Suryaa.co.in

Business News National

త్వరలోనే అగ్నిపథ్ రిక్రూట్ మెంట్ ఉంటుంది: ఆర్మీ చీఫ్

త్రివిధ దళాల్లో రిక్రూట్ మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నపథ్ పథకం దేశ వ్యాప్తంగా పలు చోట్ల హింసను రాజేసింది. ఈ పథకాన్ని వ్యతిరేకిస్తున్న ఆందోళనకారులు పలు చోట్ల నిరసన కార్యక్రమాలను చేపట్టారు. రైళ్లకు నిప్పుపెడుతున్నారు. సికింద్రాబాద్ లో సైతం ఒక రైలును అగ్నికి ఆహుతి చేశారు. అయినప్పటికీ కేంద్రం కానీ, ఆర్మీ కానీ ఏ మాత్రం తగ్గడం లేదు.

ఈ నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే ఈ రోజు కీలక ప్రకటన చేశారు. త్వరలోనే అగ్నిపథ్ రిక్రూట్ మెంట్ షెడ్యూల్ ను ప్రకటిస్తామని ఆయన తెలిపారు. ఆర్మీలో చేరాలనుకుంటున్న యువత వయోపరిమితిని ఒక్కసారి పెంచుతున్నామని, రిక్రూట్ మెంట్ ఏజ్ ను 23 ఏళ్లకు పెంచామని చెప్పారు.

ఈ నిర్ణయం వల్ల దేశంలోని యువతకు దేశభక్తిని చాటుకునే అవకాశం దొరుకుతుందని అన్నారు. కరోనా సమయంలో ఎంతో కష్టపడ్డ యువతకు ఇప్పుడు మంచి అవకాశం లభించిందని చెప్పారు. అగ్నివీరులుగా సైన్యంలో చేరే అవకాశాన్ని యువత వినియోగించుకోవాలని సూచించారు.

LEAVE A RESPONSE