్‌ డాక్టర్లు, ఇంజనీర్లు, మీడియా మిత్రులకు రాజకీయంగా అవకాశం కల్పించారు. అన్న ఎన్టీఆర్‌ స్ఫూర్తితో చంద్రబాబు గారు కూడా డాక్టర్లు, మీడియా మిత్రులకు అవకాశం కల్పించారు. తెలుగువారు ఎక్కడున్నా నెం.1గా ఉండాలనే మా లక్ష్యం. కులం, మతం మాకు తెలియదు. తెలంగాణ నుంచి ముఖ్యమంత్రులు అయిన ఇద్దరు టీడీపీ యూనివర్సిటీ నుంచే వచ్చారు. అదీ తెలుగుదేశం గొప్పదనం.

జర్నలిస్ట్‌ గోపి: దళితుల గురించి ఇలాంటివి వినాల్సి వచ్చింది. మీ ప్రభుత్వంలో ఇలాంటి వినపడవు అని హామీ ఇస్తారా?
నారా లోకేష్‌: చంద్రబాబు హయాంలో దళితులపై ఏనాడు దాడులు జరగలేదు. అత్యాచారాలు జరగలేదు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు గంజాయి మత్తులో తన దళిత డ్రైవర్‌ను కిరాతకంగా చంపి డోర్‌ డెలివరీ చేశారు. అలాంటి వ్యక్తిని జగన్‌ రెడ్డి తన పక్కనే పెట్టుకుంటారు. కల్తీ మద్యంపై వీడియో పెట్టిన ఓం ప్రతాప్‌ ను పాపాల పెద్దిరెడ్డి రాత్రికి రాత్రే అతడిని చంపారు. ముఖ్యమంత్రి చుట్టూ ఉన్నవారే దాడులు చేస్తే ఇక రేపు మనకు భవిష్యత్‌ ఎలా ఉంటుంది? దళిత సోదరులకు చంద్రబాబు 27 సంక్షేమ పథకాలు తీసుకు వచ్చారు. బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌, పీజీ ఫీజు రీయింబర్స్‌ మెంట్‌, విదేశీ విద్య తీసుకువచ్చిన వ్యక్తి చంద్రబా బు. అదీ దళితుల అభ్యున్నతి పట్ల మా చిత్తశుద్ధి.

శేషవర్ధన్‌ నాయుడు: ఈ ముఖ్యమంత్రి 420 ముఖ్యమంత్రి, దగా ముఖ్యమంత్రి, ఖైదీ నెం.6093. యువకులకు అన్యాయం చేశారు. దీనిపై 5 గంటలు చర్చించినా చాలదు. నేను బెంగుళూరులో జాబ్‌ చేస్తాను. మీ రాజధాని ఏంటి అని అడిగారు. ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ తీసుకువచ్చారు. నా స్నేహితుడికి ఉన్న అరెకరం భూమి పోతే వారి పరిస్థితి ఏమిటి? మా భూములు సేఫా, కాదా?
నారా లోకేష్‌: పొరపాటున ఇంకో అవకాశం ఇస్తే జగన్‌ రెడ్డి మీ భూములు లాక్కుంటారు. మీ బిడ్డను కదా అని మీ భూములు కబ్జా చేస్తారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేసే రెండో సంతకం ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ రద్దుపై చేస్తారు. పాతవిధానం తీసుకువస్తాం. పట్టాలపై జగన్‌ రెడ్డి ఫొటో ఉండదు. గతంలో ఏ విధంగా భూహక్కులు కల్పించామో ఆ విధానం తీసుకువస్తాం. మనది ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని అమరావతి.

