Suryaa.co.in

Andhra Pradesh

పింఛన్ దారులను బాధపెట్టడమే జగన్ రెడ్డి నైజం

– పింఛన్ల కోసం 34 లక్షల మంది వృద్ధులను మండుటెండలో నిలబెట్టడం దుర్మార్గం
– గత ప్రభుత్వంలో వాలంటీరు వ్యవస్థ లేకపోయినా అందరికీ పింఛన్ అందింది
– మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ యంత్రాంగం తప్పుడు విధానాల వల్ల 56 లక్షల పింఛన్ దారులు రోడ్డున పడ్డారు. వృద్దులు అనే తేదా లేకుండా పింఛన్ల కోసం సచివాలయాలకు రావాలని చెప్పడం దారుణం. వైసీపీ ప్రభుత్వానికి లబ్ధి చేయాలనే కుట్రతో సీఎస్ జవహర్ రెడ్డి, సెర్ఫ్ సిఈఓ మురళీధర్ రెడ్డి, సీఎం పేషీ ధనుంజయ రెడ్డి, సిఎం జగన్మోహన్ రెడ్డి, కలిసి ఇంతటి దారుణానికి పాల్పడ్డారు.

ముఖ్యమంత్రి కనుసన్నల్లో కొంతమంది అధికారులు ఫింఛన్ దారులను మండుటెండల్లో నిలబెట్టి స్వార్థపూరిత కుట్రతో ఆలోచిస్తున్నారు. గత ప్రభుత్వంలో కొద్దిపాటి విలేజ్ సెక్రటరీలు ఉన్నప్పుడే అందరికీ పింఛన్లు అందేలా చర్యలు తీసుకున్నాం. మరి ఈ ప్రభుత్వం రాష్ట్రంలో, 15 వేల సచివాలయాలు, 1.35 వేల సచివాలయ సిబ్బంది ఉన్నారు వీళ్ల ద్వారా పింఛన్లు అందించడం సాధ్యమేనని జిల్లా కలెక్టర్లు చెప్పారు. కాని, సెర్ఫ్ సీఈఓ మురళీధర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి ఈ కుట్రలో కీలక పాత్ర వహించి కలెక్టర్లు చెప్పిన సమాచారాన్ని పక్కదోవ పట్టించారు.

ఈ కుట్రలో భాగంగానే వృద్దులను మండుటెండలో సచివాలయాలకు రమ్మనడం జగనరెడ్డి నియంత పోకడలకు నిదర్శనం. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి ఏకపక్షంగా వ్యవహరించడం దుర్మార్గం. తాడేపల్లి ప్యాలెస్‌లో ఏసీలో కూర్చుని 34 లక్షల మంది వృద్దులను పింఛన్ల కోసం సచివాలయాలకు రావాలని చెప్పిన జగన్ రెడ్డికి మానవత్వం ఉందా? కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితిలో రాష్ట్రం ఉంది. అలాంటిది ప్రజలను ఏం పట్టించుకుంటారు. రాబోయే ఎన్నికల్లో ఓట్లు దండుకోవడం కోసం కక్ష పూరితమైన కుట్రలకు వైసీపీ ప్రభుత్వం పాల్పడుతుంది.

వైసీపీ ప్రభుత్వం పన్నిన కుట్రలో పాలుపంచుకున్నందుకు 9 మంది అధికారులు బలయ్యారు. వైసీపీ కి వంతపాడిన ఐఎస్, ఐపిఎస్ లు ఎన్నికల విధుల నుంచి తప్పించినా జగన్ రెడ్డికి చీమకుట్టినట్టు కూడా లేదా? వ్యవసాయ అనుబంధ రంగాల్లో 14,232 మంది ఉద్యోగులు ఉన్నారు వీళ్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేయవచ్చు.

గత ప్రభుత్వంలో ముందు పింఛన్ దారులకు డబ్బులు అందిచిన తర్వాతే ఉద్యోగులకు మిగతా వారికి అందించేవారు. కానీ, ఈ ప్రభుత్వంలో ఉన్నడబ్బులన్నీ కాంట్రాక్టర్లకు, వైసీపీ కి అనుకూలంగా పనిచేసిన వారికి, పంచేశారు. పింఛన్ దారులకు డబ్బులు పంచడానికి 3 తారీఖు వచ్చినా సచివాలయ సిబ్బంది చేతికి డబ్బులు అందలేదంటే జగన్మోహన్ రెడ్డి ఎంత కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలి.

