కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన నవతరం నేత ఆరిమిల్లి

– 16 రోజుల పాటు 48 గ్రామాల్ని చుట్టి 270కు పైగా కిలోమీటర్ల పాదయాత్ర

తణుకు: 40 సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీలో … విద్యాధికులు దూర దృష్టి గలవాళ్ళకు టిక్కెట్లు ఇవ్వడం ద్వారా తెలుగుదేశం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు వినూత్న ప్రయోగం చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో సమున్నత అభివృద్ధి సంక్షేమం అమలు చేసేందుకు నవతరం నాయకుల్ని ప్రోత్సహిస్తున్నారు. ఈ కోవలోనే పశ్చిమగోదావరి జిల్లా తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణకు బాధ్యతలు అప్పగించారు. చంద్రబాబు ఆశయ స్ఫూర్తికి అనుగుణంగా ఆరిమిల్లి ..ఇప్పుడు తెలుగుదేశం బిజెపి జనసేన కూటమి ఉమ్మడి అభ్యర్థిగా వినూత్న తరహాలో ప్రజల్లోకి వెళ్తున్నారు.

90వ దశకం లోనే కంప్యూటర్ సైన్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన ఆరుమెల్లి రాధాకృష్ణ సింగపూర్లో ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు. సింగపూర్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షునిగా చాలా సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఆ సమయంలోనే చంద్రబాబు దృష్టిని ఆకర్షించడంతో తణుకు టికెట్ ఇప్పించి నిలబెట్టారు. నమ్మకాన్ని రుజువు చేస్తూ భారీ మెజార్టీతో ఆరిమిల్లి రాధాకృష్ణ గెలుపొందారు.‌ 2014 19 మధ్య కాలంలో తణుకులో విస్తారంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. దీంతో ఐదేళ్ల కాలంలో తణుకు నియోజకవర్గం మూడుసార్లు ఉత్తమ నియోజకవర్గంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు పొందింది. తర్వాత 2019 ఎన్నికల్లో కేవలం వందల ఓట్ల తేడాతో ఓటమి చెందారు.

అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం అన్ని వర్గాల ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని అభిలషిస్తూ. ఆరిమిల్లి రాధాకృష్ణ సాహసమైన ప్రయత్నం చేశారు.‌ మండుటెండల్లో నియోజకవర్గం అంతా పాదయాత్ర చేసి వచ్చారు. నియోజకవర్గంలోని తణుకు పట్టణంతో పాటు 48 గ్రామాల్ని చుట్టి వచ్చారు. 16 రోజుల పాటు సుమారు 270కు పైగా కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి వచ్చారు. అడుగడుగునా ప్రజలతో కలిసి నడుస్తూ ముందుకు సాగారు. ప్రతీ రోజూ ఆయా గ్రామాల్లోని బీసీ, ఎస్సీ కాలనీల్లో పల్లె నిద్ర చేశారు. స్వయంగా బీసీ, ఎస్సీ సోదరుల ఇళ్లలోనే బస చేయటంతో .. ఆయా వర్గాల ప్రజలు నేరుగా ఆయనతో మమేకం అయ్యారు. దీంతో దిగువ, పేద తరగతి వర్గాల ప్రజలతో ఆరిమిల్లి రాధాకృష్ణ బాగా కలిసిపోయారు.

మండుటెండల్లో ఊరూరా తిరుగుతూ ఆరిమిల్లి రాధాకృష్ణ పాదయాత్ర చేయటంతో… వాస్తవ పరిస్థితులు బయటకు వచ్చాయి. ప్రజలు అభిప్రాయాలు వెలుగు చూశాయి. ముఖ్యంగా బీసీ ఎస్సీ కాలనీలో బస చేయడం ద్వారా ఆయా వర్గాల ప్రజలకు ఆరిమిల్లి దగ్గర అయ్యారు. చాలా కాలనీలలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే సీసీ రోడ్లు పడ్డాయని, తర్వాత కాలంలో ఎక్కడ రోడ్లు వేయలేదని స్థానికులు చెబుతున్నారు. నియోజకవర్గంలో సరైన రోడ్లు లేక అవస్థలు పడుతున్నామని వాపోతున్నారు.