యువకుడు: నా ఒక్క ఓటు వేయకపోతే వచ్చే నష్టం, లాభం ఏమిటి? ఫీజు రీయింబర్స్‌మెంట్‌ గతంలో డైరెక్ట్‌ గా కాలేజీలకు ఇచ్చేవారు. జగన్‌ రెడ్డి వచ్చిన తర్వాత బకాయిలు పెట్టారు. దీనికి పరిష్కారం చూపాలి?
నారా లోకేష్‌: ఒక్క అవకాశం పేరుతో మనం నష్టపోయాం. రాజధాని లేకుండా పోయింది. పోలవరం నాశనం అయింది. పెట్టుబడులు రాలేదు, పరిశ్రమలు రాలేదు. ఉద్యోగం, ఉపాధి లేదు. ప్రతి ఓటు ముఖ్య మే. గతంలో 10 ఓట్ల తేడాతో ఎంపీలు గెలిచిన వారు, ఓడిపోయిన వారు ఉన్నారు. మంగళగిరి నియోజ కవర్గంలో 2014లో 12 ఓట్ల తేడాతో టీడీపీ ఓడిపోయింది. ప్రతి ఓటు ముఖ్యం. దానిని సద్వినియోగం చేసుకోవాలి. జగన్‌ రెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బటన్‌ నొక్కుతున్నా డబ్బులు పడటం లేదు. హాల్‌ టికెట్లు, సర్టిఫికెట్లు కావాలంటే విద్యార్థులను డబ్బులు చెల్లించమంటున్నారు. మేం వచ్చిన తర్వాత పాత ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విధానం అమలు చేస్తాం. యువగళం పాదయాత్రలో ఓ వ్యక్తి తన బాబుకు ఫీజు రీయిం బర్స్‌ మెంట్‌ రాలేదని చెప్పారు. ఇప్పుడే అప్పు చేసి లక్షా 80 వేలు ఫీజు కట్టి సర్టిఫికెట్‌ తీసుకెళ్తున్నానని చెప్పారు. ఇలా ఎన్నో వేలమంది ఉన్నారు. వచ్చే ప్రభుత్వంలో పాత విధానం అమలుచేస్తాం. నిన్న కడప ఎయిర్‌ పోర్టులో ఫ్లైట్‌ ఎక్కుతుంటే అక్కడున్న సిబ్బంది కూడా వారి పిల్లలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పడలేద ని చెప్పారు. మన ప్రభుత్వంలో వన్‌టైం సెటిల్‌మెంట్‌ చేసి సర్టిఫికెట్లు అందేలా చేస్తాం.

తంగిరాల అక్షయశ్రీ: మీరు, చంద్రబాబు గారు ఎప్పుడు మాట్లాడినా రాయలసీమ, అమరావతిని అభివృద్ధి చేస్తామని చెబుతారు. మా గోదావరి జిల్లాలకు మీరు ఏం చేస్తారు?
నారా లోకేష్‌: టీడీపీ హయాంలో గోదావరి జిల్లాల్లో ఆక్వా రంగాన్ని ప్రోత్సహించాం. ఎగుమతుల్లో నెం.1గా నిలిపాం. పామాయిల్‌ రైతులను పెద్దఎత్తున ప్రోత్సహించాం. వరికి మద్దతు ధర కల్పించాం. కాకినాడలో ఐటీ పరిశ్రమలు తీసుకువచ్చాం. డిఫెన్స్‌, ఫార్మాలో ఎక్కువ అవకాశాలు ఉన్నాయని భావించి ఒప్పందాలు చేసుకున్నాం. జగన్‌ వచ్చిన తర్వాత పరిశ్రమలను వెనక్కి పంపారు. నెల రోజులు ఓపికపట్టండి. మొదటగా మేజర్‌ రహదారులన్నీ సిమెంట్‌ రహదారులుగా చేస్తాం. గతంలో మాదిరిగా పరిశ్రమలు తీసుకువస్తాం, ఆక్వా రంగాన్ని ప్రోత్సహిస్తాం.

చాందిని: మన విద్యారంగంలో ఏమేం మార్పులు తీసుకువస్తారు? ఉద్యోగాల భర్తీ ఏవిధంగా చేస్తారు?
నారా లోకేష్‌: కేజీ నుంచి పీజీ వరకు కరిక్యులమ్‌ను రీవ్యాంప్‌ చేస్తాం. జగన్‌ రెడ్డి పాలనలో మహిళలపై దాడులు పెరిగాయి. మహిళలను గౌరవించేలా ప్రక్షాళన చేస్తాం. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులను నియమిస్తాం. పాఠశాలల రేషనలైజేషన్‌ పేరుతో జగన్‌ రెడ్డి తీసుకువచ్చిన 117 జీవోను రద్దు చేస్తాం. బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌, విదేశీ విద్య, స్కూల్‌ ఫీజు రీయింబర్స్‌ మెంట్‌, పీజీ రీయింబర్స్‌మెంట్‌ పథకాలు తిరిగి అమలుచేస్తాం. టీడీపీ హయాంలో 11 డీఎస్సీల ద్వారా 1,70,000 పోస్టులు భర్తీ చేశాం. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే తొలి సంతకం మెగా డీఎస్సీపైనే. సింగిల్‌ నోటిఫికేషన్‌ ద్వారా ప్యూన్‌ నుంచి గ్రూప్స్‌ వరకు పోస్టులు భర్తీచేస్తాం. యూనిఫైడ్‌ జాబ్‌ కేలండర్‌ తీసుకువచ్చి ఐదేళ్లలో ఉద్యోగాలు భర్తీ చేస్తాం.

