-కాంగ్రెస్,బిజెపి లకు మంత్రి జగదీష్ రెడ్డి సవాల్
-ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో లక్షా 32 వేల పై చిలుకు భర్తీ
-కాంగ్రెస్,బిజెపి పాలిత రాష్ట్రాలలో పట్టుమని పదివేల ఉద్యగాలు ఇయ్యలే
-అది నిరుద్యోగ మార్చ్ కాదు,రాజకీయ నిరుద్యుగుల మార్చ్
-నిరుద్యోగ మార్చ్ చేయాల్సింది గల్లీలో కాదు ఢిల్లీలో
-యేటా రెండు కోట్ల ఉద్యగాలు ఇస్తామని మాట తప్పిన మోడీకి వ్యతిరేకంగా చెయ్యాలి
-కాంగ్రెస్ దిక్కుమాలిన పార్టీ
-ఉన్నదే నాలుగు ఈకలు ఎవరి గోల వారిదే
-క్షుద్ర రాజకీయ క్రీడలో లీకేజీ ఒక భాగం
-దేశాన్ని ఏలుతున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే లీకేజీ సృష్టికర్త
-తెలంగాణా లో బిజెపి కి కాంగ్రెస్ బీ-టీమ్
-మంత్రి జగదీష్ రెడ్డి
ఉద్యోగాల భర్తీ పై తాము చర్చకు సిద్ధమేనని అందుకు కాంగ్రెస్ బిజెపి లు సిద్ధంగా ఉన్నాయా అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం గడిచిన తొమ్మిది ఏళ్లలో లక్షా 32 వేల 632 ఉద్యగాలను భర్తీ చేసిందని ఆయన వెల్లడించారు.ఈ మేరకు బుధవారం రోజున సూర్యపేట జిల్లా కేంద్రంలో మంత్రి జగదీష్ రెడ్డిజడ్ పి చైర్మన్ దీపికా యుగందర్ రావు,రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,శాసన సభ్యులు గాధరి కిశోర్, శానంపూడి సైదిరెడ్డి లతో కలసి మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ బిజెపి పాలిత రాష్ట్రాలలో పది ఏళ్ల నుండి పదివేల ఉద్యగాలను భర్తీ చెయ్యలేకపోయిన కాంగ్రెస్ బిజెపి లు నిరుద్యోగ మార్చ అంటూ హడావుడి చెయ్యడం ముమ్మాటికి నిరుద్యోగులను వంచన కు గురి చెయ్యడమే నని ఆయన దుయ్యబట్టారు. నిరుద్యోగ మార్చ్ చెయ్యాల్సి వస్తే అది గల్లీలో కాదని ఢిల్లీలో చేయాలని ఆయన ఉద్బోధించారు.ఇక్కడ చేసేది రాజకీయ నిరుద్యోగ మార్చ్ అంటూ ఆయన ఎద్దేవాచేశారు.
అధికారంలోకి వస్తే యేటా రెండు కోట్ల ఉద్యగాల భర్తీ అంటూ మోసపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన మోడీ కీ వ్యతిరేకంగా చెయ్యాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.యేటా రెండు కోట్లు కాదు కదా సంవత్సరానికి రెండు లక్షల మంది ఉద్యోగులను వీధిన పడేసిన ఘనత ప్రధాని మోడీ దని ఆయన దుయ్యబట్టారు.గల్లీ నుండి ఢిల్లీ దాకా కాంగ్రెస్ పార్టీ దిక్కుమాలిన పార్టీగా మారిందన్నారు.అటువంటి పార్టీకీ తెలంగాణా లో ఉన్నదే నాలుగు ఈకలని, ఆ నాలుగు ఈకలు కూడా ఎవరీ గోలలో వాళ్లే ఉన్నారని ఆయన ఎత్తి పొడిచారు.
బిజెపి ఆడుతున్న క్షుద్ర రాజకీయాలలో లీకేజీ ల ప్రహసనం ఒక భాగమని ఆయన మండిపడ్డారు. దేశాన్ని ఏలుతున్న పార్టీకి రాష్ట్రంలో అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి లీకేజీ లో అడ్డంగా దొరికిపియారని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ బిజేపి కి బీ-టీం గా పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు.