దారికి అడ్డు రానంత వరకే వాళ్ళకు ఎవడైనా హీరో. . వస్తే జీరో!

– బాబాయ్ దేవుడు.. చంపింది చంద్రబాబు అన్నారు.. తరువాత బాబాయ్ స్త్రీ లోలుడు అన్నారు
– వ్యక్తిత్వ హననాలకి పాల్పడే మనుషులు ఎవరు ?
– ఈ సారైనా ఆలోచిద్దామా?

చంద్రబాబుని కమ్మవాళ్ళని తిడుతుంటే.. కాపులు పవన్ కళ్యాణ్ అభిమానులు , మనల్ని కాదుగా అనుకున్నారు. పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి వాళ్ళు మాట్లాడుంటే.. వేరే హీరో అభిమానులు నవ్వుకున్నారు.

వాళ్లనే కాదు.. రేపు మహేష్ బాబు రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పెడితే.. కృష్ణ మొదటి భార్య, విజయనిర్మల విషయాలు రాస్తారు. ప్రభాస్ వచ్చి పార్టీ పెడితే.. పెళ్లి చేస్కోట్లేదు,… తాగుబోతు తిరుగుబోతువి అంటారు. పలానా వాళ్ళతోనే అంటగదా తిరిగింది అంటే దాని గురించి మాట్లాడకుండా ఇంకో విషయం లేవనేత్తుతారు.

రాం చరణ్,అల్లు అర్జున్ వచ్చినా ప్రజారాజ్యం నాటి విషయాలు బయటకి తీస్తారు.. ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ విడిగా పార్టీ పెట్టినా.. అతను హరికృష్ణ అక్రమ సంతానం అని వాళ్ళ అమ్మని అంటారు. ఇక్కడ ఎవరైనా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే.. వాళ్ళ దారికి అడ్డు రానంత వరకే వాళ్ళకు ఎవడైనా హీరో. వస్తే జీరో చేయడానికి ఎంతకైనా దిగజారతారు.. వేటు వేసే కత్తికి కోడి పీకైనా….. మనిషి మెడైనా పెద్ద ఫరక్ పడదు. అందుకే ఆలోచించి ఓటు వేయండి..

ఒకరిని తిట్టడానికి మరొకరి మీద ఉన్న ద్వేషం ఎప్పుడు కారణం కాకూడదు.. అయ్య కాలం నుండి ఇలా.. ఒకరి మీద ద్వేషం పెంచి చేస్తున్న రాజకీయాల వల్ల , దీర్ఘకాలిక నష్టం కనబడే రోజు వస్తోంది. ఇలాంటి వ్యక్తిత్వ హననాలకి పాల్పడే మనుషులు ఎవరు ? బాబాయ్ దగ్గరికి వచ్చేసరికి ..మొన్నటిదాకా బాబాయ్ దేవుడు. చంపింది చంద్రబాబు అన్నారు. తరువాత బాబాయ్ స్త్రీ లోలుడు అన్నారు.
ఈ సారైనా ఆలోచిద్దామా?

– ఎం.ఎం

Leave a Reply