యువతి: యువత ఇక్కడ ఐటీ ఉద్యోగాలు లేక హైదరాబాద్‌ వెళుతున్నారు. ఐటీతో పాటు ఇతర రంగాల ఉద్యోగాలపై కూడా అవగాహన కల్పిస్తారా? మా నాన్న గారికి 98 డీఎస్సీ ద్వారా 25 ఏళ్లకు ఉద్యోగం వచ్చింది. వారిని పర్మినెంట్‌ చేస్తామని ఎక్కడా చెప్పలేదు?
నారా లోకేష్‌: జగన్‌ రెడ్డి ఔట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగాలు క్రమబద్ధీకరణ చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పారు. మేం వచ్చిన తర్వాత పరిశీలించి చర్యలు తీసుకుంటాం. హైదరాబాద్‌లో చంద్రబాబునాయుడు సైబర్‌ టవర్స్‌ నిర్మించి ఐటీని ప్రోత్సహించారు. నేడు 15 లక్షల మంది పనిచేస్తున్నారు. విశాఖలో డేటా సెంటర్‌ కోసం అదానీతో ఒప్పందం చేసుకున్నాం. భూములు కూడా కేటాయించాం. జగన్‌ రెడ్డి వచ్చిన తర్వాత వారు వెళ్లిపోయారు. ఐటీ శాఖ మంత్రి పరిశ్రమలపై ప్రశ్నిస్తే కోడిముందా, గుడ్డుముందా అని మాట్లాడతారు. విశాఖలో ఐటీ పరిశ్రమలు తీసుకువస్తాం. ఆనాడు క్యాండుయెంట్‌, ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ లాంటి పరిశ్రమలు తీసుకువచ్చాం. నేడు వైకాపా చేతగానితనం వల్ల పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయాయి. వంద రోజుల్లో ఈ పరిశ్రమలన్నీ ఆంధ్ర రాష్ట్రానికి వస్తాయి. చంద్రబాబు గ్యారంటే బ్రాండ్‌. జగన్‌ రెడ్డి అంటే జైలు. చంద్రబాబునాయుడును చూస్తే కియా, సెల్‌ఫోన్‌ తయారుచేసే కంపెనీలు గుర్తుకువస్తాయి. జగన్‌ను చూస్తే బూమ్‌ బూమ్‌, ప్రెసిడెంట్‌ మెడల్‌, ఆంధ్రా గోల్డ్‌, 9 గుర్రాలు, గంజాయి గుర్తుకువస్తాయి. మేం పెట్టుబడులు తీసుకువచ్చి ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తాం.

రాంప్రసాద్‌: ఏలూరు కాలువల్లో మా చిన్నప్పుడు నీళ్లు చూశాం. మీ ప్రభుత్వంలో చూడొచ్చా?
నారా లోకేష్‌: పెండిరగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసి నీరు అందిస్తాం. అందుకే పట్టిసీమ, చింతలపూడి లిఫ్ట్‌ ఇరిగేషన్‌. పోలవరం పనులు మనం 72 శాతం పూర్తిచేస్తే జగన్‌ రివర్స్‌ గేర్‌ వేశారు. నేడు ఆ ప్రాజెక్టే ప్రమాదంలో పడిరది.

దుర్గాప్రసాద్‌: నేను డీఎస్సీ ఆస్పిరెంట్‌ను. మీరు డీఎస్సీ ఖాళీలు భర్తీచేస్తారని నాకు నమ్మకం ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు సరైన పౌష్టికాహారం అందివ్వడం లేదు. మీరు వచ్చిన తర్వాత పరిస్థితిలో మార్పు తీసుకువస్తారా? ఏలూరులోని గవర్నమెంట్‌ డిగ్రీ కాలేజీకి ఇప్పటికీ భవనాలు లేవు, కనీసం మరుగుదొడ్లు కూడా లేవు. ఈ సమస్యలకు మీరు పరిష్కారం చూపిస్తారా?
నారా లోకేష్‌: చంద్రబాబు తొలి సంతకం మెగా డీఎస్సీపైనే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెస్‌ చార్జీలు, కాస్మోటిక్‌ చార్జీలు పెంచలేదు. కానీ ఖైదీలకు రావాల్సిన డబ్బులు మాత్రం పెంచారు. ఖైదీలకు ఇచ్చే గౌరవం విద్యార్థులకు ఇవ్వడం లేదు. మేం వచ్చిన తర్వాత మెస్‌ చార్జీలు పెంచుతాం. ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి మొదటి మూడేళ్లలో శాశ్వత భవనాలు నిర్మిస్తాం.

