Suryaa.co.in

Andhra Pradesh

ఏపీలో రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్

-సర్కారు నుంచి విడుదల కాని వెయ్యి కోట్లు
-ఇక ఉచిత సేవలు మావల్లకాదని ఆసుపత్రుల స్పష్టీకరణ
-ప్రజలకు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రుల సంఘం బహిరంగ లేఖ

ఏపీలో రేపటినుంచీ ఆరోగ్యశ్రీ సేవలు అటకెక్కనున్నాయి. జగన్ సర్కారు తమకు చెల్లించాల్సిన వె య్య కోట్ల రూపాయల పెండింగ్ నిధులు విడుదల చేయకపోవడంతో, ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయటం అనివార్యమయిందని, ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రుల సంఘం ప్రజలకు బహిరంగ లేఖ విడుదల చేసింది. ఆ ప్రకారంగా ఈనెల 25 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రుల లేఖ యధాతథంగా ..

ఆరోగ్యశ్రీ, EHS లబ్ధిదారులారా..!
ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా అందిస్తున్న ఆరోగ్యశ్రీ, EHS తదితర సేవలను జనవరి 25 నుండి నిలిపివేస్తున్నట్టు తెలియచేయటానికి విచారిస్తున్నాము. ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులకు బిల్లులు చెల్లించకపోవటం, గత జూన్ 23 నుండి నిలిచిపోయిన బకాయిలు సుమారు ₹ 1000 కోట్లకు చేరటం తదితర కారణాల వల్ల ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నాయి.

దీనికి తోడు సుదీర్ఘకాలంగా ఆరోగ్యశ్రీ పథకం అమలులోని సమస్యలు పరిష్కారంకాకపోవటం, దశాబ్దకాలంగా వివిధ ప్రొసీజర్లు, సర్జరీల ప్యాకేజిలు పెంచకపోవటం వంటి కారణాల వల్ల ఆసుపత్రుల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వపథకానికి ఆసుపత్రులు తమ సొంత నిధులను ఖర్చుచేయటం ఇక ఎంత మాత్రం సాధ్యం కాదు. అందువల్ల ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులు ( ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుండి సహకారాన్ని కోరుకుంటున్నాయి.) ఆరోగ్యశ్రీ సేవలు నిలిపి వేయుటకు నిర్ణయించడమైనది.

LEAVE A RESPONSE