ఓడీ, డబ్ల్యుఎమ్ఏ వాడకంలోకూడా నంబర్ 1 స్థానానికి చేర్చిన అసమర్థ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
• ఎస్ డీఎఫ్, వేజ్ అండ్ మీన్స్, ఓవర్ డ్రాఫ్ట్ ల కింద 29 రాష్ట్రాలు కలిపి రూ.97వేలకోట్లు వాడితే, ఒక్క ఏపీనే రూ.32,217కోట్లు వాడుకుంది
• 22రాష్ట్రాలు ఆర్బీఐ నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరం నవంబర్ వరకు నయాపైసా ఓడీ తీసుకోకుండా పాలనచేస్తే, ఈ ముఖ్యమంత్రి ఒక్కడే రూ.32వేలకోట్లు ఓడీకిందలాగేశాడు
• జగన్మోహన్ రెడ్డి వాడకంతో ఏపీ ఆర్థికంగా బతికిబట్టకట్టలేని స్థితికి వచ్చేసింది.
• ఇదేనా ఏ2 విజయసాయిరెడ్డి పార్లమెంట్ లో చెప్పిన రాష్ట్రం యొక్క గొప్ప ఆర్థిక క్రమశిక్షణ?
– టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణ దేశంలోనే అత్యంత అధ్వాన్నంగా ఉందని చెప్పడంలో ఎలాంటిసందేహం లేదని, దేశంలో ది వరస్ట్ ఫైనాన్షియల్ సిచ్యుయేషన్ ఏరాష్ట్రానిది అంటే అన్నివేళ్లు మనరాష్ట్రం వైపే చూపిస్తాయని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ స్పష్టంచేశారు. గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయం లో విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
కేంద్ర ప్రభుత్వ నివేదికలు కానివ్వండి, ప్రతినిత్యం పత్రికల్లో వస్తున్న కథనాలు కానివ్వండి, పార్లమెంట్ లో వినిపిస్తున్న వ్యాఖ్యలుకానివ్వండి అన్నీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లోపించిందనే చెబుతున్నాయి. రాష్ట్రప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ కొరవడటంతో రాష్ట్రం ఆర్థిక ఎమర్జన్సీకి చేరువలో ఉంది. పరిస్థితి ఇంత అధ్వాన్నంగా ఉంటే వైసీపీనేతలు ఇంకా నిస్సిగ్గుగా మాట్లాడుతూనే ఉన్నారు. వైసీపీ పార్లమెంటరీనేత, ఏ2 విజయసాయి రెడ్డి రాజ్యసభలో మాట్లాడుతూ, ఫైనాన్షియల్ డిసిప్లైన్ లో ఏపీ నెంబర్ వన్ గాఉందని కితాబులిచ్చుకున్నారు.
ఆయన మాటలు విన్నాక అంతనిస్సిగ్గుగా పార్లమెంట్ లో పచ్చి అబద్ధాలు చెబుతారా అనిపించింది. ఇంతకు ముందు పిట్టకథలు, బుర్రకథలుచెప్పే ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సంవత్సరకాలంగా ఆయన ఎవరికీ కనిపించడంలేదు, ఆయన గొంతుఎక్కడా వినిపించడంలేదు. రాష్ట్ర ఆర్థికపరిస్థితేమిటో ఆయనకు బాగా తెలుసు. జీతాలుఇవ్వలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని గ్రహించే ఆయన పూర్తిగా ఒక ఇన్విజబుల్ ఫైనాన్షియల్ మినిస్టర్ గా తయారయ్యాడు. గత మూడుసంవత్సరాల్లో 3.50లక్షలకోట్లకు పైబడి జగన్మోహన్ రెడ్డి సర్కారు చేసిన అప్పుల గురించి ఇదివరకే చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం.
ఇప్పుడు తాజాగా రాష్ట్రఆర్థికపరిస్థితిపై కొన్ని అంశాలుప్రస్తావిస్తూ ముఖ్యమంత్రిని, ఆర్థికమంత్రి బుగ్గనను కొన్నిప్రశ్నలు అడగద లిచాను. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బీఐ) వారి నెలవారీ నివేదికలు (మంత్లీబులెటిన్స్) అన్నీ స్టడీ చేస్తున్న సందర్భంలో రాష్ట్రప్రజలంతా నిర్ఘాంతపోయే కొన్ని వాస్తవాలు బయటపడ్డాయి.
