టీటీడీ బోర్డుకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు షాక్‌

తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు షాక్‌ ఇచ్చింది. ఆలయానికి వస్తున్న నిధుల నుంచి తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌కు బదిలీ చేయడాన్ని తప్పుపట్టింది. టీటీడీ బోర్డుకు వస్తున్న నిధుల్లో ఒక శాతం తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌కు కేటాయిస్తామని ప్రకటించింది. అందులో భాగంగా రూ.1000కోట్లు మున్సిపల్‌ కార్పొరేషన్‌కు పారిశుధ్య పనులకు మళ్లించింది.

ఇది ఏమాత్రం సరికాదంటూ బీజేపీ నాయకుడు భానుప్రకాశ్‌రెడ్డి ఏపీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కోర్టు బుధవారం విచారించింది. ఆలయ నిధులు మళ్లించడం దేవాదాయ చట్టం సెక్షన్‌ 111కి విరుద్ధమని స్పష్టం చేసింది. సంబంధిత కాంట్రాక్టర్లకు సొమ్ము విడుదల చేయొద్దని.. టెండర్‌ ప్రక్రియ కొనసాగించుకోవచ్చని కోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో ఆదేశించింది. రెండు వారాల్లోగా టీటీడీ, తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Leave a Reply