Suryaa.co.in

Andhra Pradesh

కేంద్ర నిధులతోనే ఏపీ అభివృద్ధి

– వైసీపీ పాలనలో తిరోగమనం
– రాజ్యసభలో దునుమాడిన బీజేపీ ఎంపీ జీవీఎల్

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వ విధానాలను జీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు దుయ్యబట్టారు. రాజ్యసభలో మాట్లాడిన జీవీఎల్.. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న అభివృద్ధి మొత్తం కేంద్రనిధులతోనే తప్ప, జగన్ ప్రభుత్వం నయాపైసా ఇవ్వడం లేదని విరుచుకుపడ్డారు.కేంద్ర బడ్జెట్‌పై ఎంపీ జీవీఎల్ నరసింహారావు చేసిన ప్రసంగంలోని ప్రధాన అంశాలు..

2014-15లో ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన నిధుల కంటే ఇప్పుడు మూడు రెట్లు అధికంగా ఆంధ్రప్రదేశ్‌కు నిధులు ఇచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. 2020-21లో, ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం రూ.Rs.77,538 కోట్లకు పైగా విడుదల చేయగా, కేంద్ర ప్రభుత్వం పన్నుల రూపంలో ఆంధ్రప్రదేశ్‌ నుండి షుమారు రూ.55,000 కోట్లు ఆదాయం పొందింది.

ఆంధ్రప్రదేశ్‌పై ప్రత్యేక ఆసక్తి కారణంగా, మన ప్రభుత్వం PMAY కింద అత్యధిక కేటాయింపులు మరియు NREGS మరియు అనేక ఇతర పథకాలలో దేశంలో రెండవ అత్యధిక కేటాయింపులు చేసింది.

వైసీపీ ప్రభుత్వం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర ప్రభుత్వం నుంచి మనం చేసిన అభివృద్ధి ఒక్కటే జరుగుతోంది.

మన కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారులను 4,193 కి.మీల నుండి 8,183 కి.మీలకు రెండింతలు చేసి రూ. 35,000 కోట్లు ఖర్చు పెట్టింది. రోడ్ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన కేంద్రం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు.

ఆపరేషన్ సక్సెస్ అయితే పేషెంట్ డెడ్ అని వైసీపీ ఈ బడ్జెట్ ను విమర్శించింది.ఫెయిలయ్యింది కేంద్ర బడ్జెట్ కాదని, వైసీపీ చెప్పిన సామెత వారికే ఎక్కువగా వర్తిస్తుందని ఎందుకంటే వారి 2019 ఆపరేషన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని జీవీఎల్ దుయ్యబట్టారు.

LEAVE A RESPONSE