ఆర్బీఐ వారు ప్రతినెలా రాష్ట్రాల ఆర్థికపరిస్థితి గురించి ఒక బులెటి న్ విడుదలచేస్తారు. అలా విడుదల చేసిన దానిలో ఆర్బీఐ ద్వారా పొందే స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ (ఎస్ డీఎఫ్) గానీ, వేజ్ అండ్ మీన్స్ గానీ (డబ్ల్యుఎమ్ఏ), ఓవర్ డ్రాఫ్ట్ కు(ఓడీ) సంబంధించిన విషయాలు సదరు బులెటిన్ లో ఉంటాయి. ఏఏ రాష్ట్రం ఎంతెంత డబ్బు ఓవర్ డ్రాఫ్ట్ కింద తీసుకుంటోంది.. ఎస్ డీఎఫ్ కింద ఎంత తీసుకుంటోంది.. వేజ్ అండ్ మీన్స్ అడ్వాన్సుల కింద ఎంత తీసుకుంటుందనే వివరాలు ఆ బులెటిన్ లో స్పష్టంగా ఉంటాయి.
2021-22 ఆర్థిక సంవత్సరం నవంబర్ వరకు విడుదల చేసిన ఆర్బీఐ నివేదికలన్నీవారి వెబ్ సైట్లో ఉన్నాయి. ఎస్ డీఎఫ్, వేజ్ అండ్ మీన్స్ , ఓవర్ డ్రాఫ్ట్ కింద దేశంలో ఏఏ రాష్ట్రం ఎంతెంత డబ్బు వినియోగిం చిందనే వివరాలు సదరు వెబ్ సైట్లో నుంచి సేకరించడం జరిగింది.
సామాన్యప్రజలకు స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ అన్నా, ఓవర్ డ్రాఫ్ట్ అన్నా, వేజ్ అండ్ మీన్స్ అడ్వాన్స్ అన్నాఅర్థంకాదు. సాధారణంగా చెప్పాలంటే మనకు డబ్బులు ఇబ్బంది అయితే తెలిసినవాళ్ల దగ్గర
చేబదులు తీసుకొని తిరిగి ఇస్తుంటాము. అలానే దేశంలోని వివిధరాష్ట్రాలు, వాటియొక్క రోజువారీ ఖర్చులకు ఇబ్బంది అయినప్పుడు ఆర్ బీఐ నుంచి చేబదులు కింద డబ్బులు తీసుకుంటాయి. అది లాంగ్ టర్మ్ అప్పుకాదు.. కొన్నిరోజుల్లోనేతిరిగి చెల్లించాలి.
దాన్నే ఎస్ డీఎఫ్ అని, అది దాటితే వేజ్ అండ్ మీన్స్ అని, ఆ పరిస్థితికూడాదాటితే ఓవర్ డ్రాఫ్ట్ అని చెబుతారు. ఆరకంగా మూడువిధాలుగా ఆర్బీఐ నుంచి ఏ రాష్ట్రమైనా వాటియొక్క తాత్కాలిక అవసరాలకోసం డబ్బు తీసుకోవచ్చు. ఆమూడురకాల మార్గాల్లో ఏఏ రాష్ట్రాలు ఎంత వాడుకున్నాయని పరిశీలిస్తే, దురదృష్టవశాత్తూ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంబర్ వన్ స్థానంలోఉంది. స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ, వేజ్ అండ్ మీన్స్, ఓవర్ డ్రాఫ్ట్ మూడింటికింద కలిపి దేశంలోనే అత్యధికంగా ఏపీ రాష్ట్రం రిజర్వ్ బ్యాంక్ నుంచి ఈ ఆర్థిక సంవత్సరంలో నవంబర్ నెలవరకు ఉన్నవివరాలప్రకారం డబ్బులు వాడుకుంది.
2021 ఏప్రియల్ నుంచి నవంబర్ వరకు మొత్తం 8నెలల కాలంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం రూ.32,217 కోట్లను ఓడీ, వేజ్ అండ్ మీన్స్, ఎస్ డీఎఫ్ కింద ఆర్ బీఐ నుంచి వాడుకుంది. స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ, వేజ్ అండ్ మీన్స్, ఓవర్ డ్రాఫ్ట్ ల కింద దేశంలోని అన్నిరాష్ట్రాలు కలిపి 8నెలల కాలంలో రూ.97,075కోట్లు వాడుకుంటే, దానిలో ఒక్క ఏపీ మాత్రమే రూ.32,217కోట్లు అంటే 33.18శాతం డబ్బు వాడుకుంది.
అంతటి అవసరం ఈ ముఖ్యమంత్రికి ఏమొచ్చిందని ప్రశ్నిస్తున్నాం. ఈ విధంగా ఆర్ బీఐ నుంచి చేబదులు డబ్బు వాడకంలో మనరాష్ట్రమే నంబర్ 1 నిలిచింది. గతంలో జగన్ రెడ్డి సాధించిన అప్పుల్లో నంబర్ వన్ స్థానానికి, ఈ సరికొత్త నంబర్ 1 అదనం.
ఆర్ బీఐ నుంచి వేలకోట్లు చేబదులుగా తీసుకోవడానికి ఏపీకి ఏమైనా ఆదాయం తగ్గిందా అంటే అదీలేదు. డిసెంబర్ 2021 వరకు మనరాష్ట్ర ఆదాయం రూ.97,887కోట్లు, అంటే సుమారుగా రూ.98వేలకోట్లు వచ్చింది. ఆ ఆదాయం సరిపోదన్నట్లు రూ.58,142కోట్లు బడ్జెట్ అంచనాలకు మించి అప్పులు కూడా చేశారు. వెరసిమొత్తం లక్షా 56వేలకోట్ల డబ్బు జగన్ రెడ్డి ప్రభుత్వ ఖజానాకి ఆదాయం , అప్పులరూపంలో వచ్చిచేరింది.
అదిచాలక ఎస్ డీఎఫ్, వేజ్ అండ్ మీన్స్, ఓవర్ డ్రాఫ్ట్ ల కింద రూ.32,217కోట్లు వాడుకున్నారు. ఈ డబ్బంతా ఎటుపోతోందో ఆ భగవంతుడికే తెలియాలి. వచ్చిన ఆదాయం చాలదన్నట్లు రూ.32,217కోట్లు ఆర్ బీఐ నుంచి వివిధరూపాల్లో వాడుకోవడా నికి ఈ రాష్ట్రానికి సిగ్గుందా? ఎస్ డీఎఫ్ కిందగానీ, వేజ్ అండ్ మీన్స్, ఓవర్ డ్రాఫ్ట్ పద్దుల కింద ఆర్ బీఐనుంచి ఒక్కటంటే ఒక్కరూపాయి తీసుకోని రాష్ట్రాలు దేశంలో 11 ఉన్నాయి. ఆ విధంగా నయాపైసా తీసుకోని రాష్ట్రాల జాబితాలో పొరుగున్న ఉన్నతమిళనాడుతోపాటు, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, గుజరాత్, బీహార్ వంటిరాష్ట్రాలు ఉన్నాయి.
అత్యంత వెనుకబడిన రాష్ట్రంగా చెప్పుకునే బీహార్ కూడా ఆఖరికిరూపాయి కూడా ఆర్బీఐనుంచి తీసుకోలేదు. మరి ఈ ముఖ్యమంత్రేమో అందినచోటల్లా కుప్పలు కుప్పలు అప్పులుచేసి కూర్చొని, అవిచాలవన్నట్లు ఆర్ బీఐ ని కూడా తెగవాడుకున్నాడు. ఇవన్నీ ఆర్ బీఐ నివేదికల్లోని అంశాలే. లక్షా56 వేలకోట్లు రాష్ట్ర ఖజానాకి వస్తే, అవిచాలవన్నట్లు విచ్చలవిడిగా ఆర్ బీఐ నుంచి రూ.32వేలకోట్లు తీసుకుంటారా?