వైసీపీ ప్రభుత్వం హయాంలో పంచాయితీల్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. పంచాయతీల నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా లాగేసుకుంది. స్థానికంగా గ్రామాల్లో ఆయా పంచాయతీలు ఏ పనులూ చేయలేకపోతున్నాయి. ఉదాహరణకి డ్రైనేజీ సమస్య ఊరూరా తిష్ట వేసుకొని కూర్చుంది. ముఖ్యంగా బీసీ ఎస్సీ కాలనీలలో డ్రైనేజీ సమస్యను పట్టించుకునే నాధుడే లేదు. దీంతో అక్కడ మురుగుతో ప్రజలకు విస్తారంగా రోగాలు వస్తున్నాయి.

సంక్షేమం పేరుతో చిల్లర విదలిస్తున్న ప్రభుత్వ పెద్దలు…‌ నికరంగా ప్రజలకు అవసరమయ్యే సామాజిక వైద్యం ఆరోగ్యం విషయం పట్టించుకోవటం లేదు.‌ అంతిమంగా వైసిపి ప్రభుత్వ తీరు మీద బీసీ ఎస్సీ కాలనీలోని స్థానికులు చిరాకు పడుతున్నారు. పాదయాత్రలో భాగంగా పల్లెనిద్రలో బీసీ ఎస్సీ కాలనీలో బస చేసినప్పుడు రాధాకృష్ణ దృష్టికి ఈ విషయాన్ని తీసుకొచ్చారు.

2014 ఎన్నికలకు ముందు కూడా. ఆరిమిల్లి రాధాకృష్ణ పాదయాత్ర చేసి సమస్యలు తెలుసుకున్నారు. 2014లో ఎన్నికల్లో గెలుపొందాక ఆయా సమస్యల్ని ఆరిమి రాధాకృష్ణ పరిష్కరించారు. అందుకే అభివృద్ధిలో నియోజకవర్గం నెంబర్ వన్ అయింది.

ఇప్పుడు కూడా అదే మాదిరిగా ఆరిమిల్లి రాధాకృష్ణ మండుటెండల్లో పాదయాత్ర చేశారు. ప్రజల సమస్యలను గుర్తించారు. డ్రైనేజీ సమస్య వంటి తీవ్ర సమస్యల్ని ఆరిమిల్లి గుర్తించారు. నియోజకవర్గం అంతా మాస్టర్ ప్లాన్ రూపొందించి సమస్యలను తీరుస్తామని విద్యాధికులు అయిన ఆరుమెల్లి రాధాకృష్ణ చెబుతున్నారు పాదయాత్ర అనుభవాలతో అధికారులకు వచ్చాక తెలుగుదేశం ప్రభుత్వం అన్ని హామీలను అమలుపరుస్తుందని స్పష్టంగా చెబుతున్నారు.

మరోవైపు చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాన్ని ఆరిమిల్లి రాధాకృష్ణ బాగా ప్రచారం చేశారు పాదయాత్ర సమయంలో స్పష్టమైన సమయం అందుబాటులో ఉండటం వల్ల వీధి వీధినా మహిళలను పిలిపించి సూపర్ సిక్స్ పథకాన్ని విడమర్చి చెబుతూ వచ్చారు దీంతో గ్రామాల్లో చక్కటి స్పందన కనిపించింది.

మొత్తం మీద గ్రామాల్లో మహిళలు యువత బిసి ఎస్సి వర్గాల్లో చైతన్యం తెచ్చేందుకు రేపటి కోసం పేరుతో చేసిన పాదయాత్ర లక్ష్యాన్ని నెరవేర్చింది ఆయా వర్గాల ప్రజల్లో వాస్తవాల పట్ల మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అవగాహన కల్పించారు.

Leave a Reply