Suryaa.co.in

Andhra Pradesh

వీళ్లా వైఎస్సార్‌ వారసులు?

-అవినాష్ ఏ తప్పు చేయలేదు
-నేను బలంగా నమ్మబట్టే మరలా టికెట్ ఇచ్చా
-వివేకా చిన్నాన్నకు రెండో వివాహం ద్వారా సంతానం ఉన్నది వాస్తవం కాదా?
-నా చెల్లెళ్లు నాన్న శత్రువులతో చేతులు కలిపారు
-పులి వెందుల లో సీఎం జగన్

చాలాకాలం తర్వాత తన చిన్నాన్న వివేకా హత్య నేపథ్యం గురించి సీఎం జగన్ పెదవి విప్పారు. ఆ సందర్భంలో తనపై తిరుగుబాటు చేసిన చెల్లెళ్లపైనా నిర్మొహమాటంగా విమర్శల వర్షం కురిపించారు? వీళ్లా వైఎస్ వార సులు అని నిలదీశారు. అవినాష్‌రెడ్డి ఎలాంటి తప్పు చేయలేదని నమ్మినందుకే తాను మళ్ల టికెట్ ఇచ్చానని ప్రకటించారు.

నాన్నగారిపై కక్షతో, కుట్రపూర్వకంగా కేసులు పెట్టింది ఎవరు?. వైఎస్సార్‌ పేరును ఛార్జిషీట్‌లో పేర్కొంది ఎవరు?. వైఎస్సార్‌ కీర్తి ప్రతిష్టలను చెరిపేయాలని, వైఎస్సార్‌సీపీకి పేరు దక్కవద్దని, విగ్రహాలు తొలగిస్తామని చెబుతున్నవాళ్లు, ఆ పార్టీలతో చేతులు కలిపినవాళ్లు వైఎస్సార్‌ వారసులా?.

పసుపు చీరలు కట్టుకుని వైఎస్సార్‌ శత్రువులతో చేతులు కలిపిన వాళ్లు, ఆ పార్టీలో చేరిన వాళ్లా వైఎస్సార్‌ వారసులు?. వైఎస్సార్‌ పేరు కనబడకుండా చేయాలని కాంగ్రెస్‌ ప్రయత్నించింది. రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్‌కు ఎవరైనా ఓటేస్తారా?. హోదాను తుంగలో తొక్కిన కాంగ్రెస్‌కు ఎవరైనా ఓటేస్తారా? కాంగ్రెస్‌కు ఓటేస్తే బాబుకి ఓటేసినట్లు కాదా?.

నాన్న శత్రువులతో చేతులు కలిపారు నా చెల్లెలు. నాన్న మరణం తరువాత కడప , పులి వెందుల గురించి నా ప్రభుత్వం తప్ప ఏ ప్రభుత్వమైనా పట్టించుకుందా? పులివెందుల- కడప శరవేగంగా అభివృద్ధి చెందుతూన్నాయి

LEAVE A RESPONSE