సామాన్యుడి భాషలో చెప్పాలంటే ఈ విధంగా అప్పులుచేయడం రాష్ట్రాన్ని వెంటిలేటర్ పై పెట్టడమే. ఇంతడబ్బు ఖజానాకి వస్తుంటే నేటివరకు సామాన్యుడికి ఉపశమనం కలిగించేవిధంగా పెట్రోల్ డీజిల్ ధరలు ఎందుకు తగ్గించలేదు? విద్యుత్ ఛార్జీలు విపరీతంగా ఎందుకు పెంచుతున్నారు? చెత్తపన్ను, ఆస్తిపన్ను, ఇతరత్రా పన్నులరూపంలో ప్రజలపై భారాలు ఎందుకు వేస్తున్నారు? ఓటీఎస్ పేరుతో పేదలను ఎందుకు పీడిస్తున్నారు? రాష్ట్రంలో ఏ వర్గాన్ని వదలకుండా ఈ ముఖ్యమంత్రి పీల్చిపిప్పిచేస్తున్నాడు. తీసుకొచ్చే రూపాయి పేదవాడిసంక్షేమానికి అనిచెప్పే ముఖ్యమం త్రి పైప్రశ్నలకు సమాధానంచెప్పగలడా?
ప్రజలంతా కూడా ఈ ఆర్థికఉగ్రవాది రాష్ట్రాన్ని ఏదిశగా తీసుకెళ్తు న్నాడో ఆలోచించాలి. ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీకింద దేశవ్యాప్తంగా రూ.26,784కోట్లను 29రాష్ట్రాలు ఈ ఆర్థికసంవత్సరంలో నవంబర్ 2021వరకు వాడుకుంటే, ఆ మొత్తంలో ఒక్క ఏపీ తీసుకున్న సొమ్మే రూ.12,439కోట్లు. అంటే మనవాడకం వాటా 46.04 శాతంగాఅన్నమాట. దేశంమొత్తం అన్నిరాష్ట్రాల ఓడీ వాడకంలో రమారమీ సగంవాటా మనరాష్ట్రానిదే. జగనన్న వాడకం అలాంటిదిమరి.
వేజ్ అండ్ మీన్స్ అడ్వాన్సుల వాడకాన్ని చూస్తే దేశంలోని 29రాష్ట్రాలుకలిపి రూ.46,266 కోట్లువాడితే, జగన్ సర్కారు ఒక్కటే రూ.15,165 కోట్లు వాడుకుంది. అంటే ఏపీ ఒక్కటే మొత్తం వేజ్ అండ్ మీన్స్ సొమ్ములో దాదాపు 33శాతం వాడుకుంది. ఆరకంగా ఓడీ వాడకంలో, వేజ్ అండ్ మీన్స్ వాడ కంలో దేశంలోనే మనరాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిన ఘనుడు జగన్ రెడ్డి.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, దేశంలోఉన్న 29 రాష్ట్రాల్లో ఈఆర్థికసంవత్సరంలో 22రాష్ట్రాలు ఆర్ బీఐ నుంచి నయాపైసా కూడా ఓడీ (ఓవర్ డ్రాఫ్ట్) కింద తీసుకోలేదు. వాటిలో పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, పంజాబ్, పాండిచ్చేరి, ఒడిశా, మధ్యప్రదేశ్, హర్యానా, గుజరాత్, కర్ణాటక వంటి రాష్ట్రాలుఉన్నాయి.