మౌన్విత: నేను డెంటల్‌ డాక్టర్‌ను. ఐదేళ్లు కష్టపడి పనిచేయాలి. ప్రభుత్వ ఉద్యోగాల్లో మాకు ఇచ్చేవి రెండు. అవి కూడా అందడం లేదు. మా వరకు అందడం లేదు. మీరు వచ్చిన తర్వాత ఏం చేస్తారు? జగన్‌ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్‌ అయింది. మీ ఉద్దేశంలో ఈ ప్రభుత్వం పాస్‌ అయిందా, ఫెయిల్‌ అయిందా?
నారా లోకేష్‌: జగన్‌ రెడ్డి స్కూల్‌ ల్లోనే ఫెయిల్‌, కాలేజీలో ఫెయిల్‌, ప్రతిపక్ష నాయకుడిగా ఫెయిల్‌, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఫెయిల్యూర్‌. ప్రజలు అడుగడుగునా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అన్ని ధరలు పెరిగా యి. రైతు ఆత్మహత్యలు పెరిగాయి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేవు. బడుగు, బలహీన వర్గాలపై దాడులు పెరిగాయి. కార్పొరేషన్లకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వరు. ఈ ప్రభుత్వం నూటికి నూరు శాతం ఫెయిల్యూర్‌ ప్రభుత్వం. డెంటల్‌ పోస్టుల భర్తీపై పరిశీలించి చర్యలు తీసుకుంటాం.

యువతి: మా అమ్మగారు అంగన్‌వాడీ ఆయమ్మగా 19 ఏళ్లుగా పనిచేస్తున్నారు. వారికి ఎలాంటి ప్రమోషన్లు ఇవ్వడం లేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మా అమ్మగారి లాంటి వారికి న్యాయం చేయాలి. గతంలో బడేటి బుజ్జిగారిది చాలా మంచి మనసు. ఇప్పుడున్న ఎమ్మెల్యే ఇష్టానుసారంగా చేస్తున్నారు. మరోవైపు ఏలూరులో కార్పోరేటర్ల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. కార్పోరేటర్‌ బుజ్జివరపు రమేష్‌ 30 నుంచి 40 ఇళ్లు కబ్జా చేశారు. మాకు వచ్చిన ఇల్లు కూడా కబ్జా చేశారు?
నారా లోకేష్‌- అందుకే ఎర్రబుక్‌ తీసుకువచ్చాం. చట్టాన్ని ఉల్లంఘించి ప్రజలను ఇబ్బందులు పెట్టిన నాయకులు, అధికారులపై న్యాయవిచారణ చేయించి కఠిన చర్యలు తీసుకుంటాం. చంద్రబాబు గారి హయాంలో అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించడం జరిగింది. జీతాలు రెండుసార్లు పెంచారు. జగన్‌ రెడ్డి హయాంలో జీతాలు పెంచలేదు. ధర్నాలు చేస్తే కేసులు పెట్టారు..లాఠీచార్జీ చేశారు. కొంతమంది టీచర్లను జైలుకు కూడా పంపారు. వచ్చేది ప్రజా ప్రభుత్వమే. అంగన్‌వాడీలకు న్యాయం చేస్తాం.

యువతి: 20 డివిజన్‌ కార్పోరేటర్‌ మాకు 25 ఏళ్లుగా జీవనాధారమైన బుక్‌ షాప్‌ విషయంలో అన్యాయం చేశారు. మీరు ఆదుకోవాలి?
నారా లోకేష్‌: చంద్రబాబును చూస్తే రౌడీలు, బ్లేడీ బ్యాచ్‌, గంజాయి స్మగ్లర్లు భయపడతారు వణుకుతారు. చంద్రబాబునాయుడు గారి కూటమికి మెజార్టీ వచ్చిందని ఎప్పుడైతే ఫ్లాష్‌ న్యూస్‌ వస్తుందో ఇలాంటి రౌడీలు, బ్లేడ్‌ బ్యాచ్‌లు రాష్ట్రాన్ని వదిలి పారిపోతారు. కానీ ఎక్కడకు పోయినా వదిలిపెట్టం. వడ్డీతో సహా కక్కిస్తాం.

