Home » అయోధ్య రామమందిరంపై ఉగ్రవాదుల రెక్కీ?

అయోధ్య రామమందిరంపై ఉగ్రవాదుల రెక్కీ?

– నేపాల్ నుంచి యుపీలో ప్రవేశం
– ఆత్మాహుతి దళాల ప్రవేశంపై సమచారం
-ఐబీ హెచ్చరికలతో భద్రతా దళా అప్రమత్తం

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రామమందిరంపై ఉగ్రదాడిపై నిఘా సంస్థలు అప్రమత్తం చేశాయి. ఈ క్రమంలోనే భారత భద్రతా సంస్థలు రామమందిరంపై దాడికి ప్రకారం ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. సోమవారంజనవరి 16న నిఘా వర్గాలు జారీ చేసిన హెచ్చరికల మేరకు అయోధ్య రామమందిరంపై ఉగ్రవాదులు రెక్కీ చేసినట్టు తెలిసింది.

అయోధ్య రామమందిరం దగ్గర జైషే మహ్మద్‌ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి కుట్ర చేసినట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. నేపాల్‌ నుంచి ఉత్తరప్రదేశ్‌‌లోకి ప్రవేశించేందుకు టెర్రరిస్టులు ప్రయత్నిస్తునట్టు ఐబీ హెచ్చరించింది. నిఘా వర్గాల హెచ్చరికల తరువాత అయోధ్యతో భద్రతను కట్టుదిట్టం చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి నిఘాను ఏర్పాటు చేశారు అధికారులు. ఇప్పటికే 50 శాతం ఆలయ నిర్మాణం పనులు పూర్తయిన నేపథ్యంలో ఇటీవలే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వచ్చే ఏడాది మొదటి నాటికి జనవరి 1, 2024 అయోధ్య రామమందిర పనులు పూర్తయి, ఆలయం ప్రారంభమవుతుందని ప్రకటించారు.

రానున్న రోజుల్లో అయోధ్యలోని రామ మందిరంపై దాడికి పాక్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ యోచిస్తున్నట్లు నిఘా సంస్థలకు సమాచారం అందింది. పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ దాడికి కుట్ర పన్నినట్లు విశ్వసనీయ వర్గాల నుంచి భారత నిఘా సంస్థలను సమాచరం అందినట్లు తెలుస్తోంది.నిఘా సంస్థలకు అందిన సమాచారం ప్రకారం.. ఉగ్రవాదులు దాడి చేయడానికి పాకిస్తాన్ నుంచి నేపాల్, ఆపై నేపాల్ మీదుగా భారత్‌లోకి ప్రవేశించాలని ప్లాన్ చేస్తున్నారు.

జైషే మహ్మద్ నేపాల్ మార్గంలో భారతదేశంలో ఆత్మాహుతి దళాన్ని అంటే ఆత్మాహుతి బాంబర్ స్క్వాడ్‌ను పంపి దాడికి ప్లాన్ చేస్తోందని తెలిసింది.రామ మందిర నిర్మాణం జరుగుతున్న అయోధ్యలో ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఇంటెలిజెన్స్ ఏజెన్సీల హెచ్చరిక తర్వాత ఉత్తర ప్రదేశ్ పోలీసులు మునుపటి కంటే మరింత అప్రమత్తంగా ఉన్నారు. అంతే కాక ఉగ్రవాదుల ప్రణాళికలు విజయవంతం కాకుండా భద్రతా వ్యవస్థను కట్టుదిట్టం చేశారు…

Leave a Reply