ఏపీమాత్రం ఓడీకింద రూ.12,439కోట్లు వాడుకుంది. ప్రతినిత్యం మనరాష్ట్ర ఆర్థిక కష్టాలకు కోవిడ్ కారణమని తప్పించుకునే ప్రయత్నంచేసే ముఖ్యమంత్రి, మరినేడు మిగతారాష్ట్రాలకు లేని కోవిడ్ కష్టాలు ఈ ముఖ్యమంత్రికి, ఏపీకే వచ్చాయా అన్నప్రశ్నకు సమాధానంచెప్పాలి. కోవిడ్ సమయంలోకూడా 22రాష్ట్రాలు ఓడీ కింద రూపాయికూడా తీసుకోకుండా పరిపాలనఎలాచేశాయి. 22 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు చేతైనైంది ఈ ఆర్థికఉగ్రవాది జగన్ రెడ్డికి ఎందుకుచేతకాలేదని ప్రశ్నిస్తున్నాం. చేతగాని అసమర్థ ముఖ్యమంత్రి, అవినీతిచక్రవర్తి కాబట్టే ఈ ముఖ్యమంత్రి ఈ విధంగా అందినచోటల్లా కోట్లకు కోట్లు లాగేస్తున్నాడు.
అలానే దేశంలో 15రాష్ట్రాలు వేజ్ అండ్ మీన్స్ కింద ఆర్ బీఐ నుంచి పైసాకూడా తీసుకోలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం రూ.15,165కోట్లు లాగేశాడు. దేశంలో15రాష్ట్రాలు వేజ్ అండ్ మీన్స్ పద్దుకింద ఈఆర్థికసంవత్సరం నవంబర్ వరకు ఆర్బీఐ నుంచి పైసా కూడా తీసుకోకుండా పరిపాలన చేశాయి. కానీ జగన్ రెడ్డికి మాత్రం అదిసాధ్యంకాలేదు. వేజ్ అండ్ మీన్స్ అడ్వాన్సులు, ఓవర్ డ్రాఫ్ట్ లు, ఎస్ డీఎఫ్ ల వాడకంలో దేశంలో జగన్మోహన్ రెడ్డే నంబర్ గా ఉన్నాడు.
రూపాయి, రెండురూపాయలుకాదు.. రూ.32,217కోట్లు వాడేశాడు. తెలంగాణ రాష్ట్రం ఈ ఆర్థికఏడాది మూడువిభాగాల్లో మొత్తంగా రూ.20వేలకోట్లు మాత్రమే తీసుకుం ది. అంటే దాదాపు మనకంటే 40శాతం తక్కువ. ఆర్ బీఐ నుంచి వివిధరూపాల్లో తాత్కాలిక అవసరాలకోసం డబ్బులు డ్రాచేసిన రాష్ట్రాల జాబితాలో కూడా నాగాలాండ్, మణిపూర్, మిజోరం, జమ్ము కశ్మీర్ వంటి రాష్ట్రాలున్నాయి. ఆ రాష్ట్రాలకంటే కూడా అధ్వాన్నంగా ఈ ఆర్థికఉగ్రవాది బంగారం లాంటి రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశాడు.
ఇంతవిచ్చలవిడిగా ఆర్ బీఐ నుంచి ఏపీ డబ్బులు వాడుకుంది కాబట్టే, బొచ్చెపట్టుకొని, అప్పులకోసం ఎవరివద్దకు వెళ్లినా ఛీ పొమ్మనే పరిస్థితి. ఎవరినుంచి ఏ రూపాయి వచ్చినా పత్రికల్లో వచ్చే వార్తలేంటంటే, ఎక్కడో ఒక వెయ్యో, రెండువేలకోట్లో అప్పు తెస్తే, అదికాస్త ఆర్ బీఐ జమేసుకుందని. తొలి 8నెలల కాలంలో 112 రోజులు ఓవర్ డ్రాఫ్ట్ లో మనరాష్ట్రం ఉంది. అదేవిధంగా వేజ్ అండ్ మీన్స్ అడ్వాన్స్ ల మీద ఆధారపడి 193రోజులు నెట్టుకొచ్చింది. ఇవన్నీ నూటికి నూరుశాతం వాస్తవాలు. ఈ లెక్కలపై ముఖ్యమంత్రి, రాష్ట్రఆర్థికమంత్రి సమాధానం చెప్పాల్సిందే.