జర్నలిస్ట్‌ గోపి: మమ్మల్ని గెలిపించడం మాత్రమే కాదు.. 160 సీట్లలో గెలిపిస్తేనే పరిశ్రమలు రావడానికి భరోసా ఉంటుందని చెబుతున్నారు. ఈ స్థాయిలో గెలిపించాలని చెప్పడం వెనుక మీ ఉద్దేశం ఏమిటి?
నారా లోకేష్‌: గత ఐదేళ్లుగా చాలా మంది నష్టపోయారు. పెట్టుబడులు పెట్టిన వారిపై కేసులు పెట్టి వేధించారు. అమర్‌ రాజా బ్యాటరీ యజమాని గల్లా జయదేవ్‌ టీడీపీ ఎంపీ అని వేధించారు. దీంతో తెలం గాణలో వారి ప్లాంట్‌ను విస్తరించారు. పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులు పెట్టాలంటే భరోసా కావాలి. 160 స్థానాల్లో కూటమి గెలవాలి. జీవితంలో జగన్‌ రెడ్డి ఇక ముఖ్యమంత్రి కాడు అని నమ్మకం కలిగితేనే పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారు. అప్పుడే యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

యామిని వర్మ: క్యాస్ట్‌ ఈ క్వాలిటీ గురించి మాట్లాడుతున్నా. మేం ఎంతకష్టపడినా మాకు ర్యాంకులు రావడం లేదు. ఉద్యోగాల కోసం పరిశ్రమలు ఎక్కువగా తీసుకువస్తారా?
నారా లోకేష్‌: కియా, ఫాక్స్‌ కాన్‌, జోహో, హెచ్‌ సీఎల్‌ వచ్చింది టీడీపీ హయాంలోనే. 39 వేల పరిశ్రమలు తీసుకువచ్చి 6 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాం. మళ్లీ పరిశ్రమలు తీసుకువచ్చి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తాం. కేంద్రం ఓసీల్లో నిరుపేదలకు 10 శాతం రిజర్వేషన్‌ తీసుకువచ్చింది. బడుగు, బలహీన వర్గాలతో పాటు, నిరుపేద ఓసీలకు ఉద్యోగాలు, చదువుల్లో అవకాశాలు కల్పించే బాధ్యత టీడీపీ తీసుకుంది.

సూర్య: నేను జావా లాంటి అనేక కోర్సులు చేశాను. కానీ యాప్‌ డెవలప్‌ చేయాలంటే ఖర్చు అవుతుంది. ఈ ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సహకాలు అందించడం లేదు. మీరు ప్రోత్సహిస్తారా?
నారా లోకేష్‌: మీలాంటి యువకులను ప్రోత్సహించేందుకు ఆనాడు విశాఖలో స్టార్టప్‌ విలేజే ఏర్పాటుచేశాం. అనేక స్టార్టప్‌లు వచ్చాయి. జగన్‌ రెడ్డి పాలనలో స్టార్టప్‌లు ఇబ్బందుల్లో పడ్డాయి. అంత్రోపెన్యూర్‌ అంటే జగన్‌ రెడ్డికి అవగాహన లేదు. నెలరోజులు ఓపిక పట్టండి. స్టార్టప్‌ విలేజ్‌ ద్వారా యువతను ప్రోత్సహిస్తాం.

నీహా: రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకువచ్చేందుకు మీరు ఏం గ్యారంటీ ఇస్తారు? ముస్లిం మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్‌ విషయంలో, బాలికల విద్య విషయంలో ఎలాంటి గ్యారంటీ ఇస్తారు?
నారా లోకేష్‌: మన రాష్ట్రంలోనే ఉద్యోగాలు కల్పిస్తాం. అందుకే బాబు ష్యూరిటీ-భవిష్యత్‌కు గ్యారంటీ అని చెప్పాం. గతంలో హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబు గారిది. నెలరోజుల్లో మన ప్రభుత్వం వస్తుంది. చంద్రబాబు గారు ముస్లీం మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్‌ను కాపాడతామని హామీ ఇచ్చారు. అవసరమైతే సుప్రీంకోర్టులో బెస్ట్‌ లాయర్స్‌ను పెడతామని చెప్పారు. విద్యకు సంబంధించి బెస్ట్‌ అవలైబుల్‌ స్కూల్స్‌, పీజీ, స్కూల్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌, విదేశీ విద్య లాంటి పథకాలు తిరిగి ప్రారంభిస్తాం.