జగన్ రెడ్డి రాజకీయ లబ్ది కోసం చేసిన కుట్రలో వృద్దులు 34 లక్షలు, వితంతువులు 15 లక్షలు, ఒంటరి మహిళలు1.79 వేల మంది, చేనేత కార్మికులు 93 వేలు, మత్స్యకారులు 68 వేలు, డప్పుకళాకారలు 63 వేలు, చర్మకారులు 47వేలు, ఆర్ట్ కళాకారులు 43 వేలు, కల్లు గీత కార్మికులు 41 , అమరావతిలో భూమి లేని వారు 17 వేల మంది, అభయ హస్తం, వృద్దులు 1.62 వేల మంది, కళాకారులు 3,145, హిజ్రాలు 2,275 మంది కలిపి 52 లక్షల పింఛన్ దారులును సచివాలయాలకు రమ్మనడం దుర్మార్గం.

9 మంది పై వేటు
పాలరాజు గుంటూరు రేంజ్ ఐజీ ప్రధాన మంత్రి హాజరయిన ఉమ్మడి సభకు ఆటంకం కలిగించారు. ట్రాఫిక్ మొదలు ఎక్కడికక్కడ భద్రతా వైఫల్యం కనిపించడంతో కేంద్ర ఇంటిలిజెన్స్ ఆరా తీసి పాలరాజుప వేటు వేసింది. లక్ష్మీశ తిరుపతి జిల్లా కలెక్టర్ ఈయన కలెక్టర్ కంటే వైపీసీ కార్యకర్తగా ఎక్కువగా పనిచేశారు. దొంగ ఓట్ల వ్యవహారంలో అధికార పార్టీకి అనుగుణంగా పనిచేశారు.

రవిశంకర్ రెడ్డి పల్నాడు ఎస్పీ వైకాపా అరాచకాలకు వత్తాసు పలుకుతూ పల్నాడు జిల్లాలో వరుసగా జరుగుతున్నా హింసాత్మక ఘటనలను అడ్డుకట్వేయలేకపోయారు. పరమేశ్వర్ రెడ్డి ప్రకాశం జిల్లా ఎస్పీ వైకాపా అనుకూల, వారి అరాచకాలకు కొమ్ముకాసే అధికారిగా గుర్తింపు పొందారు. అధికార పార్టీ వారు చేసే అరాచకాలకు అనుగుణంగా ఉంటూ ప్రతిపక్షాలను వేధించేవారు.

పి. రాజబాబు కృష్ణాజిల్లా కలెక్టర్ పేర్ని నాని ఏది చెబితే అదే చట్టమన్నట్టు వ్యవహరించేవారు. బోగస్ ఓటర్లపై ఎన్ని ఫిర్యాదులొచ్చినా చర్యలు తీసుకోలేదు. పల్లె జాషువా చితూరు ఎస్పీ ప్రతి పక్ష నాయకుల పైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వేదించారు.

ఎం. గౌతమీ అనంతపురం జిల్లా కలెక్టర్ అనంతపురం జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర నిర్వహించారు. నిబంధనల ప్రకారం పది గంటల వరకే అనుమతి ఉన్నా 11.30 వరకు కొనసాగింది. కోడ్ ఉల్లంఘిస్తున్నా చర్యలు తీసుకోలేదు.

కేకేఎన్ అన్బురాజన్ అనంతపురం ఎస్పీ వివేకా హత్య కేసులో సీబిఐనే ముప్పు తిప్పలు పెట్టించారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చాక జగన్ అనంతపురం జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనగా ఆయన బస్సు యాత్ర కోసం ముందురోజే రిహార్సల్ నిర్వహించారు. తిరుమలేశ్వరరెడ్డి నెల్లూరు ఎస్పీ టీడీపీ మాజీ మంత్రి నారాయణ లక్ష్యంగా పలుమార్లు పోలీసులతో దాడులు చేయించారు

LEAVE A RESPONSE