దేశంలో ఏరాష్ట్రంలో లేనివిధంగా ఆర్ బీఐ నుంచి ఎస్ డీఎఫ్, వేజ్ అండ్ మీన్స్, ఓవర్ డ్రాఫ్ట్ లకింద రూ.32,217కోట్లు ఎందుకు తీసుకొచ్చారు. తీసుకొచ్చిన సొమ్మంతా ఏంచేశారు? 22 రాష్ట్రాలు ఓడీ వినియోగించుకోకపోతే ఏపీమాత్రమే ఎందుకు వాడుకుంది? రూ.12,439కోట్ల ఓడీ తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది? దేశంలో 15రాష్ట్రాలు వేజ్ అండ్ మీన్స్ అడ్వాన్సులకింద పైసా తీసుకోకపోతే, ఏపీ మాత్రమే రూ15,165కోట్లు ఎందుకు తీసుకుంది? ఎస్ డీఎఫ్, వేజ్ అండ్ మీన్స్, ఓడీలకింద ఆర్ బీఐ నుంచి రూపాయికూడా తీసుకోని రాష్ట్రాలు దేశంలో 11ఉంటే, ఏపీ ఒక్కటే రూ.32,217కోట్లు తీసుకునే దుస్థితికి ఎందుకు ఇంతలా దిగజారింది?
మొన్న పార్లమెంట్ లో తమ ఆర్థికక్రమశిక్షణ అమోఘమని ఏ2 విజయసాయిరెడ్డి డబ్బాలు కొడుతున్నాడు.ఇదేనా ఆయన చెప్పిన ఆర్థికక్రమశిక్షణ? ఆర్థికక్రమశిక్షణ అసలేమాత్రం లేని రాష్ట్రాల జాబితాలోఆంధ్రప్రదేశ్ ముందుంది అని విజయసాయిరెడ్డి తెలుసు కోవాలి. ఇప్పటివరకు మనరాష్ట్రం అప్పుల్లోనే నంబర్ 1 గా ఉన్నాము. ఇప్పుడు ఆర్ బీఐ నుంచి చేబదుళ్లు తీసుకోవడంలో, వేజ్ అండ్ మీన్స్, ఓవర్ డ్రాఫ్ట్ వాడకంలో కూడా నంబర్ 1గానే నిలిచాము. ఇంతగొప్ప ప్రగతితో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఎవరికీ అందనంత గొప్పగా తయారైంది. అదీ జగనన్న గారి వాడకమంటే.
ఆర్ బీఐ గైడ్ లైన్స్ ప్రకారం, ఒకఆర్థికసంవత్సరంలో క్వార్టర్ కు 50 రోజులకు మించి ఓడీ వాడకం ఉండకూడదన్న నిబంధన ఉంటే, మనరాష్ట్రం మాత్రం దాన్నిమించి 56రోజులు ఓడీపై ఆధారపడింది. ఆరకంగా ఆర్ బీఐ నిబంధనను కూడా జగనన్న తుంగలోతొక్కారు. మూడునెలలకు 90 రోజులైతే, 56 రోజులు ఏపీప్రభుత్వం ఓడీలోనే ఉంది. ప్రతిదానికి కోవిడ్ కారణమని చెప్పే జగన్మోహన్ రెడ్డి, 22రాష్ట్రాలు ఓడీకి వెళ్లకుండా, ఆర్ బీఐ నుంచి నయాపైసా తీసుకోకుండా పరిపాలన ఎలాచేస్తున్నాయో సమాధానంచెప్పాలి.
ఆఖరికి జార్ఖండ్, త్రిపుర, గోవా, అరుణాచల్ ప్రదేశ్ వంటి వెనుకబడినరాష్ట్రాలు రూపాయికూడా ఓడీ తీసుకోలేదు. 22రాష్ట్రాల్లో ఉద్యోగులకుజీతాలు, పింఛన్లు ఇవ్వకుం డా ఆపేశారా.. అభివృద్ధి ఏమైనా ఆగిపోయిందా? సంక్షేమం పడకేసిందా.. లేదుకదా? ఇలా సమాధానం దొరకని అనేకభేతాళ ప్రశ్నలు ఈఆర్థికఉగ్రవాది ప్రజలముందు ఉంచాడు. తనచర్యలను, తనవాడకాన్ని ఎలా సమర్థించుకుంటాడో ఈ ముఖ్యమంత్రి ప్రజలకు సమాధానం చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తున్నాం.