ఎం.ఎస్‌.కె.నాయుడు: నేను కాపు సామాజిక వర్గానికి చెందిన వాడిని. టీడీపీ హయాంలో కాపు కార్పొరేషన్‌ ద్వారా కాపులకు బ్యాంకు రుణాలు అందించారు. నేడు జగన్‌ రెడ్డి మాపై కక్షసాధింపుగా కాపు కులస్థులను ఆదుకోవడం లేదు. మన ప్రభుత్వం రాగానే ఏం చేస్తారు?
నారా లోకేష్‌: చంద్రబాబు గారు కాపుల కోసం కార్పొరేషన్‌ ఏర్పాటుచేసి దామాషా ప్రకారం ఉపకులాల వారీగా నిధులు కేటాయించారు. నిరుపేదలను పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చేందుకు కృషిచేశారు. బీసీ, ఎస్సీ, బ్రాహ్మణ కార్పొరేషన్‌ ద్వారా కూడా నిధులు మంజూరు చేసి ఆదుకున్నాం. వచ్చే ప్రభుత్వంలో దామాషా ప్రకారం కార్పొరేషన్‌కు నిధులు కేటాయిస్తాం. పేదరికానికి కులం, మతం ఉండదు. శాశ్వతంగా పేదరికాన్ని నిర్మూలిస్తాం. రుణాలు, సబ్సిడీలు ఇచ్చి ఆదుకుంటాం.

జర్నలిస్ట్‌ గోపి: ఏ యువత ప్రశ్నించినా ఉద్యోగాల గురించే మాట్లాడుతున్నారు. దీనిపై మీరు ఏం సమాధానం చెబుతారు?
నారా లోకేష్‌: నేడు యువతకు ఉద్యోగాలు లేవు, పరిశ్రమలు లేవు. లక్షలు ఖర్చుపెట్టి పిల్లలను చదివిస్తు న్నారు. పాదయాత్రలో వారి ఆవేదన నాకు అర్థమైంది. అందుకే చంద్రబాబు గారు ఒక్కో జిల్లాకు ఒక్కో ప్రాధాన్యం ఇచ్చి అభివృద్ధి వికేంద్రీకరణ చేశారు. పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారు. టీడీపీ హయాంలో 6 లక్షల ఉద్యోగాలు కల్పించారని ఈ ప్రభుత్వమే ఒప్పుకుంది. వచ్చే ప్రభుత్వంలో పెద్దఎత్తున పరిశ్రమలు తీసుకువచ్చి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. ఇందుకోసం సైకిల్‌ గుర్తుకు ఓటేసి గెలిపించాలి.

నవ్య: జగన్‌ రెడ్డి తీసుకువచ్చిన దిశా చట్టం అసలు ఉందా? రోజూ అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. దీనిని ఎలా అరికడతారు? ఏలూరుకు ఎలాంటి పరిశ్రమలు తీసుకువస్తారు?
నారా లోకేష్‌- గంజాయి వల్ల అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అసలు దిశా చట్టమే లేదు. పోలీస్‌ స్టేషన్‌ మాత్రం ఉంది. నిర్భయ చట్టం ద్వారా నిందితులను కఠినంగా శిక్షిస్తే భయపడేవారు. ఇప్పుడు రౌడీలు, బ్లేడ్‌ బ్యాచ్‌ లు రెచ్చిపోతున్నారు. మేం ఎవరినీ వదిలిపెట్టం. వంద రోజుల్లో గంజాయికి ఫుల్‌ స్టాప్‌ పెడతాం. ఏలూరులో డిఫెన్స్‌ సెక్టార్‌ను ప్రోత్సహిస్తే జగన్‌ రెడ్డి పట్టించుకోలేదు. మేం వచ్చిన తర్వాత ఆగిపోయిన పనులు ప్రారంభిస్తాం.

బాలు: 2019లో మద్యపాన నిషేధం చేస్తానని ఓ పెద్దమనిషి హామీ ఇచ్చారు. మద్యపాన నిషేధం సంగతి తర్వాత చీప్‌ లిక్కర్లన్నీ ఇక్కడే ఉన్నాయి. దీనివల్ల మా తండ్రి మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోవడం లేదు. దీనిపై మీరేం చేస్తారు?
నారా లోకేష్‌: మద్యాన్ని నియంత్రిస్తాం. పాత మద్యం విధానం అమలుచేస్తాం. బెల్ట్‌ షాపులకు ఫుల్‌ స్టాప్‌ పెడతాం. మొదటి వందరోజుల్లో ఇవన్నీ చేస్తాం.

Leave a Reply